వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘అసహనంపై ఓ ముస్లిం మహిళ మనసులో మాట’

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశంలో అసహనం నెలకొందంటూ పలువురు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఓ ముస్లిం మహిళ తన అభిప్రాయాన్ని సునిశితంగా వెల్లడించింది. ఆమె వెల్లడించిన అభిప్రాయాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

భారతదేశంలో అసహనం పెరిగిపోయిందని పలువురు అవాస్తవమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇది నెలరోజులుగా బాగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేను నా అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నా. నేనొక ముస్లిం మహిళను. నేను ఇండియాలోనే జీవిస్తున్నా, ఇక్కడే పని చేస్తున్నా అదే భావనతో. నేను ఈ నేపథ్యంలో నా అభిప్రాయాలను పంచుకోలనుకుంటున్నా.

నేను ఒక ముస్లిం మహిళను. నేను డెర్మటాలజిస్టుగా ప్రాక్టీస్ చేస్తున్నా. బెంగళూరులో అత్యున్నత ప్రమాణాలతో కూడిన లేజర్ స్కిన్ క్లినిక్ నడుపుతున్నా. నేను కువైట్ నుంచి 18ఏళ్ల వయస్సులో మెడికల్ విద్యనభ్యసించేందుకు భారతదేశం వచ్చా. నాతో వచ్చిన స్నేహితులందరూ వెళ్లిపోయినా.. నేను మాత్రం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నా. ముస్లిం అయినందువల్ల నాకు సమస్య వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. అలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు కూడా. నేను నా సొంత దేశం వెళ్లకుండా.. ఇదే నా దేశం అనుకుని గత 20ఏళ్లుగా ఇక్కడే సేవ చేసుకుంటూ ఉంటున్నా.

నేను కర్ణాటకలోని మనిపాల్‌లో చదువుకున్నాను. అందరు విద్యార్థుల్లాగే నేను ఒంటరిగా ఇక్కడే ఉన్నా. నేను కాలేజీలో చదువుతున్న సమయంలో ఇక్కడ అందరూ ప్రొఫెసర్లూ, విద్యార్థులూ హిందువులే. నా చుట్టూ ఉన్న వారందరూ కూడా ఎక్కువగా హిందువులే. నా మతం వల్ల గానీ, నా జెండర్ వల్ల గానీ.. నాపై ఎవరూ ఎప్పుడూ వివక్ష చూపలేదు. నాతో వారందరూ ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారు. వారందరూ తమలో ఒకరిగా నన్ను చూసుకున్నారు. మణిపాల్‌లో నాకు సహకరించిన వారందరికీ నేనెప్పటికీ కృతజ్ఞురాలిని.

మణిపాల్ వీడిని తర్వాత.. నా భర్తతో బెంగళూరులోనే నివాసం ఉన్నాను. వివాహమైన తర్వాత కూడా తాము బెంగళూరులోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇందుకు ఒక కారణం కూడా ఉంది. నా భర్త కూడా ముస్లిమే. అతని ఫస్ట్ నేం ఇక్బాల్. జర్మనీ నుంచి పిహెచ్‌డీ, చెన్నై ఐఐటి నుంచి ఎంటెక్ పట్టా పొందిన ఆయన ఏరోస్పేస్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అతను వృత్తిరీత్యా డీఆర్‌డిఓ, ఎన్ఏఎల్, హెచ్ఏఎల్, జిటిఆర్ఈ, ఇస్రో, ఐఐఎస్‌సి, బిహెచ్ఈఎల్ లాంటి భారతదేశంలోని పూర్తి భద్రతాపరమైన సంస్థల్లో పని చేశారు. వీటన్నింటినీ ఆయన సందర్శించారు.

ఆ సమయంలో కనీసం ఒక్కసారి కూడా ఆయడ్ని ఎవరూ తనిఖీ చేయడం గానీ, ప్రశ్నించడం గానీ చేయలేదు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా వీటిలో ఎలాంటి మార్పూ జరగలేదు. అంతేగాక, ఈ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ సంస్థలు మరింత క్రమశిక్షణగా పని చేస్తున్నాయని నా భర్త చెప్పాడు.

నిజం చెప్పాలంటే.. ఇక్బాల్ ఎప్పుడు అమెరికా వెళ్లినా అక్కడి భద్రతాధికారులు ఆయనను బట్టలు తొలగించి తనిఖీలు చేశారు. అమెరికాలో 9/11 దాడులు జరిగాక.. ఆయన జర్మనీలో పిహెచ్‌డి చేస్తున్న సమయంలోనూ ఆయనపై భద్రతా దళాలు నిఘా వేశాయి. జర్మనీ ప్రభుత్వం మేము ఒక లేఖను కూడా పొందాం. అదేంటంటే.. ఇక్బాల్ అనుమానిత వ్యక్తి కాదు. అతడ్ని అనుమానించాల్సిన అవసరం లేదని. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ముస్లింల పరిస్థితులు ఇలా ఉన్నాయి.

నా భర్త ఇక్కడ తాను పని చేస్తున్న సంస్థల్లో అందరితోనూ గౌరవం పొందుతున్నారు. ఇక్కడి హిందువులందరిచే స్నేహపూర్వక వాతావరణాన్ని అనుభవిస్తున్నారు. ఇటీవల కాలంలో కూడా ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. అందువల్లే ఎప్పుడూ దేశంలో అసహనం అనేది లేదు. అది మనం వాడుకుంటున్న పదం మాత్రమే.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత సంవత్సరమే నేను క్లినిక్ ప్రారంభించాను. నిబద్ధత పౌరురాలిగా నేను నెలవారీగా పన్నులు కూడా చెల్లిస్తున్నాను. నాకు సమస్యలు సృష్టించే ఎలాంటి పని చేయను. అందువల్లే నేను నా క్లినిక్‌ను సజావుగా నడుపుకుంటున్నాను. నాకు సహకరిస్తున్న క్లైంట్స్, నా పేషెంట్లు.. అందులోనూ ఎక్కువ మంది హిందువులే ఉన్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు. నా క్లినిక్‌లో ఉన్నది కూడా అందరూ హిందువులే. నాతో పాటు వారందరూ కూడా నా క్లినిక్‌ను బాగా చూసుకుంటారు. నేను లేకపోయినా వారే చూసుకుంటారు.

A Muslim Lady Shows Mirror to All Intolerance Rants in This Brilliant Article. Do Read It Full !!

నేను బ్యాంకర్స్, ప్రభుత్వ అధికారులు, చాలా మంది ప్రజలను కలుస్తుంటాను. నేనుంటున్న గత 20ఏళ్లలో కనీసం ఏ ఒక్కసారి కూడా భారతదేశాన్ని విడిచివెళ్లిపోదామని అనిపించలేదు. నా మొత్తం కుటుంబం కూడా విదేశాల్లో ఉంటుంది. నా కుటుంబసభ్యులు అక్కడికి రమ్మన్నారు. అంతేగాక, నన్ను క్లినిక్ ఓపెన్ చేయమంటూ కువైట్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. అక్కడ క్లినిక్ పెడితే భారీ మొత్తంలో ఆదాయం కూడా వస్తుంది. అయినా నేను ఇండియాలో ఉంటున్నా. ఎందుకంటే ఇక్కడ నా ఆనందానికి ఎలాంటి ఆటంకాలు కలగడం లేదు. ఇక్కడ నా స్వేచ్ఛకు ఎలాంటి భంగం వాటిల్లడం లేదు.

కువైట్‌లో ఎవరూ లేరని అనిపిస్తుంది. గత 40ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్నప్పటికీ, వారందరూ బహిష్కృతులుగానే ఉంటున్నారు. వారికి అక్కడ ఎలాంటి హక్కులు లేవు. అక్కడ మారుతున్న చట్టాల ప్రకారం రెసిడెంట్ పర్మిట్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. బహిష్కృతుల జీవితం చాలా కష్టంగా ఉంటుంది. మేము అక్కడి చట్టాలు పాటిస్తున్నప్పటికీ బహిరంగంగానే అక్కడ వివక్షకు గురవుతున్నాం. ఆసియా వాసులను వారు థర్డ్ గ్రేడ్ ప్రజలుగా చూస్తారు. అక్కడి పౌరులు, అరబ్స్, తెల్లజాతీయులకే అక్కడ ప్రాధాన్యత ఉంటుంది. మేము అక్కడ ఆనందంగా లేము. ఇప్పటికీ అక్కడ అదే పరిస్థితి ఉంది.

ముస్లిం దేశంలోనే ముస్లింలమైనా మేము వివక్షతకు గురయ్యాం. కానీ ఇండియాలో ఇక్కడి పౌరులతో సమానంగా అన్ని హక్కులను కలిగి ఉన్నాం. అప్పుడే నాకు అనిపించింది ఇక్కడే మనవాళ్లు ఉన్నారని. నీవు అమెరికాలో ఇండియన్ అమెరికన్‌వి, కెనడాలో ఇండియన్ కెనడియన్‌వి, యూకేలో ఇండియన్ బిట్రీష్‌ర్‌వి.. కానీ, ఒక్క ఇండియాలో మాత్రమే నీవు ఇండియన్‌వి.

మిగితా వారందరూ వారు అనుకున్నదే చెబుతారు, దానికి మద్దతుగా ఉంటారు. నీవు నీ ఇంట్లో ఉంటేనే నీకు ఇళ్లనే భావన కలుగుతుంది. నేను చాలా ప్రాంతాల్లో పర్యటించా. ఎక్కడ ఉండలేకపోయా. ఎందుకంటే.. భారతదేశంలో నన్నెవరూ నీవు ఇండియన్‌వా? అని అడలేదు. ఇదే అన్ని దేశాలకు భారతదేశానికి ఉన్న తేడా.

A Muslim Lady Shows Mirror to All Intolerance Rants in This Brilliant Article. Do Read It Full !!

అయితే, ఇక్కడ సెలబ్రిటీలుగా ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు? నా భర్త లాంటి సాధారణ పౌరుడికే ఎలాంటి ఇబ్బందులు కలగనప్పుడు.. వారు ఏ సమస్యలు ఎదుర్కొన్నట్లు. అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు భయపడాల్సిన అసవరం ఏముంది? వారు భారత శాశ్వత పౌరులు. ఇక్కడ విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. వారి పిల్లలు ఉత్తమ పాఠశాల్లో చదువుకుంటున్నారు. వారికి ప్రత్యేకమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారా? నేను ప్రతిరోజూ ఒంటరిగానే పర్యటిస్తుంటాను? నేను ఎప్పుడు భయానికి గురికాలేదే?

బాధ్యత రహితమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో... అమీర్ ఖాన్, షారుక్ ఖాన్‌ లాంటి వ్యక్తుల నుంచి ఒక బాధ్యత కలిగిన పౌరురాలిగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఈ దేశంలోని సుమారు 13కోట్లకు పైగా ముస్లింల పరువు తీస్తున్నారు. వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రజలకు ఎలా అంటగడతారు? భారతదేశంలో ముస్లింలకు భద్రత లేదంటూ నా దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చడానికి వారికేం హక్కు ఉంది.

ఇక్కడి ముస్లింలను ఆహ్వానించడానికి పాకిస్థాన్‌కు ఎంత ధైర్యం. ముస్లింలపై నా హిందూ సోదరులు చేసిన వ్యాఖ్యలపై నాకు బాధ కలిగింది. అయినా నా పరిమితికి మించి ముందుకొచ్చి చెబుతున్నాను. దేశంలో సహనం ఉంది. నేను ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఆనందంగా ఉంటున్నాను. ఇప్పుడు కూడా. ఇలాంటి వ్యాఖ్యలు చూస్తుంటే నాకు భయం కలుగుతోంది. నా సొంత దేశానికి నేను దూరమవుతున్నానా? అనే భావన కలుగుతోంది. ఇదంతా కొందరు మూర్ఖులు దేశంపై చేసిన వ్యాఖ్యల మూలంగా కలుగుతుందేమోనని భయంగా ఉంది.

ఎంతకాలం ఇలాంటి మూర్ఖత్వాన్ని మెజార్టీలైన హిందువులు భరిస్తారో? నాకు తెలియడం లేదు. అందుకే భయమేస్తోంది. ప్రస్తుత సమయంలో ముస్లింలందరూ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ యొక్క విలువ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భారతదేశంలో మనమంతా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో ఉన్నాం. జీవితాలను ఆనందంగా గడుపుతున్నాం. అందుకే.. హిందూ సోదరులు తమ సహనాన్ని ఎప్పుడూ కొనసాగించాలని నేను ప్రార్థిస్తున్నా.

-సోఫియా రంగ్వాలా

English summary
Amidst a fake atmosphere of Intolerance being created in India, in the last 1 month, I owe my version of what I, a Muslim lady, living and working in India feel like. This has been due from me since sometime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X