అల్లాటప్పా కాదంటూ సాక్షి డైలీ

సాక్షి దినపత్రిక వార్తాకథనం ప్రకారం - కోల్‌కత్తాకు చెందిన 16 కంపెనీలు తాము ఎంచుకున్న సంస్థల్లో ఒక వ్యూహం ప్రకారం పెట్టుబడులు పెడుతుంటాయి. ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని అనుకున్నాయంటే అందులో ఆ 16 కంపెనీలు ఇన్వెస్ట్ చేయాల్సిందే. గత పదేళ్లుగా వాటి యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానమిది. అదే పద్ధతిలో జగతిలో ఇవి ఒక గ్రూప్‌గా పెట్టుబడులు పెట్టాయి. ఈ గ్రూప్ సంస్థలన్నీ ఒకే యాజమాన్యానికి చెందినవి కాబట్టి వాటి చిరునామా కూడా ఒకే విధంగా ఉంటుంది.
కోల్‌కత్తా కంపెనీలు ఇప్పటికీ క్రియాశీలకంగా ఉన్నాయని, స్టాక్ ఎక్స్‌ఛేంజీల్లో లిస్టయినవేనని, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పుట్టుకొచ్చివని కావని, ఇంటర్నెట్‌లో 2000 నుంచి ఈ కంపెనీల సమాచారం అందుబాటులో ఉందని చెబుతూ అయినా పట్టించుకోకుండా వాస్తవాలను విస్మరించి బోగస్ అంటూ ఉద్దేశపూర్వకంగా బురదజల్లే కార్యక్రమాన్నికొన్ని మీడియా సంస్థలు పెట్టుకున్నాయని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications