వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact Check - గతంలో దేశంలో వ్యాక్సిన్ల కొరత- మోడీ వాదనలో నిజమెంత ?

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కరోనా కల్లోలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ డ్రైవ్ చేపట్టింది. అయితే తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోయినా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రకటించిన కేంద్రం అభాసుపాలవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని కౌంటర్‌ చేసే క్రమంలో నిన్న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ గతంలో భారత్‌లో వ్యాక్సిన్లే లేవన్నట్లుగా మాట్లాడారు. దీంతో మోడీ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై ప్రముఖ జాతీయ పత్రిక ద హిందూ నిజనిర్ధారణ చేసి వివరాలు వెల్లడించింది.

భారత్‌ స్వాతంత్రానికి ముందే వ్యాక్సిన్లు కలిగిన దేశాల జాబితాలో చోటు కలిగి ఉంది. కానీ నిన్న జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ.. స్మాల్‌పాక్స్‌, హెపటైటిస్‌ బీ, పోలియో ఇలా అన్ని వ్యాక్సిన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ఎదురుచూసేందంటూ వ్యాఖ్యానించారు. మిగతా దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ముగిసినా భారత్‌లో మొదలయ్యేవే కావంటూ మోడీ మరో వ్యాఖ్య కూడా చేశారు. వీటిపై దేశ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Fact Check | History shows India did not lack access to vaccines as claimed by PM Modi

2012లో డాక్టర్ చంద్రకాంత్ లహరియా వ్యాక్సిన్ల పుట్టుపూర్వోత్తరాలపై ఇండియన్ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌కు రాసిన వ్యాసంలో భారత్‌ 1802లోనే వ్యాక్సిన్లను కలిగి ఉందని తెలిపారు. ఎడ్వర్డ్‌ జెన్నర్‌ తొలి టీకా కనిపెట్టిన నాలుగేళ్లకే భారత్‌లో స్మాల్‌పాక్స్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచన్నారు. అయితే వ్యాక్సిన్లు నిల్వచేసే విషయంలో ఇబ్బందుల కాారణంగా 1850 వరకూ మనం విదేశీ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకున్నాం. 1895 నాటికి భారత్‌ వ్యాక్సిన్ల నిల్వ సామర్ధ్యాన్ని కూడా సాదించింది. 1890లో షిల్లాంగ్‌లో తొలి వ్యాక్సిన్‌ డిపో ప్రారంభమైంది. అక్కడి నుంచే వ్యాక్సిన్ల తయారీ జరిగేది.

అంతేకాదు భారత్‌లో ఓ సారి వ్యాక్సినేషన్ మొదలయ్యాక కొరతతో ఆగిందే లేదు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో స్మాల్ పాక్స్‌ కేసులు పెరిగి వ్యాక్సిన్లు సరిపోకపోయినా 1947 నాటికి తిరిగి భారత్‌ వ్యాక్సిన్లలో స్వయం సమృద్ది సాధించింది. ఆ తర్వాత పోలియో, బీసీజీ టీకాల విషయంలోనూ భారత్‌ అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందుంది. అంతెందుకు కరోనా రాకముందే ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి చేస్తున్న సంస్ధగా పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రఖ్యాతి చెందింది. కానీ ప్రధాని వ్యాఖ్యలు ఇందుకు విరుద్ధంగా ఉండటంతో జనం ఆశ్చర్యపోతున్నారు.

Fact Check

వాదన

మోడీ సర్కారు రాకముందే భారత్‌లో వ్యాక్సిన్ల కొరత

వాస్తవం

భారత్‌ స్వాతంత్రానికి ముందే వ్యాక్సిన్ల విషయంలో స్వయం సమృద్ధిగా ఉంది.

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
Prime Minister Narendra Modi’s speech on Monday presented a view of India’s vaccination history that is at odds with the facts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X