భార్యకు అఫ్జల్ గురు రాసిన లేఖ: తెలుగు పాఠం

కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ కాశ్మీర్‌లో సోపోర్‌లో గల అఫ్జల్ గురు భార్యకు 36 గంటల తర్వాత ఆ లేఖ అందింది. ఆ లేఖలో అఫ్జల్ గురు ఏ విధమైన పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. తప్పు చేసిన భావనను కూడా అతను వ్యక్తీకరంచలేదు. అఫ్జల్ గురు తన భార్యకు ఉర్దూలో లేఖ రాశాడు. దాని ఆంగ్ల అనువాదానికి తెలుగు అనువాదం ఇస్తున్నాం, చదవండి
"6.25 ఎఎం
9/2/2013
గౌరవనీయమైన కుటుంబం, విశ్వసనీయమైన వారందరికీ.
అసాలం ఉ అలికుమ్
ఈ కార్యం కోసం నన్ను ఎంపిక చేసుకున్న భగవంతుడికి కృతజ్ఞతలు. నా వైపు నుంచి, విశ్వాసపాత్రులైన వారందరికీ శుభాకాంక్షలు తెలపాలని ఆశిస్తున్నాను, మన చరమాంకం కూడా సత్యం, న్యాయబద్ధతా మార్గం మీద ఆధారపడాలి. నా మరణానికి విలపించడానికి బదులు నేను సాధించిన కార్యాన్ని గౌరవించాలని నా కుటుంబాన్ని కోరుతున్నాను.
భగవంతుడే మీ మహా రక్షకుడు, అత్యుత్తమ సహాయకుడు.
అలా రక్షణలో మిమ్మల్ని వదిలి నేను వెళ్లిపోతున్నాను".












Click it and Unblock the Notifications