• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ ప్రసంగాన్ని ఎందుకు ప్రేమించానంటే...

By Pratap
|

ఇండియా టుడే నాయకత్వ సదస్సు జరిగే తాజ్‌లోకి నరేంద్ర మోడీ ప్రవేశించారో లేదో టీవీ స్టూడియోల్లో, సోషల్ మీడియాలో, సదస్సు వేదిక వద్ద విభిన్నమైన ఉత్సుకత చోటు చేసుకుంది. తన విస్తృతమైన ప్రసంగంలో ఆయన యుపిఎ ప్రభుత్వం ఫెడరల్ నిర్మానాన్ని ధ్వంసం చేయడం దగ్గరి నుంచి, తాను ఎందుకు ఎఫ్‌డిఐలను వ్యతిరేకించారో వరకు చెప్పారు. పొరుగు దేశాలతో సంబంధాల నుంచి గుజరాత్‌లో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి, ఇతర రంగాల్లో తాను అభివృద్ధికి చేస్తున్న కృషి వరకు ఆయన తన ప్రసంగంలో తడిమారు.

ఓ తటస్థ రాజకీయ పరిశీలకుడిగా, సాధారణ పౌరుడిగా మనలను బాధపెడుతున్న ప్రతి అంశం గురించి మాట్లాడిన మోడీకి నేను పూర్తి మార్కులు ఇస్తున్నాను. సాధారణ పౌరులుగా మనం ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కారాలను చూపడమే కాకుండా అత్యుత్తమమైంది ఇంకా రావాల్సే ఉందనే హామీ ఇచ్చారు. అంధకారం, నిరాశావాదం అలుముకున్న ప్రస్తుత తరుణంలో మనలో ఆశను రేకత్తించారు, మనపై మనం నమ్మకం ఉంచడమని చెప్పారు.

Narendra Modi

మోడీ ఇండియా టుడే సదస్సులో చేసిన ప్రసంగం నిజమైన నాయకుడి నుంచి ఆశించిన అద్భుతమైన, వాదనతో కూడిన, దృఢత్వంతో మిళితమైందని చెప్పడానికి నేను ఐదు కారణాలు చూపిస్తాను.

మొదటి కారణం - ఆకాంక్ష, అభివృద్ధి అనేది ముక్కలు విసిరేయడం, ప్రజాకర్షణ విధానాలు ప్రభుత్వం కాదు.

మోడీ తన ప్రసంగంలో చాలా ముందుగానే ఎన్ఆర్ఇజిఎ గురించి ప్రస్తావించారు. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మనిషి ఎలా ఆలోచిస్తాడనే అద్భుతమైన దృష్టి కోణాన్ని ఆయన అందించారు. ప్రజలకు మేలు చేయడానికి మైండ్ సెట్ మార్పును ఆయన మనకు చూపించారు. ఎన్ఆర్ఇజిఎను పాలకులు ఉపాధి హామీ పథకమని పిలువడానికి బదులు అభివృద్ధి గ్యారంటీ పథకమని ఎందుకు చెప్పరని ఆయన అడిగారు. తాము దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామనే భావనను ప్రజలను నమ్మించి, వారిని ఎందుకు సమీకరించడం లేదనే విషయంపై ఆయన ఆలోచనలను రేకెత్తించే విషయాలు చెప్పారు.

రెండో కారణం - ఇతర నాయకుల ఆలోచనలోకి రాని దశకు మోడీ వెళ్లారు.

చెడు రాజకీయాలతో ఉత్తమ ఆర్థిక వ్యవస్థను ఆశిస్తున్న చోట ఒక నాయకుడు రాజకీయ వ్యవస్థలో ప్రవేటీకరణను, సంస్కరణలను సమర్థించిన రాజకీయ నాయకుడిని చివరి సారి (నిజానికి ఇదే మొదటిసారి) ఎప్పుడు చూశాం?

రైల్వేల గురించి మోడీ మాట్లాడింది చిన్న విషయమేమీ కాదు. ఉత్తమ ఆర్థిక రంగంతో పాటు మోడీ సంస్కరణవాద ఆలోచనలో అది కూడా అతి ముఖ్యమైంది. మన రైళ్లలో ఏళ్ల తరబడిగా ప్రమాణాలను, సౌకర్యవంతమైన భావనను పెంచడంలో విఫలమయ్యాం. ట్రాక్స్‌ను పెంచలేదు, స్టేషన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఫలితం సాధారణ పౌరులు బాధితులు. గత దశాబ్ద కాలంగా సంకుచిత రైల్వే మంత్రులు రైళ్లను, ఇతర కేటాయింపులను తమ సొంత రాష్ట్రాలకు మళ్లించుకున్నారు.

తన ప్రసంగంలో మోడీ దాన్ని సవాల్ చేశారు. దేశంలో నిరుపేదలకు అవసరమైన రంగంలో సాహసోపేతమైన సంస్కరణలను ఆశిస్తున్న నాయకుడిని చూసినందుకు నాకు ఆనందంగా ఉంది. సందీప్ బాంజాయ్ వేసిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఆయన ప్రైవేటీకరణను కాస్తా తేడాతో చూపించారు. ప్రభుత్వాలు వ్యాపారంలో చేయాల్సిన అవసరం లేదని మరోసారి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు సమస్యలు ఎదుర్కుంటుంటే వాటిని పరిష్కరించాలని చెప్పారు. అదే గుజరాత్‌లో చేశారు. గుజరాత్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు వెలిగిపోతుండడమే కాకుండా దేశాభివృద్ధికి పెద్ద యెత్తున ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు వచ్చాయి.

మూడో కారణం - ఎల్ల వేళలా భారత్ ప్రథమం

మోడీ ప్రసంగంలో నొక్కి వక్కాణించాల్సిన అంశం జాతీయ పునరుత్తేజం. మోడీ గుజరాతీగానో, ఎక్స్, వై , జడ్ గ్రూపునకు చెందిన వ్యక్తిగానో మాట్లాడలేదు, ఓ భారతీయుడిగా మాట్లాడాడు. పొరుగుదేశాలతో స్నేహసంబంధాలను పెంపొందించుకోవాలని అంటూ అవి దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించకూడదని మోడీ స్పష్టంగా చెప్పారు. ఆయుధాల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలనేది తన కల అని చెబుతూ కొద్ది రాజకీయ నాయకులతో కలిసి దేశ గౌరవాన్ని దెబ్బ తీసే దుర్మార్గమైన ఆయుధాల డీలర్ల వల నుంచి బయటపడాల్సిన అవసరం గురించి మోడీ మాట్లాడారు.

నాలుగో కారణం - సంసిద్ధత వ్యక్తం చేయడం వల్ల...

మోడీ ప్రసంగం వినడానికి నేను సిద్ధపడినప్పుడు చిన్న పాటి వ్యవహారంగానే ఉంటుందని అనుకున్నాను. ప్రసంగం ఉంటుంది, కొన్ని ప్రశ్నలుంటాయి, ఇంటికి వెళ్లిపోతామని భావించాను. అది పూర్తిగా తప్పు అని తేలిపోయింది. మోడీ మాట్లాడడమే కాకుండా అద్భుతమైన శైలిలో ప్రసంగాన్ని మన ముందుంచారు. తనకు వేసిన ప్రశ్నలకు సవివరంగా గొప్ప స్పూర్తితో సమాధానాలు ఇచ్చారు.

పాలక కుటుంబం సంసిద్ధతతో లేని దేశంలో, ప్రధాని ఎప్పుడో గానీ నోరు విప్పని దేశంలో మోడీ తాజా శ్వాసను అందిస్తున్నారు. మోడీమాదిరిగా సమగ్రంగా ప్రజలతో కలిసి పనిచేస్తున్న నాయకుడు కేంద్రంలో గానీ, రాష్ట్రాల్లో గానీ లేడు.

ఆర్థిక వ్యవస్థ గురించి గానీ కుటీర పరిశ్రమ గురించి గానీ, దేని గురించి ప్రశ్న వచ్చినా సమాధానం ఇవ్వడానికి సిద్ధపడిన నాయకుడిగా మోడీ కనిపించారు. అల్లర్ల గురించి జావెద్ అన్సారీ వేసిన అనవసరమైన ప్రశ్నకు మోడీ ఇచ్చిన సమాధానం విని నేను ఎక్కడ లేని సంతోషాన్ని పొందాను. ఒక్కసారి కాదు, పలు మార్లు వాటిిక కోర్టులు, ప్రజలు సమాధానం ఇచ్చినా పిడికెడు మంది కార్యకర్తలు మోడీని గాయపరుస్తున్నారు.

ఐదో కారణం - మరీ ముఖ్యంగా, మోడీ ప్రతి విషయాన్ని అతిశయోక్తులతో కాకుండా వాస్తవాలపై ఆధారపడి చెప్పడం..

మీ తల్లి మిమ్మల్ని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారా అని అడిగితే చర్చ అభివృద్ధిపై, ఇక్కడ తల్లులు, తండ్రులు ప్రస్తావనలోకి రారని అతి మమూలుగా సమాధానమిచ్చారు. విషాద కథలు కాదు, పని మాత్రమే మాట్లాడుతుంది.

ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని వాస్తవాలపై ఆధారపడే చెప్పారు. ఘన వ్యర్థపదార్థాల నిర్వహణ ప్రణాళిక కావచ్చు, సౌర విద్యుచ్ఛక్తి ప్రాజెక్టు కావచ్చు, ప్రతి విషయాన్ని గణాంకాలతో చెప్పారు. సంసిద్ధతతో రాలేదని ఎవరూ చెప్పలేరు, చాలా సంసిద్ధతతో వచ్చారు. ప్రసంగానికి ముందు మోడీ చూపిన చిత్రం చర్చకు అవసమైన దృక్పథాన్ని అందించింది, గుజరాత్ ఏ విధంగా అభివృద్ధి చెందుతోందనే విషాయన్ని కళ్లకు కట్టింది.

పని చేయడానికి సిద్ధపడిన, దేశాన్ని ముందుకు నడిపించడానికి ప్రణాళిక ఉన్న నాయకుడిగా మోడీని గుర్తుంచుకునేలా ప్రసంగం సాగింది. ప్రతి విషయంలోనూ మోడీ నుంచి మన నాయకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

- కిశోర్ త్రివేది

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kishore Trivedi writes -"No sooner did Narendra Modi enter the Taj in Delhi for the India Today Conclave 2013 than the excitement reached a completely different crescendo, in TV studios, on social media and of course at the conclave venue. In an exhaustive speech, Modi covered every minute aspect of governance ranging from the UPA’s assault to the nation’s federal structure, why he opposes FDI in retail, his views of relations with our neighbours to Gujarat’s success in agriculture, his take on development among other things".
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more