వర్మ 'రియల్' రౌడీలు

Ram Gopal Varma
వివాదాస్పద చిత్రాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటారు. ఆయన ఏ చిత్రం తీసినా అదో సంచలనం అవుతుంది. దానిపై చర్చలు మొదలవుతాయి ఇవన్నీ కేవలం వర్మకే సాధ్యం. నాగార్జుల కథానాయకుడిగా శివ చిత్రం తీసి సంచలన విజయం జేబులో వేసుకున్నాడు. అప్పటినుండి ఇప్పటి వరకు ఆయన వెనక్కి తిరిగి చూసింది లేదు. ఆ తర్వాత తెలుగు, హిందీల్లో క్షణం క్షణం, రంగీలా, సత్య, కంపెనీ, భూత్, సర్కార్ తాజాగా రక్త చరిత్ర ఇలా ఒక్కో చిత్రం ఒక్కో రకంగా తీస్తున్నాడు. ఓసారి రంగీల వంటి శృంగారపర చిత్రాలు, మరోసారి భూత్ వంటి దయ్యాల చిత్రాలు తీస్తారు. అందుకే వర్మ జనాలను భయపెట్టే చిత్రాలు తీస్తాడని కామెంట్ ఉంది. అందుకు తగ్గట్టే ఆయన తీసిన దెయ్యాల సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య దెయ్యాల చిత్రాలు వదిలి సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పై పడ్డట్టున్నాడు. అదీ రాజకీయనాయకుల జీవిత చరిత్రలను తీసుకొని ఆయన చిత్రాలను తీయడానికి సిద్ధమవుతున్నాడు.

అందుకే రక్త చరిత్ర తరువాత మరో చిత్రానికి ఆయన సిద్ధమయ్యారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన పండు హత్య నేపథ్యంలో వర్మ బెజవాడ రౌడీలు అనే కొత్త చిత్రాన్ని తీయడానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ రాజకీయనాయకులు వంగవీటి రంగా, పండు, ఆయన్ను చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేందర్ రెడ్డితో పాటు మరికొందరు విజయవాడకు పలువురు రాజకీయ నాయకుల నేపథ్యంలో చిత్రాన్ని తీస్తానని ప్రకటించడమే కాకుండా అందులో నటీనటుల కోసం సెర్చింగ్ కూడా అప్పుడే ప్రారంభించాడు. విజయవాడలో చెలరేగిన ఫ్యాక్షన్ ను చిత్రం ద్వారా చూపిస్తానని ఆయన చెప్పటంపై విజయవాడ రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ మీడియాలో ఎక్కడం కోసం ఇలాంటివి చేస్తుంటాడని, తమ నాయకులను వ్యతిరేకంగా సినిమాలు తీస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

తెలుగుదేశం నాయకుడు పరిటాల రవీంద్రపై వర్మ తీస్తున్న రక్త చరిత్ర ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. రవీంద్ర భార్య పరిటాల సునీతకు ఆ చిత్రాన్ని చూపించిన తర్వాతనే విడుదల చేయాలని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ఆయన తన చిత్రాల్లో రాజకీయ నేపథ్యాన్ని ఎంచుకొని మీడియాకు ఎక్కి ఇమేజ్ ను పెంచుకోవాలని చూస్తున్నట్టు కొందరు ఆరోపిస్తుంటారు. చాలామంది దర్శకులు చిత్రాలు తీస్తుంటారు. కాని వర్మ చిత్రాలు మాత్రమే వివాదాస్పదం కావటానికి కారణం అయన ఎంచుకున్న నేపథ్యమే కారణమని రాజకీయ నాయకులు చెబుతుంటారు. అందులో ఎవరో ఒక వర్గం వారిని లేదా రెండు వర్గాల వారిని చెడుగా చూపించాలి. దీంతో వర్మ చిత్రాలపై రాజకీయ నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+