• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెక్స్ బాబా ప్రయాణం

By Pratap
|

Sex Baba in Beauty Business
సెక్స్ రాకెట్ కుంభకోణంలో పట్టుబడిన సెక్స్ బాబా అలియాస్ రాజీవ్ రంజన్ ద్వివేది చేయని పనంటూ లేదు. పార్లౌర్ నిర్వహణ నుంచి అతను వ్యభిచారం రాకెట్ వరకు ఎన్నో పనులు చేశాడు. ఈ గ్యాడ్ మాన్ జీవిత నేపథ్యాన్ని ఒక ఆంగ్ల పత్రిక శోధించి ప్రచురించింది. నెలకు ఆరు వేల జీతంతో ఢిల్లీ సెక్యూరిటీ గార్డుగా జీవితాన్ని ప్రారంభించిన ఆధ్యాత్మిక గురువుగా, సెక్స్ రాకెట్ గా అవతారం ఎత్తాడు. కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. అతనికి ఉన్న పేర్లు కూడా అన్నీ ఇన్నీ కావు. శివ మారత్ ద్వివేది, ఇచ్చాధరి సంత్ స్వామి భీమానందజీ మహరాజ్ చిత్రకూట్ వాలే, రాజీవ్ రంజన్ ద్వివేది, కరన్ కుమార్ ద్వివేది. ఇప్పుడతను సెక్స్ బాబాగా అందరికీ సుపరిచితుడయ్యాడు.

దేశవ్యాప్తంగా అతను నడుపుతున్న సెక్స్ వ్యాపారంతో ఢిల్లీ పోలీసుల చేతికి చిక్కి అతను కటకటాలు లెక్కిస్తున్నాడు. పదో తరగిత పాసైన ద్వివేది ఆగ్రాలోని ఫైవ్ స్టార్ హోటల్లో సెక్యూరిటీ గార్డుగా తన జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత లజ్ పత్ నగర్ - 2లోని లైఫ్ లైన్ బ్యూటీ పార్లర్ లో మేనేజర్ గా చేరాడు. అదే అతన్ని సెక్స్ వ్యాపారం వైపు మళ్లించింది. పత్రికల్లో వస్తున్న బ్యూటీ, మసాజ్ పార్లర్ల వాణిజ్య ప్రకటనలు చూసి క్విక్ మనీ సంపాదించడమెలాగో నేర్చుకున్నాడు.

బ్యూటీ సాలూన్ మాటున సెక్స్ వ్యాపారం నడపే ఆలోచన అతనికి అక్కడి నుంచే వచ్చింది. 1997లో తన మిత్రులు సంజయ్ ద్వివేది, సంజయ్ మిశ్రాలతో కలిసి లజ్ పతే నగర్ -2లో బేస్ మెంటులో బ్యూటీ పార్లర్ తెరిచాడు. దానికి సాయి పాయింట్ బ్యూటీ పార్లర్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అని పేరు పెట్టాడు. అతను సాయిబాబా అనుచరుడు కావడం వల్లనే ఆ పేరు పెట్టాడు. కేవలం 650 రూపాయలకు పురుషులకు బ్యాంగ్ కాక్ మసాజ్ సౌకర్యాలను ఆ మిత్రులు కల్పించారు. సెక్స్ రాకెట్ లాభాలు తెచ్చిపెట్టడంతో కైలాస్ తూర్పులోని ఆధునిక భవనంలోకి మారాడు.

అయితే 1997లో ఢిల్లీ పోలీసులు అనైతిక రవాణా (నిరోధ) చట్టం కింద అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ పై రావడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు. ఆ తర్వాత రెండోసారి 1998లో దోపిడీ కేసులో బాదర్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో అరెస్టయి మళ్లీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. మళ్లీ 2003లో నోయిడాలో సెక్స్ రాకెట్ నడుపుతున్నందుకు అరెస్టయ్యాడు. ఈసారి విడుదల కాగానే అతను ఆధ్యాత్మిక గురువు అవతారమెత్తాడని పోలీసులు చెబుతున్నారు. తన రూపంలో, నిర్వణ తీరులో మార్పు చేసుకున్నాడు. సాయిబాబాకు అత్యంత ముఖ్యమైన భక్తుడిగా దర్శనమివ్వడం మొదలు పెట్టాడు. అయితే వ్యభిచార వ్యాపారాన్ని మాత్రం మానేయలేదు. ఆ రకంగా త్వరలోనే దేశవ్యాప్తంగా వ్యభిచార సిండికేట్ ను నడిపే స్థాయికి చేరుకున్నాడు.

వ్యభిచార వ్యాపారం మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ లో కూడా అతను పెట్టుబడులు పెట్టాడు. వడ్డీ వ్యాపారం చేశాడు. లాస్ వేగాస్ చారిటబుల్ ఆర్గనైజేషన్ నుంచి అతనికి పెద్ద యెత్తున విరాళాలు అందాయని పోలీసులు చెబుతున్నారు. చివరికి పాపాలు పండి ఫిబ్రవరి 26వ తేదీన ఆరుగురు మహిళలతో అతను పోలీసులు చిక్కాడు. ఇప్పుడు అతనిపై మోకా కింద కేసు నమోదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X