వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు వలలో జగన్, వైయస్ మంత్రివర్గం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

కాంగ్రెసు పార్టీ చూపించిన దారిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉపయోగించుకొని ఇటు వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, అటు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గాన్ని చిక్కుల్లోకి నెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వైయస్ జగన్ ఆస్తులపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిల్ వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జగన్ అక్రమాస్తులపై పలువురు కాంగ్రెసు నేతలు బాహాటంగానే దుయ్యబట్టడం ప్రారంభించారు. సిబిఐ దర్యాఫ్తుకు ముందు జగన్ సైతం తన కంపెనీల్లో ఎలాంటి అక్రమాలు లేవని ఎలాంటి దర్యాఫ్తుకైనా తాను సిద్ధంగా ఉన్నానని జగన్ సైతం పలుమార్లు స్పష్టం చేశారు. అయితే వీరి సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎలా ఉన్నప్పటికీ ఆ తర్వాత టిడిపి పావులు కదిపింది.

శంకర్ రావు పిల్‌లో తమను ఇంప్లీడ్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, రాజశేఖర రెడ్డి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుతో సహా టిడిపి నేతలు అక్రమాలలో జగన్, దివంగత వైయస్‌లతో పాటు నాటి మంత్రివర్గంకు సైతం బాధ్యత ఉందని చెప్పుకొస్తున్నారు. ఇటీవల ఓ నేత మాట్లాడుతూ నాటి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని తాము మొదటి నుండి చెబుతున్నామని ఈ అక్రమాలలో జగన్‌ది 60 శాతం పాత్ర ఉంటే నాటి మంత్రివర్గంది 40 శాతం పాత్ర ఉందని ఆరోపించారు. సాక్ష్యాత్తూ జగన్ పార్టీకి చెందిన నేత అంబటి రాంబాబు అయితే ఆరోపణలు ఖండించడం మాట పక్కన పెట్టి అక్రమాలు జరిగితే జగన్‌తో పాటు వైయస్ మంత్రివర్గానికి కూడా బాధ్యత అని కుండబద్దలు కొట్టారు. మంత్రివర్గం చేయి లేకుండా అక్రమాలు జరుగుతాయనే ప్రశ్నలు కూడా సామాన్యులను వేధిస్తున్నాయి. నాటి మంత్రివర్గాన్ని కూడా విచారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

సిబిఐ అధికారులు ఇప్పటికే పలు శాఖల అధికారులను దర్యాఫ్తు చేస్తున్నారు. హైకోర్టు పూర్తి విచారణకు ఆదేశిస్తే సిబిఐ వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసిన మాదిరి సంబంధిత నాటి మంత్రుల కార్యాలయాలను కూడా విచారించే అవకాశాలు కొట్టి పారేయలేం. పార్టీని వీడి కాంగ్రెసును దెబ్బతీశాడని సిబిఐ దర్యాఫ్తులో జగన్ అక్రమాలు బయట పడితే ఆయకు శిక్ష తప్పదని కాంగ్రెసు నేతలు పలువురు భావిస్తున్నారు. అయితే టిడిపి మాత్రం కేవలం జగన్‌తో వదిలి వేయకుండా జగన్ అక్రమాలు తేలితే ఆ తర్వాత నాటి మంత్రి వర్గం విచారణకు డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అసలు జగన్ అక్రమాలు తేలితే మంత్రివర్గం పాత్ర ఉందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ 2జి స్పెక్ట్రం కుంభకోణానికి రాజా ఒక్కడినే బాధ్యుడిగా చేసినట్లు ఇక్కడ కూడా రిపీట్ కావచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు.

English summary
YSR Congress party president YS Jaganmohan Reddy and late YS Rajasekhar Reddy cabinet is in TDP chief Chandrababu Naidu's strategy!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X