తెలుగు హీరో మోసం చేశాడంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆత్మహత్య యత్నం ఘటన తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన లోకేష్ అనే యువకుడు.. "జెట్టి" సినిమా హీరో తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. కాగా లోకేష్ రాసిన లేఖలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సూసైడ్ నోట్‌లో సంచలన ఆరోపణలు..

సినీ నటుడు మాన్యం మురళీకృష్ణ పేరును ప్రస్తావిస్తూ, రైల్వే కాంట్రాక్ట్ పేరుతో తనను నమ్మబలికి భారీగా డబ్బులు తీసుకున్నాడని ఆరోపించాడు. బంధువుల ద్వారా మొత్తం రూ.3.15 కోట్లు సమకూర్చి ఇచ్చినట్లు తన లేఖలో పేర్కొన్నాడు. డబ్బులు సమకూర్చేందుకు తాను తన ఇల్లు తాకట్టు పెట్టడంతో పాటు బంధువుల దగ్గర అప్పులు చేశానని లోకేష్ పేర్కొన్నాడు. ఇంత మొత్తాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి పని జరగకపోవడంతో తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురయ్యానని తన లేఖలో వాపోయాడు. అంతే కాకుండా తన పరిస్థితి దయనీయంగా మారిన తర్వాత కనీసం ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.20 లక్షలు సహాయం చేయమని అడిగినా, పట్టించుకోలేదని లోకేష్ ఆరోపించాడు. ఈ నిర్లక్ష్యం తనను తీవ్ర నిరాశలోకి నెట్టిందని పేర్కొన్నాడు.

young-man-suicide-attempt-at-chittoor-district-for-alleging-jetty-movie-hero-cheated-him

సదరు లెటర్ లో.. "అమ్మానాన్న క్షమించండి" అంటూ భావోద్వేగంగా ప్రారంభమైన లేఖలో, తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నాడు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని అధికారులను, సమాజాన్ని కోరాడు. తన కుటుంబం అప్పుల భారంతో కష్టాల్లో పడకుండా చూడాలని అభ్యర్థించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. లోకేష్ ఆరోపణలపై వాస్తవాలు వెలికితీయడానికి సంబంధిత వ్యక్తులను విచారించే అవకాశముంది. ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు దృష్టి సారించారు.

ఇక నందితా శ్వేత, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'జెట్టి' (2022) మత్స్యకారుల జీవిత నేపథ్యంతో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం [Aha (ఆహా)] ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+