• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గాలి గెస్ట్‌హౌస్‌లోనే అంతా: కొంపముంచిన ఫోన్‌కాల్స్

By Srinivas
|

Gali Janardhan Reddy
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కుంభకోణంలో పలు ఆసక్తికర విషయాలను ఎసిబి కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్‌లో ప్రస్తావించింది. బెయిల్ కోసం గాలి దాదాపు వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ద పడ్డారని, రూ.10 కోట్లు ఇచ్చి బెయిల్ డీల్ కుదుర్చుకున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కోర్టుకు సమర్పించిన ఛార్జీషీటులో మరికొన్ని ఆసక్తికర విషయాలను పేర్కొంది. సస్పెండైన జడ్జి ప్రభాకర రావును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కోర్టులో ఎసిబి ఛార్జీషీట్ దాఖలు చేసింది.

భారీ మొత్తంలో డబ్బును వెదజల్లి, సిబిఐ కోర్టును ప్రభావితం చేసి బెయిల్ పొందాలని గాలి ప్రయత్నం చేశారని పేర్కొంది. గాలి సోదరుడు సోమశేఖర రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబులు ములాఖత్‌ల ద్వారా గాలిని కలిసినప్పుడు ఎలాగైనా బెయిల్ ఇప్పించాలని వారిని కోరారని పేర్కొంది. వీరు గాలిని చంచల్‌గూడ జైలులో మూడుసార్లు కలుసుకున్నారని, బెంగళూరులో 15సార్లు కలుసుకున్నారని తెలిపింది.

బెయిల్ కోసం ఎలా ప్రయత్నాలు జరిగాయో ఎసిబి వివరించింది. బెయిల్ డీల్ కోసం కుట్ర హైదరాబాదులోని గాలి జనార్ధన్ రెడ్డి అతిథి గృహంలోనే జరిగిందని, ఇక్కడ జరిపిన సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గాలి బెయిల్ కోసం తొలత వెంకటేశ్వర రావు, కిషన్ ప్రసాద్‌లు ప్రయత్నించారు. నాగమారుతి శర్మ తిరస్కరించడం, కొత్త కోర్టులు ఏర్పాటు కావడంతో తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారి సూర్యప్రకాశ్ రంగంలోకి దిగారు.

రూ.10 నుండి రూ.15 కోట్ల వరకు డీల్ కుదిరింది. పట్టాభితో సమావేశం ఏర్పాటు చేయాలని దశరథరామి రెడ్డి తదితరులు షరతు విధించారు. ప్రభాకర రావు రంగంలోకి దిగి అప్పటి సిబిఐ కోర్టు జడ్జి పట్టాభి రామారావును, ఆయన కుమారుడిపై ఒత్తిడి తెచ్చారు. ఓ వైపు ప్రయత్నాలు జరుగుతుండగా మే 11న గాలికి బెయిల్ మంజూరయింది. దీంతో వీరందరూ ఆశ్చర్యపోయారు. ఎవరి ద్వారా బెయిల్ వచ్చిందని పట్టాభిని బెదిరించారు. ఆ తర్వాత బెయిల్ డీల్ వ్యవహారం బయటపడింది.

బెయిల్ కోసం కుట్ర, అవినీతిని ప్రోత్సహించడం, అధికార దుర్వినియోగం వంటి నేరాలపై నిందితులు ప్రభాకర రావు, సూర్యప్రకాశ్, లక్ష్మీ నరసింహ రావు, దశరథరామి రెడ్డి, సోమశేఖర రెడ్డి, సురేష్ బాబు, గాలి జనార్ధన్ రెడ్డిలు అవినీతి నిరోధస చట్టం, ఐపిసి కింద శిక్షార్హులని ఎసిబి పేర్కొంది. గాలి బెయిల్ కోసం వివిధ సెల్ పోన్ నెంబర్లను వినియోగించుకున్నారని, అర్ధరాత్రి సమయాల్లో కూడా ఫోన్లలో చర్చలు జరిపారని, మొత్తం ఆరుగురు నిందితుల నడుమ దాదాపు నెలన్నర వ్యవధిలో 500కు పైగా ఫోన్ కాల్స్ నమోదయ్యాయని తెలిపింది.

ఈ ఫోన్ కాల్స్ ఆధారంగానే దర్యాఫ్తు అధికారులు బెయిల్ డీల్ దొంగలను పట్టుకోవడం విశేషం. సూర్యప్రకాశ్ 456 సార్లు ఫోన్లలో మాట్లాడగా, అత్యధికంగా లక్ష్మీ నరసింహ రావుతో 299సార్లు మాట్లాడారు. లక్ష్మీ నరసింహ రావు, ప్రభాకర రావులు 122 సార్లు మాట్లాడుకున్నారు. సిబిఐ కోర్టు జడ్జిగా ఉన్న పట్టాభి, ఆయన కుమారుడితో 40సార్లు మాట్లాడారు. సూర్య ప్రకాశ్.. సురేష్‌తో 17సార్లు, దశరథరామిరెడ్డితో 14సార్లు మాట్లాడారు.

English summary
ACB filed a chargesheet in Karnataka former minister Gali Janardhan Reddy's bail deal case on suspended judge Prabhakar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X