వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకాశంలో అద్భుతం: పట్టపగలే 2ని.పాటు అదృశ్యం కానున్న సూర్యుడు!

ఇప్పటివరకు ఎన్నో గ్రహణాలు చూశాం. కానీ ఈసారి రాబోయే సంపూర్ణ సూర్యగ్రహణం నిజంగా అద్భుతమే. ఎందుకంటే.. రెండు నిమిషాలసేపు సూర్యుడు పూర్తిగా అదృశ్యం కాబోతున్నాడట!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/న్యూఢిల్లీ: మరోసారి ఆకాశంలో అద్భుతం ఆవిష్కారం కానుంది. భూగోళ చరిత్రలోనే ఇది అరుదైన సంఘటనగా నిలవనుంది. ఇప్పటివరకు ఎన్నో గ్రహణాలు చూశాం. కానీ ఈసారి రాబోయే సంపూర్ణ సూర్యగ్రహణం నిజంగా అద్భుతమే. ఎందుకంటే.. రెండు నిమిషాలసేపు సూర్యుడు పూర్తిగా అదృశ్యం కాబోతున్నాడట! ఈ అద్భుత దృశ్యం 2017 ఆగస్టు 21వ తేదీన అమెరికా ఖండంలో సంభవించబోతోంది. మిట్టమధ్యాహ్నం చిమ్మ చీకటి కమ్ముకోనున్నదట. ఇది ప్రస్తుత మానవ సమాజానికి ఒక గొప్ప అనుభూతిగానే చెప్పవచ్చు. శాస్త్రవేత్తలకు కూడా.

38ఏళ్ల తర్వాత మళ్లీ..

38ఏళ్ల తర్వాత మళ్లీ..

ఈ టోటల్‌ సోలార్‌ ఎక్లిప్స్‌ 38 ఏళ్ళలో మళ్ళీ ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1979 ఫిబ్రవరి 26 నాటి సూర్యగ్రహణాన్ని వాతావరణ అననుకూలత వల్ల ప్రజలు చూడలేకపోయారు.

చూడగలిగేది చంద్రగ్రహణాలే..

చూడగలిగేది చంద్రగ్రహణాలే..

సూర్యుడు-భూమి మధ్యలోకి చంద్రుడు రావడం... ఈ ముగ్గురు ఒకే సరళరేఖలో ఉండటం సూర్యగ్రహణం. అలా కాకుండా సూర్యుడు - చంద్రుడు మధ్యలోకి భూమి రావడం... ఈ మూడూ ఒకే సరళరేఖలోకి రావడం చంద్రగ్రహణం. కానీ నిజానికి చంద్రగ్రహణాలకంటే సంపూర్ణ సూర్యగ్రహణాలే ఎక్కువగా సంభవిస్తాయి. కానీ మనం చూడగలిగేది ఎక్కువ చంద్రగ్రహణాలే.

శాస్త్రవేత్తల పరిశోధనలకు పండగే

శాస్త్రవేత్తల పరిశోధనలకు పండగే

2017, ఆగస్టు 21న అంతరిక్ష అద్భుతం తిలకించేందుకు వందలాదిమంది శాస్త్రవేత్తలు, రోదసీ ఔత్సాహికులు సన్నద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన రకరకాల విషయాలు, ముందు జాగ్రత్త కబుర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. మిట్టమధ్యాహ్నం రెండు నిమిషాలసేపు చిమ్మ చీకటి ఆవరించనుంది. ఆ రోజు వాతావరణం కనుక బాగా అనుకూలిస్తే ఈ అద్భుతాన్ని చూడవచ్చు.

సౌత్ కరోలినా వాసులకే ఎక్కువ అవకాశం

సౌత్ కరోలినా వాసులకే ఎక్కువ అవకాశం

ఈ టోటల్‌ సోలార్‌ ఎక్లిప్స్‌ని సౌత్ కరోలినా ప్రజలు ఎంతోబాగా ఎంజాయ్‌ చేయగలుగుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని చరిత్రలో బెస్ట్‌ స్కై ఈవెంట్‌గా పేర్కొంటున్నారు. దీని తర్వాత 2024 ఏప్రిల్ 8న మూడు నుండి నాలుగు నిమిషాలసేపు, తిరిగి 2044 ఆగస్టు 23న, ఆ తర్వాత వరుసగా 2045, 2052, 2078లలో కూడా ఇదే తరహాలో సూర్యుడు పట్టపగలు అదృశ్యమైపోతాడని చెబుతున్నారు.

English summary
The first total solar eclipse in the continental United States in nearly 40 years takes place on Aug. 21, 2017. Beyond providing a brilliant sight in the daytime sky, total solar eclipses provide a rare chance for scientists to collect data only available during eclipses. NASA is funding 11 scientific studies that will take advantage of this opportunity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X