వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్ స్టార్ కృష్ణకు పద్మాలయ చిక్కులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishna
అతి తక్కువ ధరకు అప్పటి ప్రభుత్వ హయాంలో పద్మాలయ స్టూడియోకు ఇచ్చిన భూమిని ఎక్కువ ధరకు విక్రయించినట్లు ఆరోపణలు రావడంతో సూపర్ స్టార్, మహేష్ బాబు తండ్రి కృష్ణ చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ తెలుగు దినపత్రికలోనూ, మరో ఆంగ్ల దినపత్రిక వార్తాకథనాలను ప్రచురించాయి. ఆ పత్రికల వార్తాకథనాల ప్రకారం - పద్మాలయ భూముల వివాదంపై ప్రభుత్వానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గుల్జార్ తాజాగా ఓ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ అంశం ముఖ్య కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా పరిశీలనలో ఉంది. పద్మాలయ భూమిని జీ టెలిఫిల్మ్‌కు విక్రయించినట్లు బయటపడింది.

ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రకారం - యాభై ఎకరాల భూమిని చలన చిత్ర అభివృద్ధికి ఎకరా కేవలం 8500 రూపాయల చొప్పున వెల కట్టారు. ఇందులో ప్రముఖ నటుడు కృష్ణ కుటుంబ సభ్యుల సారథ్యలోని పద్మాలయా స్టూడియోస్‌కు కూడా 9.5 ఎకరాలను కేటాయించారు. "ఈ భూమిని నిర్దేశిత ప్రయోజనాలకు మాత్రమే వాడాలి. అసలు ఉద్దేశం నెరవేరకపోతే భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది'' అని స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాతి క్రమంలో పద్మాలయా స్టూడియోస్‌కు అనుబంధంగా పద్మాలయ టెలీఫిల్మ్స్ ఏర్పడింది.

కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, కుమారుడు రమేశ్ బాబు తదితరులు డైరెక్టర్లుగా నెలకొల్పిన ఈ సంస్థ జీ-టెలీఫిల్మ్స్‌తో వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ లావాదేవీల్లో నష్టాలు వచ్చాయి. జీ - సంస్థ తాను పెట్టిన 60 కోట్ల పెట్టుబడి తిరిగి చెల్లించాల్సిందిగా పట్టుబట్టింది. డబ్బుకు బదులుగా స్టూడియోకు కేటాయించిన భూమిలో 5.53 ఎకరాలు జీ-టెలీఫిల్మ్స్‌కు కృష్ణ కుటుంబం కట్టబెట్టింది. మరో నాలుగువేల చదరపు గజాల స్థలాన్ని పద్మాలయ డైరెక్టర్లు 8 మంది తమ పేర్లపై రిజిస్టర్ చేసేసుకున్నారు.

ఈ వ్యవహారమంతా ఇప్పుడు చిక్కుల్లో పడింది. దీంటో పలు న్యాయపరమైన అంశాలు ఇమిడి ఉన్నట్లు అటు ఆంధ్రజ్యోతి, ఇటు టైమ్స్ ఆఫ్ ఇండియా రాశాయి. షేక్ మండలంలోని ఈ భూమిని గతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిందని, అయితే అది వెనక్కి వెళ్లిందని పత్రికలు రాశాయి.

English summary
Hyderabad district administration's recent revelation on illegal transfer of government properties has put the spotlight on one of the city's most high profile film studios, the Padmalaya Studios in Filmnagar that falls in Shaikpet mandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X