మరిన్ని భాను కిరణ్ లీలలు

రియల్‌బూమ్ జోరుగా ఉన్న రోజుల్లో వివాదాస్పద భూముల సివిల్ సెటిల్‌మెంట్లు చేసిన భాను అగ్రిమెంట్లతో ఎరవేసి యజమానులకు టోకరా వేశాడని సమాచారం. పరంధామయ్య అనే వ్యక్తి ద్వారా నడిపిన వ్యవహారాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. ఆ పరంధామయ్య ఉదంతాన్ని ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ఉటంకిస్తూ వార్తాకథనాన్ని ప్రచురించింది.
భాను తన మోసాల్లో మరో చిత్రమైన పంథాను అనుసరించాడని ఆ దినపత్రిక రాసింది. ఫైనాన్షియర్లనుంచి రూ. కోట్లలో అప్పులు తీసుకునేవారు ష్యూరిటీగా స్థలం కాగితాలు పెట్టడం ఆనవాయితీ అని, అలా అప్పులు తీసుకున్న వ్యక్తులు కొన్నాళ్ల తరవాత భానును తమ వెంట తీసుకువెళ్లి ఫైనాన్షియర్లకు పరిచయం చేసేవారని, భాను వారిని స్టార్ హోటళ్లకు పిలిపించి జల్సాలు చేస్తూ బుట్టలో వేసుకునేవాడనిస ఇలా కొన్నిసార్లు కలిసిన తరవాత సదరు స్థలం తాను కొనాలని అనుకుంటున్నానని, అయితే పూర్వాపరాలు పరిశీలనకు స్థల కాగితాలు ఇవ్వాలంటూ తీసుకుంటాడనిస వీటిని తీసుకెళ్లి అప్పుతీసుకున్న వాళ్లకు అప్పగించి భారీ మొత్తం తీసుకుంటాడని, ఇందులోనుంచి కొంతమొత్తం ఫైనాన్షియర్లకు ఇచ్చేవాడు, మాట వినకుంటే బెదిరించి వారి నోరు మూయించేవాడని ఆ వార్తాపత్రిక రాసింది. లావాదేవీలన్నీ కోట్లలో జరిగి ఉండటంతో ఆ విషయాలు వెలుగులోకి వస్తే భాను నుంచి రికవరీ మాట ఎలా ఉన్నా ముందు ఆదాయపుపన్ను శాఖ నుంచి ఇబ్బందులు వస్తాయని వారు వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications