వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు నిండుకుంటే ఆకస్మిక ధన నష్టం.. ఆపై మీ ఇష్టం

వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఖాళీగా ఉంటే ఆర్థిక కష్టాలు, ప్రతికూలతలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం దూరం అవుతుంది. మీ ఇంటి శ్రేయస్సు కోసం ఏ వస్తువులు ఖాళీగా ఉండకూడదో ఇప్పుడు చూద్దాం. ఇంటి సుఖశాంతులు పెద్ద విషయాలపైనే కాకుండా, రోజువారీ చిన్న అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. కొన్ని వస్తువులు ఖాళీగా ఉంచడం ఆర్థిక ప్రతిబంధకాలు, ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే, ఇంట్లో ఉపయోగించే వస్తువులను ఎప్పుడూ కొంత నిండుగా, క్రమబద్ధంగా ఉంచుకోవాలని వాస్తు చెబుతుంది.

డబ్బును నిల్వ ఉంచే ప్రదేశాలు-

ఉదాహరణకు గల్లా పెట్టె, పర్సు వంటిని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. గల్లాపెట్టెలో తమ శక్తిమేరకు కొంత నగదు, నాణేలు, వీలైతే ఆభరణాలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉంచాలి. కొందరు దీనిలో శంఖం, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు వంటి వస్తువులను లక్ష్మీదేవికి ప్రతీకలను ఉంచుతారు. పర్సులో కనీసం ఒక నోటు లేదా నాణెం తప్పనిసరి ఉండాలి. పాత బిల్లులు, చిరిగిన కాగితాలను తీసివేయండి. పర్సులో ఉంచకూడదు. వాటిని ఎప్పటికప్పుడు తీసివేయాలి.

1. పసుపు

పసుపు శుభప్రదమైనదిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇది బృహస్పతి గ్రహంతో ముడిపడి, ధనం, గౌరవం, అదృష్టానికి ప్రతీక. వంటగదిలో పసుపు అయిపోతే అశుభ సంకేతం. ఇది పనులలో ఆటంకాలు, పురోగతి మందగించడానికి దారితీస్తుంది. పసుపు డబ్బా ఎప్పుడూ ఖాళీ కాకుండా చూసుకోవాలి.

2. ఉప్పు

ఉప్పు లేని వంటకు రుచి లేదు, వంటగది అసంపూర్ణం. వాస్తు ప్రకారం, ఉప్పు ఇంట్లోని ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది. అది పూర్తిగా అయిపోతే ఇంట్లో ఉద్రిక్తతలు, కుటుంబ కలహాలు పెరుగుతాయి. ఉప్పును అప్పుగా తీసుకోకూడదు, దాని నిల్వను పూర్తిగా తగ్గించకూడదు. ఉప్పు కొరత ఆర్థిక సమస్యలతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు.

3. బియ్యం

బియ్యాన్ని ఎప్పటికీ తరగని ధాన్యంగా, అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంగా భావిస్తారు. వంటగదిలో బియ్యం అయిపోతే ఇంటి సుఖశాంతులు లోపించి, డబ్బు ఆదా చేసే సామర్థ్యం తగ్గుతుంది. కనుక, బియ్యపు డబ్బా పూర్తిగా ఖాళీ కాకముందే, అందులో కొత్త బియ్యాన్ని నింపడం వాస్తు ప్రకారం శ్రేయస్కరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+