ఉద్దీపనలతో ఎంతో కాలం ఊపిరిలూదలేరు!

మధ్య తరగతి అంతర్థానం గురించి కార్ల్ మార్క్స్, ఎంగెల్స్‌లు తమ ‘‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక''లో ఈ విధంగా అంచనా వేశారు: ‘‘..కానీ, బూర్జువా యుగం అంటున్న ఈ మన యుగానికి ఒక విశిష్టమైన లక్షణం వుంది: అది వర్గ వైరుధ్యాలలోని సంకీర్ణతను తొలగించింది. అంతవరకూ మొత్తం సమాజమంతా బూర్జువా వర్గం, కార్మికవర్గం అనే రెండు మహాత్తర శత్రు శిబిరాలుగా, పరస్పరాభియుగాలైన రెండు మహా వర్గాలుగా చీలి పోతున్నది. ‘‘అదీ, విషయం, సుమారుగా 165 సంవత్సరాల క్రితమే మార్క్స్, ఎంగెల్స్‌లు వివరించినదిది.''
మరి నేడు; ఈ మధ్యతరగతి జరుగుతోన్న తీరు, క్రమం ఏమిటి? ఈ అంశాన్ని మనం 1980 దశకం నుంచి జరుగుతోన్న మార్పుల క్రమంలో భాగంగా చూడాలి. 1980వ దశకంలో - ప్రపంచంలో మొదటి దశలో ‘‘రోబోట్ల'', ‘‘‘కంప్యూటర్ల'' వినియోగం జరగసాగింది. ఈ దశలోని సాంకేతిక ‘పురోగతి' క్రమంలో- పలు రకాల మధ్య తరగతి ఉద్యోగులు అంతర్థానం అయిపోయారు. ఉదాహరణకు, కంప్యూటరీకరణ, రోబోట్ల వలన- బుక్ కీపింగ్, గుమస్తా ఉద్యోగాలు, సరుకు ఉత్పత్తి రంగంలోని కొన్ని తరహాల ఉద్యోగాలు అదృశ్యం అయ్యాయి. ఈ రంకగా ఉపాధి యావత్తూ -మధ్యతరగతి వేతనాలు చెల్లించేదే. ఈ విధంగా ఈ క్రమం 1980లలో ఆరంభమై అనంతరం వేగం పుంజుకుంది.
మించి, ఈ మధ్య కాలంలో ఆటో మేషన్ లేదా మరమనుష్యుల (రోబోట్ల) వినియోగంలో రెండవ దశ ఆరంభం అయ్యింది. దీనిలో భాగంగా- సరికొత్త ‘‘బాక్స్‌టర్'' రోబోట్లు రంగ ప్రవేశం చేశాయి. ఇవి మొదటి తరం రోబోట్లకంటే పనితీరులో మరింత మెరుగైనవీ, చౌకైనవీ కూడా. వీటిని చిన్న తరహా సరుకు ఉత్పత్తి పరిశ్రమలలో కూడా వినియోగించవచ్చును. ఉదాహరణకు ఈ మధ్యనే అమ్మకానికి వస్తోన్న ‘‘ కివా ''అనే రోబోటును చూడవచ్చును. ఈ రోబోటును కొనేందుకు అమెజాన్ వంటి ఈ కామర్స్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయట. కస్టమర్ల ఆర్డర్లను గోడౌన్లు, వేర్ హౌజ్‌ల నుంచి ఈ రోబోట్లు, ప్యాకింగ్ చేసే ఉద్యోగుల వద్దకు తీసుకువస్తాయి. తద్వారా ఆ పని తాలూకు మానవ శ్రమ, సమయం పొదుపు అవుతాయి. ఉదాహరణకు అమెజాన్ కంపెనీలోని-ఈ పనిని చేసే కార్మికులు, కస్టమర్ల ఆర్డర్లను ఏరి తీసుకువచ్చేందుకూ, వాటిని ప్యాకింగ్ విభాగానికి చేర్చేందుకూ, రోజువారీ 10 మైళ్ల దూరం నడవవలసి వస్తోందట. ప్రస్తుతం ‘‘కివా'' రోబోట్ల రాకతో- కంపెనీలో ఈ తరహా పనికి కాలం చెల్లిపోయింది. అదీ కథ. అలాగే, ఈ దశ యాంత్రీకరణ వలన పలు రకాల సేవారంగం ఉద్యోగాలు కూడా పోతాయి. నేడు, వైద్య వృత్తి, న్యాయవాద వృత్తి, ఉపాధ్యాయ రంగాలపై కూడా చాలా మేరన ఆధునిక మరమనుషులూ, యాంత్రీకరణల ప్రభావం పడుతోంది.
అంటే; 1980 దశకంలో- వెల్డింగ్, పెయింటింగ్ (కార్ల రంగం వంటి వాటిలో) పనులతో సహా గుమస్తా ఉద్యోగాలూ, సేల్స్ రంగం ఉపాధి, నిర్మాణ రంగంలోని ఉపాధి వంటివి దెబ్బతిన్నాయి. నేడు; ఈ వివిధ రకాల ఉపాధుల అంతర్థానం వేగవంతం అవుతోంది. దీనినే నేడు ఆర్థికవేత్తలు ‘‘ఉపాధి రహిత అభివృద్ధి''గా పిలుస్తున్నారు. ఈ క్రమంలో, ప్రపంచ వ్యాప్తంగా సమస్య భారీగా పెరిగిపోయింది. కాగా, మరో 2 దశాబ్దాల కాలంలో ఈ సమస్య మరింత జటిలమవుతుందట. ఒక అధ్యయనం ప్రకారం రానున్న 20 సంవత్సరాల కాలంలో, అమెరికా దేశంలోని 45శాతం ఉద్యోగాలు అంతరించిపోతాయి. కేవలం ‘సృజనాత్మకత, సామాజిక నిపుణతలు' అధికంగా అవసరమైన, అధిక వేతనాల పైస్థాయి ఉద్యోగాలు మాత్రమే, ముందు ముందు కొనసాగుతాయి.
మొత్తంగా ఈ ఆధునిక రోబోట్లు, కంప్యూటర్ల వలన, నేడు ఆర్థిక రంగంలో ఉత్పాదకత రికార్డు స్థాయిలో వుంది. కొత్త ఆవిష్కరణలు మరింతగా మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ, అదే సమయంలో ప్రజలకు కడగండ్లు పెరుగుతున్నాయి. దానికి కారణం ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోవడం. యూరోప్‌తో సహా నేడు ప్రపంచంలోని పలు చోట్ల విపరీత స్థాయిలో పెరిగిపోయిన నిరుద్యోగమే దానికి తార్కాణం. ఈ పరిణామం వలన, నూతనతరం యువతీయువకులు అనేకమంది, నిరుద్యోగులూ, చిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఈ తరం వారినే నేడు పాశ్చాత్య దేశాలలో ‘కోల్పోయిన తరం'గా పిలుస్తున్నారు. అదీ విషాదం.
ఉత్పత్తి శక్తుల అభివృద్ధి క్రమంలో ఇటువంటి పరిణామాన్ని ముందుగానే అంచనా వేసిన కార్ల్ మార్క్స్ ఈ పరిణామం గురించి ఇలా అన్నారు‘‘..పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి క్రమంలో, ఒకనొక దశలో ఉత్పత్తి శక్తులు, వినాశకర శక్తులుగా తయారవుతాయి..'' అదీ సంగతి. కాబట్టి; రానున్న అనతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థాగతంగా పెను మార్పులు జరగకుండా-జన సామాన్యం జీవితాలు తిరిగి సాధారణ స్థితికి, మెరుగైన స్థితికీ చేరుకోదు.. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, వివిధ దేశాలు, కేవలం నగదును ముద్రించి, దాని చలామణీని పెంచడం ద్వారా, సమస్యలను అట్టే కాలం వాయిదా వేయలేవు. అంతిమంగా, వ్యవస్థాగత తగ్గుదలను, సమూలంగా ప్రక్షాళన చేయడం తప్పనిసరి అవసరం...
-డి. పాపారావు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications