Fact Check : అది ఇండియన్ వేరియంట్ కాదు.. డబ్ల్యూహెచ్ఓ అలా చెప్పలేదు..
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభించడానికి ఇండియన్ వేరియంట్ B.1.617 కారణమంటూ డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్నట్లుగా ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
'ఇండియన్ వేరియంట్' అనే వేరియంట్ ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదని కేంద్రం వెల్లడించింది. కరోనా B.1.617 వేరియంట్‌ను 'ఇండియన్ వేరియంట్' అని డబ్ల్యూహెచ్ఓ ఎక్కడా చెప్పలేదని,ఏ రిపోర్టులోనూ పేర్కొనలేదని తెలిపింది. ఇదివరకే మే 12న దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై స్పష్టతనిచ్చింది. కాబట్టి ఇండియన్ వేరియంట్ అనే కంటెంట్‌తో కూడిన కథనాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించాల్సిందిగా కేంద్రం విజ్ఞప్తి చేసింది.

కొద్ది రోజుల క్రితం డబ్ల్యూహెచ్ఓ చేసిన ప్రకటనతో ఈ ప్రచారం మొదలైంది. భారత్‌లో గుర్తించిన కరోనా వేరియంట్ ఒరిజినల్ కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే దాన్ని ఇండియన్ వేరియంట్ అని పేర్కొంటూ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. డబ్ల్యూహెచ్ఓ నివేదికలో ఎక్కడా ఇండియన్ వేరియంట్ అనే పదం లేదని కేంద్రం వెల్లడించింది. కాబట్టి ఆ పదాన్ని ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.

Fact Check
వాదన
B.1.617 అనేది ఇండియన్ వేరియంట్ అనే ప్రచారం
వాస్తవం
డబ్ల్యూహెచ్ఓ 'B.1.617'ని ఇండియన్ వేరియంట్‌గా పేర్కొనలేదు.












Click it and Unblock the Notifications