హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐపియల్‌ కు తెలంగాణ దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

IPL
హైదరాబాదులోని ఈసారి ఐపియల్ మ్యాచులు జరిగే పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో హైదరాబాదులో ఐపియల్ మ్యాచులను నిర్వహించలేమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) చేతులు ఎత్తేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏప్రిల్‌ 8న ఆరంభం కానున్న ఐపీఎల్‌ నాలుగో సీజన్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వటం అనుమానంగానే ఉంది. డెక్కన్‌ ఛార్జర్స్‌ ఆడే మ్యాచ్‌లు ఉప్పల్‌ స్టేడియంలో జరిగే వాతావరణం కూడా లేదని అంటున్నారు. తాజాగా రంజీట్రోఫీ వన్డే టోర్నీ అయిన సుబ్బయ్య పిళ్త్లె ట్రోఫీ హైదరాబాద్‌ నుంచి తరలిపోవడంతో ఆ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ మ్యాచ్‌ లు నిర్వహించలేమని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ) చేతులెత్తేసింది.

ఆంధ్రా క్రికెట్‌ జట్టు ఈ టోర్నీలో పాల్గొంటున్న నేపథ్యంలో తెలంగాణవాదుల నుంచి మ్యాచ్‌లకు ఆటంకాలు కలగకుండా హామీ ఇవ్వలేమని స్పష్టంచేసింది. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో జరుగనున్న ఈ టోర్నీని కేరళలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఈ నెల 26 నుంచి 29 వరకు ఉప్పల్‌ స్టేడియంలో జరిగే దులీప్‌ ట్రోఫీ సెమీ ఫైనల్‌ను యథాతథంగా నిర్వహించాలని హెచ్‌సీఏ నిర్ణయించింది. దులీప్‌ ట్రోఫీలో పాల్గొనేవి జోనల్‌ జట్లు కాబట్టి ఆటంకాలు ఉండకపోవచ్చని భావిస్తోంది. నిరుడు డెక్కన్‌ టీ20 కప్‌ పోటీని అడ్డుకున్న తెలంగాణ వాదులు అనంతరం జరిగిన దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు ఎలాంటి ఆటంకాలు సృష్టించలేదు.

హైదరాబాద్ ‌లో ఐపీఎల్‌ నాలుగో సీజన్‌ మ్యాచ్‌ల నిర్వహణపై డెక్కన్‌ ఛార్జర్స్‌ ఆందోళనలో ఉన్నట్టు తెలిసింది. గత ఏడాది ఐపీఎల్‌-3 సీజన్‌కు ముందు ఛార్జర్స్‌ యాజమాన్యం డెక్కన్‌ టీ20 కప్‌ను నిర్వహించింది. ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. దీంతో ఐపీఎల్‌-3 ఆరంభోత్సవం సహా అన్ని మ్యాచ్‌లను హైదరాబాద్‌ నుంచి తరలించారు. తాజాగా మరోసారి క్రికెట్‌కు తెలంగాణ సెగ తగిలిన నేపథ్యంలో ఐపీఎల్‌పైనా ఆ ప్రభావం ఉంటుందని ఛార్జర్స్‌ భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలంగా ఉంటే హైదరాబాద్‌లో, లేకుంటే విశాఖపట్నం, ఒరిస్సాలో మ్యాచ్‌లు నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికిప్పుడు దీనిపై ఓ నిర్ణయానికి రాకపోయినా ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలన్నది ఫ్రాంచైజీ ఆలోచనగా ఉన్నట్లు హెచ్‌సీఏ వర్గాలు తెలిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X