వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు కన్నా చిరంజీవి నయం

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తెలంగాణ అంశానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కన్నా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవే చాలా వరకు నయమనిపిస్తారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన చిరంజీవి తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించగానే ప్లేటు ఫిరాయించారు. తన వైఖరిని పూర్తిగా తలకిందులుగా మార్చేసుకున్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర నినాదం పుచ్చుకున్నారు. అయితే, ఈ విషయంలో చిరంజీవి వైఖరి స్పష్టంగానే ఉంది. తెలంగాణకు బద్ధ వ్యతిరేకత ప్రదర్శించడం ద్వారా చిరంజీవిని తెలంగాణవాదులు తమ ప్రత్యర్థిగా ఎంచుకోవడానికి ఇబ్బంది కలగలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వైఖరే విచిత్రంగా, అయోమయంగా ఉంది. చెప్పాలంటే, తెలంగాణ వ్యతిరేక వైఖరినే తీసుకున్నా, రెండు ప్రాంతాలు తమకు సమానమంటూ సమైక్యవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు.

పార్టీపరంగా కమిటీ వేసి, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పొత్తు పెట్టుకున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని చెప్పించారు. ఇదంతా జరిగిన తర్వాత కేవలం రాత్రికి రాత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారని చంద్రబాబు మెలిక పెట్టారు. అంత చర్చ జరిగి, నిర్దిష్టమైన వైఖరి తీసుకున్న తర్వాత అర్థరాత్రి ప్రకటిస్తే ఏమిటి, పగటి పూట ప్రకటిస్తే ఏమిటని ప్రశ్నించేవారు లేరు. ఆ తర్వాత సీమాంధ్ర ప్రజల అభిప్రాయాల మేరకు స్పందించడానికి ఆ ప్రాంత నాయకులకు స్వేచ్ఛనిచ్చానని అంటున్నారు. తెలంగాణపై అధ్యయనానికి వేసిన కమిటీలో ఎర్రంనాయుడు వంటి సీమాంధ్ర నాయకులు కూడా ఉన్నారు. వారే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించారు. అంటే, వారు సీమాంధ్ర ప్రజల మనోగతాన్ని అధ్యయనం చేయకుండానే తెలంగాణకు అనుకూలంగా సిఫార్సు చేశారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

సరే, ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని పార్టీపరంగా సమీక్షించి, వెనక్కి తీసుకున్నారా అంటే, అదీ లేదు. అటువంటప్పుడు పార్టీ తెలంగాణ అనుకూల వైఖరే చెలామణిలో ఉండాలి. ఈ పార్టీ తెలంగాణ అనుకూల వైఖరికి వ్యతిరేకంగా పనిచేసిన సీమాంధ్ర నేతలు క్రమశిక్షణను ఉల్లంఘించారని చెప్పాల్సి వస్తుంది. వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, చంద్రబాబు అందుకు విరుద్ధమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. తెలంగాణ అనుకూల వైఖరిని వెనక్కి తీసుకోకుండా పార్టీ వైఖరిని మాట్లాడుతున్న నాయకులపై చర్యలకు దిగుతున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు కన్నా చిరంజీవి ఒక విధంగా మెరుగు అని చెప్పాల్సి వస్తోంది.

English summary
Chiranjeevi is better than Chandrababu on Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X