వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్రం అద్భుతమే: బెజవాడ యువతికి వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డు

ప్రపంచ ఫొటోగ్రఫీ అవార్డ్స్ పోటీలో తెలుగు యువతి సత్తా చాటింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రపంచ ఫొటోగ్రఫీ అవార్డ్స్ పోటీలో తెలుగు యువతి సత్తా చాటింది. సోనీ సంస్థ ఆధ్వర్యంలోని ప్రపంచ ఫొటోగ్రఫీ సంస్థ ఏటా నిర్వహించే పోటీలో విద్యార్థి విభాగంలో విజయవాడకు చెందిన లక్ష్మీశ్రావ్య కాగొలను(26) విజేతగా నిలిచింది.

భారతదేశం నుంచి ఇప్పటివరకూ విద్యార్థి విభాగంలో ఎంపికైన ఏకైక యువతి శ్రావ్యే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 500 విద్యాసంస్థల నుంచి యువత పోటీలో పాల్గొన్నారు. దీనిలో ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయడం జరిగింది.

Four Indian photographers in 2017 Sony World Photography Awards shortlist

న్యూయార్క్‌లోని స్కూల్‌ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్‌లో మాస్టర్స్‌ ఇన్‌ డిజిటల్‌ ఫొటోగ్రఫీ కోర్సు చేస్తున్న శ్రావ్య ఉత్తరఅమెరికాఖండం నుంచి ఎంపికైంది. విజయవాడకు చెందిన సురేష్‌ కాగొలను, శ్యామల దంపతుల కుమార్తె శ్రావ్య నగరంలోని కె.ఎల్‌.యూలో 2012లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది.

రెండేళ్ల కిందట డిజిటల్‌ ఫొటోగ్రఫీ కోసం న్యూయార్క్‌కు వెళ్లింది. కాగా, లక్ష్మీశ్రావ్యతోపాటు మరో నలుగురు భారతీయులకు కూడా అవార్డులు కార్యక్రమంలో తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు.

English summary
Works of four Indian photographers have made it to the top 10 shortlist of the 2017 Sony World Photography Awards in the Professional, Open and Student Focus competitions.Shravya Kag from Vijayawada, Andhra Pradesh, was shortlisted for a single image answering the brief ‘Memories’ in the Student Focus competition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X