చిరంజీవితో జెపి పోటీ

Chiranjeevi
నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముందు రోజు, అవతరణ దినోత్సవం రోజు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ(జెపి), ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి తమ ప్రకటనలో రాష్ట్రం ఒక్కటిగానే ఉండాలని అభిప్రాయం చూచాయగా వ్యక్తపరిచారు. రాష్ట్రాన్ని విడగొట్టే ప్రక్రియను తాము అంగీకరించమని మరోసారి చెప్పకనే చెప్పారు. 22 భాషలున్న భారత్ బలమైన సమాఖ్య వ్యవస్థగా నిలదొక్కుకున్నది. అందుకు కారణం 1956 వ సంవత్సరంలో నవంబర్ 1న భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడమే. అప్పుడు 14 భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలను కలిపిన సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినం అన్నట్టుగానే, నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకోవాలని తన ప్రకటనలో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అనగా, తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక్క రాష్ట్రంలోనే ఉండాలని లక్ష్యంతో పొట్టి శ్రీరాములు, మాడపాటి హనుంతరావుల కృషితో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చిరంజీవి అన్నారు. ఇప్పటికే పలుమార్లు వారి సమైక్యవాదం బయటపడింది. ఈ వాఖ్యలతో మరోసారి వారి ఉద్దేశ్యాలు బయట పడ్డట్టు అయ్యింది. వారి మాటలను తెలంగాణవాదులు జీర్ణించుకోలేక పోతున్నారు.

చిరు, జెపి ఇద్దరు కూడా మార్పు పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన వారే. అయితే ప్రజల అభిప్రాయమే తమ అభిప్రాయంగా వచ్చి వారు తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజల అభిప్రాయాన్ని గాయపర్చే విధంగా నడుచుకుంటున్నారు. తెలంగాణ అంశంతో సామాన్య సీమాంధ్రులకు సంబంధం లేని విషయం. ఎందుకంటే వారికి తెలంగాణ ప్రజల కష్టాలు, నష్టాలు తెలియవు. అంధ్ర రాజకీయ నాయకుల చేతుల్లో తెలంగాణ తన భవిష్యత్తు ఎంతగా కోల్పోయిందో తెలంగాణ వారికే తెలుసు. వారికి తెలియదు. అందుకే రాష్ట్రాన్ని విడగొడుదామంటే సామాన్య సీమాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేయటాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలరు. అందుకే వారు ఎన్ని ఉద్యమాలు చేసినా సామాన్య సీమాంధ్రులను ఏ ఒక్క తెలంగాణవాది కూడా విమర్శించటం లేదు. తెలంగాణవాదులు కేవలం సీమాంధ్ర నాయకులను, పారిశ్రామికం పేరుతో తెలంగాణను కొల్లగొడుతున్న వారిపట్ల మాత్రమే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అధికార దాహం కలిగిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీని పక్కన పెడితే మార్పు పేరుతో వచ్చినందున, కనుచూపు మేర అధికారంలోకి రాలేని ప్రజారాజ్యం, లోక్ సత్తా(అధికార వాంఛతో ఇతర పార్టీలతో కలిస్తే తప్ప) సామాన్య సీమాంధ్రులకు తెలంగాణకు జరిగిన నష్టాన్ని వివరించి రాష్ట్ర విభజనకు ఒప్పించాల్సింది పోయి వారే తెలంగాణకు ఉద్దేశ్య పూర్వకంగా వ్యతిరేతను ప్రదర్శించడాన్ని తెలంగాణలోని వారి పార్టీన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పదికోట్ల మందిలో నాలుగు కోట్ల మంది తెలంగాణలో ఉన్నారు. పార్టీలకతీతంగా అందరికి అందరూ తెలంగాణకు కోరుకుంటున్నారు. ప్రజలకే తమ మొదటి ప్రాధాన్నమన్న జెపి, చిరు మరి ఆ నాలుగు కోట్ల ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ఉండటమే వారు తీసుకు వచ్చే మార్పా! సమస్యలకు, రాజకీయాలకు చిరంజీవి కొత్త కాబట్టి ఆయనను పక్కన పెట్టవచ్చుననుకున్నా తెలంగాణలోని ఆయన అభిమానులు చిరు తెలంగాణకు సయ్యంటేనే మేం చిరుకు మద్దతిస్తామని బాహాటంగా చెబుతున్నారు. అలాంటప్పుడు ఆయన అభిమానుల ఉద్దేశ్యాలనైనా పరిగణలోకి తీసుకోవాల్సింది పోయి, తెలంగాణలో చిరు అభిమానులతో సహా ప్రరాపా మొత్తం ఖాళీ అవుతున్నా ఆయనకు తెలంగాణ ప్రభావం కనిపించటం లేదా.

జెపి తెలంగాణకు సానుకూలంగా లేడని ఇప్పటికే తెలంగాణలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ లోక్ సత్తా పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసి జేపి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నందువల్లే తాము పార్టీని ఏర్పాటు చేసినట్లు బాహాటంగానే ప్రకటించారు. సమస్యలు, రాజకీయం, ప్రజలు, చట్టం పట్ల పూర్తిగా అవగాహన ఉన్న జెపి తెలంగాణ అజ్ఞానా? 55 ఏళ్ల తెలంగాణ ఏం కోల్పోయిందో ప్రజల మార్పు కోసమే లోక్ సత్తా అంటున్న జెపికి తెలియదనుకోవాలా. ప్రజల కోరికను దూరంగా పెడుతున్న జెపి మార్పును తీసుకు వస్తాడని ఎలా అనుకోగలం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+