ఇది నిజంగా కల నిజమైన సందర్భం. తొలుత నేనే నమ్మలేకపోయాను. గ్రాండ్ స్లామ్ టోర్నీ టైటిల్ ను దక్కించుకుంటానని అనుకోలేదు. ఈ నిజాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నాను. అని సానియా మీర్జా విలేకరులకు చెప్పింది. అయితే, గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకొన్న తొలి భారతీయ వనిత తనేనన్న విషయం పేపర్లో చదివేవరకు తనకు తెలియదని చెప్పింది. సింగిల్స్ లో ఓడిపోయినప్పిటికీ, డబుల్స్ లోనూ టైటిల్ గెలవడం మాటలు కాదని పేర్కొంది. సింగిల్స్ లోనూ గెలవడమే నా ధ్యేయం.అని స్పష్టం చేసింది. ఈ పదహారేళ్ళ యువతి హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పుట్నుంచీ ఆమె తల్లితండ్రులు ఆమెకు టెన్నిస్ లో శిక్షణ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు చవిచూసిన సానియా ఒక గ్రాండ్‌స్లామ్ కలలుకంటోంది.
సానియాతో అన్ని టోర్నీలకు వెంట ఉండే ఆమె తల్లి నసీమ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయాన్ని ఊహించలేదని ఆమె విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. సాధారణంగా సానియాతో నేను గానీ, మా భర్త ఇమ్రన్ గానీ టోర్నీలలో తోడుంటారని ఆమె తెలిపారు. సానియా తండ్రి ఇమ్రాన్ ఈ సారి ఇంటిపట్టునే ఉన్నారు. సానియా విజయం సాధించిన క్షణం నుంచి ఫోన్ కాల్స్ తో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది ఆరంభం అని తెలుసు. మరి కొద్ది రోజుల వరకు ఈ కాల్స్ ఆగవు. సానియాకు సత్కారాలు ఆగవు..అంటూ నవ్వుతూ తన ఆనందాన్ని ఆయన వ్యక్తం చేశారు. సానియా మరిన్ని టైటిల్స్ సాధించి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాలని ఆశిద్దాం.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!