మహిళలకు వేతన సమానత్వానికి మరో 70 ఏళ్లు
యనైటెడ్ నేషన్స్: పురుషులు, మహిళల మధ్య వేతన సమానత్వానికి మరో డెబ్బై సంవత్సరాలు పట్టవచ్చునని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ ఓ ప్రకటనలో ఈ ఆసక్తిక విషయాన్ని వెల్లడించారు.

పురుషులతో పోల్చుకుంటే మహిళలు 77 శాతం మాత్రమే సంపాదిస్తున్నారని చెప్పారు. ఒకప్పుడు మహిళలు ఉద్యోగం చేస్తామంటే కుటుంబ సభ్యులు లేదా భర్తలు వ్యతిరేకించే వారని తెలిపారు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. అయితే, దీంతోనే లక్ష్యం సాధించలేదన్నారు.
మహిళల హక్కులకు ప్రాధాన్యం ఇస్తూ ఈ వ్యత్యాసాన్ని పూర్తిగా తగ్గించాలని తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల వ్యాపార కార్యకలాపాల్లో 30 శాతం మంది మహిళల నిర్వహణ ఉందన్నారు. వీరు చిన్న పారిశ్రామికవేత్తలే అన్నారు. పురుషులతో సమానంగా వేతన సాధనకు మరో డెబ్బై ఏళ్లు పడుతుందన్నారు.


Click it and Unblock the Notifications