అక్తర్: మరో వివాదం
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయెబ్ అక్తర్ భారతదేశంలో క్రికెట్ ఆడడం కన్నా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లున్నారు. చండీఘడ్, లక్నోల్లో ఆయన అటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మీడియా దృష్టిని ఆకర్షించారు. తాజాగా బాలల దినోత్సవ సందర్భంగా బుధవారంనాడు ఆయన సింధియా స్కూల్ ను సందర్శించి అక్కడ పిల్లలు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పిల్లల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. వివాదాలకు కేంద్ర బిందువైన అక్తర్ మరో వివాదానికి తెర తీశారు.
తన ఫిట్నెస్ కు గల కారణాలను తెలుసుకోవడానికి ప్రశ్నలు వేసిన పిల్లలకు ఓపికతో సమాధానాలు ఇచ్చారు. ఒక బాలుడు ఫిట్నెస్ రహస్యం గురించి ఆరా తీశాడు. ఫిట్నెస్ సాధించడానికి తాను చాలా సమయం వెచ్చిస్తానని అక్తర్ చెప్పారు. అది చెప్పి ఊరుకోకుండా తన మనసులోని మాటను చెప్పి వివాదానికి తెర తీశారు. భారత్ తో సిరీస్ కు ముందు జిమ్ లో శిక్షణ తీసుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. 13 మ్యాచుల నిషేధం అనంతరం ఆయన జట్టులోకి వచ్చాడు. తాను వన్డే మ్యాచులకు సిద్ధంగా లేనని, భారత్ తో జరుగుతున్న సిరీస్ లో ఆడడానికి ముందు కొన్ని వార్మప్ మ్యాచులు ఆడి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు వన్డే మ్యాచుల్లో అక్తర్ ఆరు వికెట్లు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications
