• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అంచనాలు తక్కువ ఆట ఎక్కువ

By Srinivas
|
Google Oneindia TeluguNews
Mohinder Amarnath-Yuvraj Singh
శనివారం ప్రపంచ కప్ పోరులో యువరాజ్ సింగ్ హీరోచిత విన్నింగ్సును ఎవరూ మరిచిపోలేరు. అసలు జట్టులో స్థానం ఉంటుందో అనే ఉత్కంఠ మధ్య ఎలాగో చివరకు జట్టులో స్థానం సంపాదించిన యూవీనే భారత్‌ను పలుమార్లు ఈ టోర్నీలో ఆదుకున్నాడు. అందుకే యూవీని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరించింది. జట్టులో స్థానం ఉంటుందా తెలియని స్థితి నుండి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన యువీకి 1983లో కప్ గెలిచిన కపిల్ సారథ్యంలోని మొహిందర్ అమరనాథ్‌కు పోలీకలు ఉన్నాయి. సాధారణంగా ఈ హీరో ఆయా జట్ల స్టార్‌ బ్యాట్స్‌మనే కానీ బౌలర్‌ కానీ అయి ఉంటాడు!

కానీ భారత్ గెలుచుకున్న రెండు ప్రపంచ కప్‌లలో ఈ అంచనాల్ని తలకిందులు చేశాయి. ఎవరికీ పెద్దగా అంచనాలు లేని ఇద్దరు ఆటగాళ్లు టోర్నీ ఆద్యంతం జట్టుకు కీలకమయ్యారు. జట్టు విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఇద్దరు బ్యాట్‌తోనే బంతితోనూ మ్యాజిక్‌ చేసి జట్టుకు కప్‌ను సాధించడంలో ముఖ్యపాత్ర పోషించారు. 362 పరుగులు 15 వికెట్లు సాధించి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో యువీ మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. అంతేకాదు నాలుగు సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకుని సత్తా చాటాడు.

యూవీలాగే నాటి ప్రపంచకప్‌ నాటికి మొహిందర్‌ అమర్‌నాథ్‌ ఫామ్ లేమి కారణంగా తెర మీద లేడు. ఓ సమయంలో మూడేళ్ల వరకు జట్టులో స్థానం దక్కలేదు. కానీ 1983 ప్రపంచకప్‌ జట్టులో అనూహ్యంగా చోటు సంపాదించాడు. అయితే దానిని మొహిందర్ వృథా చేసుకోలేదు. సీమ్‌ను ఉపయోగించుకొని జెంటిల్‌ మీడియం పేస్‌తో బ్యాట్స్‌మన్‌ను కట్టిపడేసే మొహిందర్‌, వన్‌డౌన్‌లో నమ్మదగ్గ బ్యాట్స్‌మన్‌గా పేరొందాడు. ఈ లక్షణాలతోనే 83 ప్రపంచకప్‌లో ఆరంభం నుంచి బ్యాటు, బంతితో మొహిందర్‌ రాణించాడు. ముఖ్యంగా సెమీస్‌, ఫైనల్లో తన విశ్వరూపం చూపించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్నాడు. ఫైనల్‌ 26 పరుగులు, 12 పరుగులకే మూడు వికెట్లు, సెమీస్‌‌లో 27 పరుగులకు రెండు వికెట్లు తీసు 46 పరుగుల సాధించి నాడు ప్రధాన పాత్ర వహించాడు.

మొహిందర్‌ లాగే యువీ కూడా టోర్నీ ముందు అందరి చేత విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మొహిందర్‌ బాటనే నడిచి టోర్నీ ఆద్యంతం జట్టుకు విజయాల బాట పరిచాడు. ఇంగ్లాండ్‌ మ్యాచ్‌తో నుంచి యూవీ వెనుతిరిగి చూడలేదు. ఐర్లాండ్‌పై 31 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన యువీ కష్టకాలంలో అర్ధ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. తర్వాత మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై రెండు వికెట్లు తీయడమేకాక 51 పరుగులు సాధించి జట్టును గెలిపించిన యువీ ఆ తర్వాత విండీస్‌పై విశ్వరూపం చూపాడు.

1983 టోర్నీ ఆరంభం నుంచి బ్యాటు, బంతితో ఒక చేయి వేస్తూ వచ్చిన మొహిందర్‌ అమర్‌నాథ్‌ కీలకమైన సెమీస్‌, ఫైనల్లో చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో 46 పరుగులు, 2 వికెట్లు తీసిన జిమ్మి, ఫైనల్లో 12 పరుగులకే 3 వికెట్లు, 26 పరుగులు చేసి జట్టు కప్‌ గెలవడంలో కీలకంగా మారాడు. ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై విజయ యాత్రకు అడ్డుకట్ట వేయడంలో యువీదే కీలకపాత్ర. ఆసీస్‌పై 2 వికెట్లతో పాటు లక్ష్యచేధనలో విపరీతమైన ఒత్తిడిలో 57 పరుగులు చేసిన యువరాజ్‌, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో కీలక సమయంలో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ మలుపు తిప్పాడు. ఫైనల్లో లంకపై 2 కీలక వికెట్లు తీయడమే కాక కడదాకా ధోనీతో క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

English summary
Yuvraj Singh played main role in World Cup 2011 as Mohinder Amarnath in 1983. Yuvi play his role in batting and bowling. Mohinder also played main role in 1983 matches.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X