• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుడి మీదే ప్రతాపం.. బడాబులైతే గప్‌చుప్: బ్యాంకుల లీలలు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చట్టం ముందు అందరూ సమానులే కావచ్చునేమో కానీ.. బ్యాంకులు మాత్రం సామాన్యులు, అసామాన్యులు అనే గీత గీసుకుని కూర్చున్నట్టున్నాయి. ఖాతా తెరవడానికే.. ఇది తీసుకురా.. అది తీసుకురా.. అని సామాన్యుడిని ముప్పుతిప్పలు పెట్టించే బ్యాంకులకు.. బడాబాబుల విషయంలో మాత్రం ఏదీ అక్కర్లేదు. బ్యాంకుకి రాగానే.. కూర్చోబెట్టి మర్యాదలు చేసి మరీ నోట్ల కట్టలు చేతిలో పెట్టి పంపిస్తాయి. దేశవ్యాప్తంగా అన్నీ బ్యాంకుల తీరు ఈనాడు ఇలాగే తయారైంది.

పీఎన్బీ మోసం తక్కువే: మొత్తం వాటా రూ.61,200 కోట్లు.. ఇదీ ఆర్బీఐ లెక్కపీఎన్బీ మోసం తక్కువే: మొత్తం వాటా రూ.61,200 కోట్లు.. ఇదీ ఆర్బీఐ లెక్క

రైతుల పరిస్థితి?:

రైతుల పరిస్థితి?:

దేశంలో చిన్నా చితక వ్యాపారులు, రైతులు లక్ష రూపాయల రుణం తీసుకుంటేనే.. వాటి వసూలుకు బ్యాంకులు నానా హంగామా చేస్తాయి. ఇళ్ల మీద పడి కొన్నిసార్లు వస్తువులు తీసుకెళ్లిన ఘటనలూ ఉన్నాయి.

అసలే అప్పుల్లో ఉండే రైతులు.. బ్యాంకులకు రుణం చెల్లించలేక.. వాళ్లు పెట్టే పోరు భరించలేక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా గత 15ఏళ్లలో 2.50లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లందరి సగటు రుణం కేవలం రూ.2లక్షల లోపే. బడాబాబులు ఎగ్గొట్టే రుణాల ముందు వీరి రుణాలు వీసమెత్తు కూడా కాదు.

 డబ్బు తీసుకుందామన్నా:

డబ్బు తీసుకుందామన్నా:

బ్యాంకు నుంచి సామాన్యుడెవరైన కాస్త ఎక్కువ మొత్తంలో డబ్బు డ్రా చేసుకోవాలన్నా లెక్కలేనన్ని నిబంధనలు ముందు పెడుతారు. పాన్ కార్డు.. ఆధార్ కార్డు.. అంటూ పదిసార్లు తిప్పించుకున్నా ఆశ్చర్యం లేదు. మన ఖాతాలో డబ్బు మనం తీసుకోవడానికే బ్యాంకులను బతిమాలాల్సిన పరిస్థితి. అలాంటి బడాబాబుల విషయంలో మాత్రం ఏ లెక్కలూ పత్రాలు సరిగా ఉన్నా లేకున్నా.. కోట్లకు కోట్లు రుణాలు ఇచ్చేస్తాయి.

 సామాన్యుడ సొంతిల్లు కట్టుకోవాలన్నా:

సామాన్యుడ సొంతిల్లు కట్టుకోవాలన్నా:

సామాన్యుడెవరైనా సొంతిల్లు కట్టుకోవాలన్నా.. క్రెడిట్ స్కోర్, గతంలో తీసుకున్న లోన్ల చరిత్రలను వెలికి తీసి రుణానికి లెక్కలేనన్ని నిబంధనలు చెబుతాయి బ్యాంకులు. ఎక్కడ ఏ చిన్న లోపం దొరికినా సరే రుణం ఇవ్వడానికి ససేమిరా అంటాయి. ఎడ్యుకేషన్ లోన్ అయినా.. ఇంకోటైనా ఇదే పరిస్థితి.

 సామాన్యులైతే గగ్గోలు.. లేదంటే అంతే

సామాన్యులైతే గగ్గోలు.. లేదంటే అంతే

సామాన్యుల విషయంలో ఇలా చిన్న చిన్న మొత్తాలకే గగ్గోలు పెట్టే బ్యాంకులు.. బడాబాబుల విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంటాయి. వాళ్ల రుణానికి ప్రాతిపదిక ఏంటి?.. దానికి సంబంధించిన ఆధారాలు, వివరాలు అన్ని సక్రమంగా ఉన్నాయా? లేవా? అన్న విషయాలను పూర్తిగా గాలికొదిలేస్తున్నాయి.

బడాబాబులైతే చాలు.. కుచ్చుటోపీ?:

బడాబాబులైతే చాలు.. కుచ్చుటోపీ?:

బడాబాబులైతే చాలు బ్యాంకులకు ఈజీగా కుచ్చు టోపీ పెట్టేయొచ్చు అనడానికి నీరవ్ మోడీ ఉదంతమే ఇప్పుడు తాజా ఉదాహరణ. ఒకటా.. రెండా.. పదకొండు వేల కోట్లు దోచుకున్నాడు. భారీ సంఖ్యలో డబ్బా కంపెనీలను సృష్టించి.. బోగస్ ఎల్‌ఒయు(బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన పత్రం)లను పొంది వేల కోట్ల రూపాయాలను అప్పనంగా దోచుకున్నాడు నీరవ్ మోడీ.

 ఐటీ హెచ్చరించినా.. కేంద్రంలో చలనమేది?:

ఐటీ హెచ్చరించినా.. కేంద్రంలో చలనమేది?:

గతేడాదే ఐటీ శాఖ దీనిపై కేంద్రాన్ని హెచ్చరించినా.. తీరిగ్గా కాలం వెళ్లదీస్తూ వచ్చింది. తీరా ఇప్పుడు నీరవ్ విదేశాలకు చెక్కేశాక అంతా కలిసి గగ్గోలు పెడుతున్నారు. అప్పుడు మాల్యా.. ఇప్పుడు నీరవ్.. రేపు ఇంకెవరో?.. బడాబాబులు చట్టానికి అతీతులా అన్న ప్రశ్నలు మాత్రం సామాన్యుడిని వెంటాడుతున్నాయి.

English summary
If a comman man went to bank to open an account he face somany questions from them. It takes atleast two to three days to complete the procedure, but scenario is completely different like Mallya and Neerav Modi cases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X