వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డయాబెటీస్ ఉందా? సెల్ ఫోన్ వాడకం అధికం చేయండి!!

By B N Sharma
|
Google Oneindia TeluguNews

Manage Diabetes with Cell Phone
యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోని రీసెర్చర్స్ తాజాగా చేసిన ఒక అధ్యయనంలో ఇంటర్ యాక్టివ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఒకటి మొబైల్ ఫోన్ ఉపయోగించే టైప్ 2 డయాబెటీస్ రోగులకు మేలు కలిగిస్తోందని వాషింగ్టన్ నుండి ఒక వార్తా సంస్ధ తెలియజేసింది.

మొబైల్ హెల్త్ టెక్నాలజీని సైంటిఫిక్ గా పరిశీలించటంలో ఇది మొదటి అధ్యయనం. ఒక వ్యక్తి రక్తంలోని హేమోగ్లోబిన్ ద్వారా బ్లడ్ షుగర్ నిర్ధారిస్తారు. మొబైల్ హెల్త్ సాఫ్ట్ వేర్ సుమారు సంవత్సరంనుండి వాడుతున్న డయాబెటీస్ రోగులకు హెమోగ్లోబిన్ ఎఎల్సి సగటున సుమారు 1.9 శాతం తగ్గినట్లు స్టడీ తెలుపుతోంది. ఈ ఫలితాలు మరిన్ని దీర్ఘ రోగాలకు సంబంధించిన అంశాలకు కూడా దోహదం చేయనున్నాయి. ఫలితాలు ఆసక్తి కరంగా వున్నాయని మేరీ ల్యాండ్ స్కూల్ ఆప్ మెడిసిన్ ప్రిన్సిపాల్ ఇన్వెస్స్టిగేటర్ ఛార్లీన్ సి. క్విన్ తెలుపుతున్నారు.

మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఆధునిక ఇతర కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగం ద్వారా రోగులకు ఏ రకమైన ప్రయోజనాలు కలిగించవచ్చనే అంశం పై స్టడీ చేస్తున్నారు. ఈ స్టడీ ఫలితాలు త్వరలోనే తమ రోగుల అనారోగ్యాన్ని దూరం చేయటానికి డాక్టర్లకు సైతం అందుబాటులోకి రాగలవని కూడా రీసెర్చర్లు భావిస్తున్నారు.

English summary
The study indicates that using mobile phones, the Internet and other mobile communications technology to keep patients healthy may have broad applications to help patients and their physicians manage many health conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X