కేసులుండగా ఎలా?: ఈటీవి విక్రయాలపై సాక్షి ప్రశ్న

వ్యక్తులు గానీ, సమూహం గానీ డిపాజిట్లు సేకరించడాన్ని ఈ చట్టం నిషేధిస్తుందని, దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉందని, ఒకవేళ ఈ కేసులో నేరం రుజువైతే గరిష్ఠంగా సేకరించిన డిపాజిట్లకు రెండు రెట్ల జరిమానా చెల్లించవలసి ఉంటుందని తెలిపింది. అంటే రూ.2,600 కోట్ల డిపాజిట్ల సేకరణకు ఆయన రూ.5,200 కోట్ల జరిమానా చెల్లించవలసి ఉంటుందని, దీనికి తోడు వివిధ కోర్టుల్లో రామోజీపై ఆదాయపన్ను కేసులు కూడా పెండింగులో ఉన్నాయని తెలిపింది. ఆయన, ఆయన సంస్థలు ప్రస్తుతం దాదాపు ఏడేవేల కోట్లకు పైగా జరిమానా చెల్లించాల్సిన విచారణ ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.
ఇలాంటి సమయంలో నేరం రుజువై అంత జరిమానా పడితే ఆయన ఎక్కడి నుండి చెల్లిస్తారనేది అందరినీ వేధిస్తోన్న ప్రశ్న అని పేర్కొంది. రామోజీ సంస్థల్లో విలువైనదిగా చెప్పే రామోజీ ఫిల్మ్ సిటీ భూములన్నీ వివాదాస్పదంగా ఉన్నాయని, కాబట్టి వాటిని పక్కకు పెట్టాల్సి ఉంటుందని, మిగతా ఆస్తులు చూస్తే ఈనాడు పత్రిక, టెలివిజన్ ఛానళ్లేనని, ప్రస్తుతం టెలివిజన్ ఛానళ్లను అమ్మేస్తే పరిస్థితి ఏంటనేదే అసలు ప్రశ్న అని రాసింది. అందుకని ఈ ఒప్పందాన్ని నిలుపు చేయటమో లేక ఒప్పందం కుదిరితే తద్వారా వచ్చిన సొమ్మును ఎస్క్రో ఖాతాలో వేసి కేసుల్లో తుది తీర్పు వెలువడే వరకు అట్టిపెట్టడమో చేయాల్సి ఉంటుందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం, న్యాయస్థానాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications