వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మురిపించిన ముద్దుగుమ్మలు బోల్తా!(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బుధవారం వింబుల్డన్‌లో అసాధరణం జరిగింది! ఇప్పటికే తొలి రౌండుల రఫెల్ నాదల్ నిష్క్రమించాడు. తాజాగా ఓటమితో కొందరు, గాయాలతో మరో ఏడుగులు ఆటగాళ్లు ఇంటి దారి పట్టారు. మూడో రోజు సీడెడ్లకు షాక్‌లమీద షాక్‌లు తగిలాయి. రెండో రౌండ్‌లో కొందరు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా, మరికొందరు పరాజయం పాలయ్యారు.

మూడో సీడ్, మరియా షరపోవా (రష్యా), రెండో సీడ్, బెలారస్ భామ విక్టోరియా అజరెంకా, 12వ సీడ్ ఇవనోవిచ్ (సెర్బియా) పరాజయాలతో పోరును ముగించారు. పురుషుల సింగిల్స్‌లోనూ ఆరో సీడ్ విల్‌ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్), 18వ సీడ్ జాన్ ఇస్నర్ (అమెరికా) ఇంటి దారి పట్టారు. స్విస్ దిగ్గజం ఫెదరర్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు.

షరపోవా అన్‌సీడ్ మిషెల్లే లార్చర్ డి బ్రిటో (పోర్చుగల్) చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఇదే విభాగంలో అజరెంకా వాకోవర్ చేసి పోరును ముగించింది. ఇవనోవిచ్ కూడా 3-6, 3-6తో అన్‌సీడెడ్.. ఇజైన్ బుచర్డ్ చేతిలో పరాజయం పాలైంది.

ఎర్నెస్ట్స్ గుల్బిస్ (లాత్వియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సోంగా, మన్నారినోతో జరిగిన పోటీలో ఇస్నర్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఆండీ ముర్రే మూడో రౌండుకు దూసుకెళ్లాడు. కాగా భారత్‌కు చెందిన మహేష్ భూపతి, రోహన్ బోపన్న, సానియా మీర్జా జోడీ శుభారంభం చేసింది.

మొదట్లోనే ఇంటికి నాదల్

రఫెల్ నాదల్ ప్రారంభంలోనే ఇంటి దారి పట్టాడు. నాదల్ 12 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ విజేత. అలాంటి నాదల్‌కు రెండు రోజుల క్రితం బెల్జియంకు చెందిన స్టీవ్ డార్కిస్ షాక్ ఇచ్చాడు.

ఫెదరర్ ఎనిమిదో ఆశ ఆడియాశ!

ఏడు వింబుల్డన్స్ విజేత రోజర్ ఫెదరర్ రెండో రౌండ్లోనే ఇంటి ముఖం పట్టాడు. ఫెదరర్ ఉక్రెయిన్‌కు చెందిన అన్ సీడెడ్ స్టాకోస్కీ చేతిలో పరాజయం చవిచూశాడు.

అందాల భామ షరపోవాకు షాక్

రష్యా భామ మరియా షరపోవాను 131వ ర్యాంక్ బ్రిటో ఓడించింది. మూడో సీడ్ అయిన షరపోవాను బ్రిటో 6-3, 6-4తో ఓడించి సంచలనం సృష్టించింది.

సోంగా రిటైర్డ్ హర్ట్

గుల్బిస్‌తో జరిగిన రెండో రౌండ్ మ్యాచులో సోంగా రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మన్నారినోతో జరిగిన పోటీలో కూడా ఇస్నర్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు.

విక్టోరియా, ఇవనోవిచ్...

విక్టోరియా అజరెంకా వాకోవర్ చేసి పోరును ముగించింది.

ఇవనోవిచ్ ఓటమి

ఇవనోవిచ్ కూడా 3-6, 3-6తో అన్‌సీడెడ్ ఇజైన్ బుచర్డ్ చేతిలో పరాజయం పాలైంది.

మహేష్, సానియా హిట్

భారత్‌కు చెందిన మహేష్ భూపతి, రోహన్ బోపన్న, సానియా మీర్జాలు తమ జోడీలతో శుభారంభం చేశారు.

English summary
Injuries knocked five players out of Wimbledon on Wednesday with second seeded Victoria Azarenka joining a casualty list that included the man who stunned Rafael Nadal in the first round and the American who won the longest match in tennis history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X