80 వసంతాల తెలుగు సినీప్రస్థానంపై ఫోకస్

1930కి ముందు కదిలే, మాట్లాడే బొమ్మలతో కూడిన సినిమా అనేది భారత దేశంలో లేనే లేదు. మన తెలుగులో అసలు ఆ పదమే ఎరుగరు. అసలు ఇది ఎలా జరిగిదంటే....1929లో 'షో బోట్' అనే టాకీ మూవీని అమెరికాలో యూనివర్సల్ స్టూడియోస్ వారు నిర్మించారు. అమెరికాలో వున్న అర్దేశీ ఇరానీని ఈ సంఘటన ఎంతగానో ఆకట్టుకుంది. భారతదేశంలో కూడా ఇలా ఓ సినిమా తీయాలన్న తలంపు వచ్చింది. వెంటనే ఆ సినిమా తీసిన కంపెనీవారిని సంప్రదించి, సినిమా నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేశారు. కెమరా, సౌండ్ రికార్డింగ్ పరికరాలేగాక, అక్కడ పనిచేసిన పలువురు సాంకేతిక నిపుణులను కూడా తన జట్టులో చేర్చుకున్నాడు. హిందీ- ఉర్దూ భాషల్లో 'అలం అరా' అనే పేరుతో తొలి భారతీయ టాకీ సినిమాను రూపొందించారు. తెరపై మాట్లాడే బొమ్మలు చూసి జనం ఆశ్చర్యపోయారు. వెంటనే ప్రాంతీయ భాషా చిత్రాలవైపు ఆయన దృష్టి సారించారు. మూకీ సినిమాల్లో మంచి అనుభవం ఉన్న హెచ్.ఎం రెడ్డి ద్వారా తెలుగులో సినిమాకు ప్లాన్ చేశారు. నాటి రోజుల్లో సురభి నాటక సమాజం చాలా ఫేమస్. వారు వేసే భక్తప్రహ్లాద నాటకం కూడా చాలా పాపులర్. హెచ్.ఎం.రెడ్డి కూడా వారినే సంప్రదించాడు.సురభి నాటక సమాజంలోని సి. ఎస్.ఆర్. ఆంజనేయులు, వి.సుబ్బారావు, కమలాభాయి, మాస్టర్ కృష్ణారావు తదితరలతో తీయాలని డిసైడ్ కావటం వెంటనే జరిగిపోయింది. ఓ కామిక్ రోల్ కోసం సురభి నాటక సమాజంతో సంబంధంలేని వ్యక్తిని ఎంపికచేశారు. అతనే ఎల్‌వి ప్రసాద్. ఆ తర్వాత ఆర్దేషీ ఇరానీతో చాలాకాలంపాటు ఎల్.వి.ప్రసాద్ పనిచేశారు. సినిమా అంతా ముంబయిలో షూటింగ్ జరుపుకుంది. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో, తొలి తెలుగు టాకీ మూవీ 'భక్తప్రహ్లాద' 1931లో విడుదలయింది.
ఆ తర్వాత మన తెలుగు సినిమా క్రమక్రమంగా ఓ పరిశ్రమగా రూపాంతరం చెందిన. 1980 వరకూ ఉన్న కాలాన్ని తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు, నటీనటులు తెరపైకి వచ్చారు. 1990 నుంచీ కొద్ది కొద్దిగా తెలుగు సినిమా పరిశ్రమలో మార్పు వచ్చింది. పరభాష నటులేగాక, టెక్నీషియన్లు, హీరోయిన్లు, దర్శకులు రావటం మొదలైంది. లోకల్ టాలెంట్ దొరకటం లేదనే కారణంతో పరభాషా నిపుణులను తీసుకురావటం ఎక్కువైంది. 'ఆ రోజుల్లో కథ చాలా ప్రధానమైన విషయం. అందుకు తగ్గట్టు ఇక్కడి నటులను తీసుకునేవారు. కానీ నేడు కంటెంట్ కన్నా కామర్స్ ప్రధానంగా నడుస్తోంది. 60 ఏళ్లలో 3,549 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 20 ఏళ్లలో దాదాపు 2,400 సినిమాలు విడులయ్యాయి. సినిమాల సంఖ్య ఎంత పెరిగిందో, సక్సెస్ రేషియో కూడా అదే విధంగా పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా మారిందంటే....సక్సెస్ రేటు 10 శాతం కూడా లేదు. పరిశ్రమకు నష్టాలే తప్ప లాభాలే లేవు. ఇందుకు కారణం పైపై షోకులపై పెడుతున్న దృష్టి కథపై పెట్టక పోవడమే. ఒకరిని చూసి ఒకరు బారీ బడ్జెట్ అంటూ వెంపర్లాడుతుండటమే. మరి ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే దర్శక నిర్మాతల్లో మార్పు రావాలి.












Click it and Unblock the Notifications