• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తారలు, క్రికెటర్లు: లవ్ స్టోరీలు

By Pratap
|
Google Oneindia TeluguNews
Sourav Ganguly
క్రికెటర్లు సినీ తారల వలలో పడడం కొత్తదేమీ కాదు. బాలీవుడ్ తారలు క్రికెటర్ల మోజులో పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కొన్ని పెళ్లిళ్ల దాకా సాగగా, మరికొన్ని మధ్యలోనే బెడిసికొట్టి విషాదాంతాలుగా ముగిశాయి. నవాబ్ పటౌడీ, మొహ్మద్ అజరుద్దీన్ ప్రేమాయణాలు పెళ్లికి దారి తీశాయి. సినీ రంగానికి, క్రికెట్‌కు రెండు విషయాల్లో పోలిక ఉంది. రెండు కూడా గ్లామర్, డబ్బులతో ముడిపడి ఉన్నాయి. తారలకు, క్రికెటర్లకు మధ్య సాగే ప్రేమాయణాలపై వదంతులు గుప్పుమనడం సర్వసాధారణంగా మారింది. 1970 దశకంలో బాలీవుడ్ తార షర్మిలా ఠాగోర్, అప్పటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ నవాబ్ పటౌడీ ప్రేమలో పడింది. వారిద్దరి మతాలు వేరు. అయినా, వారిద్దరు వివాహం చేసుకున్నారు. వారి పిల్లలు సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ బాలీవుడ్‌లో తమ సత్తాను చాటుతున్నారు. అలాగే, క్రికెట్ జట్టు కెప్టెన్ అజరుద్దీన్‌కు, సంగీతా బిజలానీకి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. మతాలు వేరైనా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

ఆ మధ్య ప్రస్తుత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి, బాలీవుడ్ భామ దీపికా పడుకొనే మధ్య అఫైర్ సాగినట్లు ప్రచారం సాగింది. వారిద్దరు కలిసి తిరిగినట్లు కూడా చెబుతారు. ఆ తర్వాత ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారిందని, దీపికా పడుకొనే ధోనీని వదిలేసి యువరాజ్ సింగ్‌తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగినట్లు ప్రచారం సాగింది. దీపికా పడుకొనే తన జన్మ దిన వేడుకలను యువీతో కలిసి ఆస్ట్రేలియాలో జరుపుకున్నట్లు మీడియా వార్తలు కూడా వచ్చాయి. అయితే, ప్రస్తుతం వారిద్దరు విడిపోయినట్లు తెలుస్తోంది. ధోనీ సాక్షి రావత్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు.

దేశానికి తొలి వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించి పెట్టిన కపిల్ దేవ్, బాలీవుడ్ తార సారికకు మధ్య ప్రేమాయణం నడిచింది. ఇద్దరి ప్రేమ పెళ్లి దాకా నడిచింది. అయితే అకస్తాత్తుగా మాజీ ప్రియురాలు రోమీ కపిల్ జీవితంలోకి ప్రవేశించింది. దాంతో సారిక ప్రేమ విఫలమైంది. అమృతా సింగ్‌కు, రవిశాస్త్రితో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఇది అడ్డం తిరిగింది. ఇద్దరూ విడిపోయారు. రవిశాస్త్రి రీతూ సింగ్‌ను పెళ్లాడగా, అమృతా సింగ్ సైఫ్ అలీఖాన్‌తో ప్రేమలో పడింది. అమృతా సింగ్ సైఫ్‌తో విడాకులు తీసుకుంది. 1983లో పాకిస్తాన్ ఓపెనర్ మోహిసిన్ రీనా రాయ్ ప్రేమలో పడ్డాడు. గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి రీనా రాయ్ పాకిస్తాన్ వెళ్లింది. కానీ వారి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. విడాకులు తీసుకున్నారు.

అజయ్ జడేజాకు, ఒకప్పటి అందాల తార మాధురీ దీక్షిత్‌కు మధ్య అఫైర్ నడిచినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. యువరాజ్ సింగ్, కిమ్ శర్మ ప్రేమాయణం పెళ్లి దాకా సాగలేదు. నగ్మా, సౌరవ్ గంగూలీల మధ్య నడిచిన లవ్ అఫైర్ అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి గుళ్లూ గోపురాలు కూడా తిరిగారు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోని కాళహిస్తికి కూడా కలిసి వచ్చారు. అయితే, ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ బాలీవుడ్ తార కత్రినా కైఫ్ అందాలకు బౌల్డ్ అయినట్లు చెబుతారు. హర్భజన్, జహీర్ ఖాన్ లవ్ స్టోరీలు కూడా ఉన్నాయి.

English summary
In our country, people are obsessed with bollywood stars and Cricketers.Both enjoy similar star status.So, it is common when cricketers get bowled over by actresses, and vice versa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X