విషానికే విరుగుడు ఆసర్పరాజు!
ఆగా ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని బ్యాంకు పూర్తిగా దివాళా తీసిన పర్యవసానాలను ఎదుర్కోగల సమర్ధుడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సిఐడి అధికారులు జరుపుతున్న దర్యాప్తులో ఇప్పటికీ ఈ కేసులో అనుమానించదగ్గ అనేక ఆధారాలు బయటపడుతున్నాయని అంటున్నారు. పత్రికలన్నీ ముక్త కంఠంతో హత్యగా గగ్గోలుపెడుతున్న ప్రత్యూష కేసులోనే వాస్తవాలను తొక్కిపెట్టడానికి ఇంకా ప్రయత్నిస్తున్న పోలీసులు ఏ కోణం నుంచి కూడా పెద్దగా గొడవలేని ఆగా కేసును మూసివేయడంలో కష్టం ఏముంటుందని ఒక సీనియర్ బ్యాంకర్ వ్యాఖ్యానించారు. ఆగా మృతిపై ఖచ్చితమైన దర్యాప్తు జరిపితే వచ్చే వాస్తవాల వల్ల స్థానిక ప్రముఖులు కూడా అనేక మంది ఇబ్బందుల్లో పడే అవకాశం వున్న కారణంగానే కేసు మూసివేతకు ఒత్తిడి వచ్చిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications