హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుల్లెట్ ట్రైన్‌: హైద్రాబాదీ చక్రధర్ తయారు చేసిన లోగో ఎంపిక

హైద్రాబాద్‌కు చెందిన ఆళ్ళ చక్రధర్ అనే యువకుడి పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చక్రధర్‌ రూపొందించిన లోగోను ప్రభుత్వం వినియోగించనుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైద్రాబాద్‌కు చెందిన ఆళ్ళ చక్రధర్ అనే యువకుడి పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చక్రధర్‌ రూపొందించిన లోగోను ప్రభుత్వం వినియోగించనుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు చక్రధర్‌ రూపొందించిన లోగోను వినియోగించాలని నిర్ణయం తీసుకొంది. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు(నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) లోగో కోసం కేంద్ర ప్రభుత్వం ధరఖాస్తులను ఆహ్వనించింది.

Bullet train logo has Hyderabad youth's stamp

దీంతో అహ్మదాబాద్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో చదువుకుంటున్న చక్రధర్‌ కూడా తాను తయారు చేసిన లోగోను ప్రభుత్వానికి పంపారు. గతంలో కూడ చక్రధర్ పలు పోటీల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 31 పోటీల్లో పాల్గొన్నారు చక్రధర్. అయితే ఈ దఫా మాత్రం చక్రధర్‌ రూపొందించిన డిజైన్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చక్రధర్‌ రూపొందించిన డిజైన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 31వ దఫా చక్రధర్ చేసిన ప్రయత్నం ఫలించింది. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు చిరుతపులి పరుగెడుతున్నట్లు రూపొందించిన లోగోను ఎంట్రీగా చక్రధర్ పంపాడు.

వేలాదిగా వచ్చిన ఎంట్రీల నుంచి బుల్లెట్‌ ట్రైన్‌ లోగోగా చక్రధర్‌ రూపొందించిన లోగోను ప్రభుత్వం ఎంపిక చేసింది. బుల్లెట్‌ ట్రైన్‌ లోగోగా తన డిజైన్‌ ఎంపిక కావడంపై చక్రధర్‌ సంతోషం వ్యక్తం చేశారు. తాను చేసిన చాలా ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు.

వేగానికి చిరుత ప్రతీక కాగా దానిపై ఉన్న రైలు ఆకారం నమ్మకానికి నిదర్శనమని చక్రధర్ అభిప్రాయపడ్డారు.. చక్రధర్‌ స్వస్థలం హైదరాబాద్‌. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. తల్లి ఓ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

English summary
The logo designed by a 27-year-old city youth will adorn India's first high speed rail network project, namely the bullet train connecting Mumbai and Ahmedabad. Chakradhar Aalla, a resident of Lakdi-ka pul, bagged the first prize in the logo designing contest held by the National High Speed Rail Corporation Limited (NHSRCL).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X