మార్పులతో దశ తిరుగుతుందా?
అఎn్గాన్ యుద్ధంలో అమెరికా ఉపయోగిస్తున్న విమానాల వల్ల భయంకరమైన శబ్ద కాలుష్యం, స్వల్ప పరిణామంలో యురేనియం వార్ హెడ్ గల బాంబులు, క్షిపణుల వల్ల కాన్సర్స్, రసాయన పదార్ధాలు గల బాంబుల వల్ల జలకాలుష్యం ఏర్పాడే అవకాశం వుంది. జలకాలుష్యం, శబ్ద కాలుష్యం, రేడియేషన్ ప్రమాదాలను అఎn్గాన్‌పౌరులు మాత్రమే భరిస్తారు. వాయుకాలుష్యం ప్రభావం మాత్రం భారత్‌మీద కూడా వుండే అవకాశం వుంది. భయంకరమైన క్లస్ట్‌ర్ బాంబుల వల్ల జలవనరుల స్వభావం, వర్షపాతం తీరు మారిపోతాయి. వర్షపాతం తీరు మారితే భారత్‌పై కూడా దాని ప్రభావం వుంటుంది. ఇప్పటికే యుద్ధం సృష్టిస్తున్న వాయుకాలుష్యం బారిన భారత్ పడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమైనా యుద్ధాన్ని తొందరగా ముగించాల్సిందిగా మనం అమెరికాపై వత్తిడి తేవల్సివుంటుందని వారు అంటున్నారు.












Click it and Unblock the Notifications