హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కామన్వెల్త్ విజేతలకు ఘనస్వాగతం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించి నగరానికి చేరుకున్న విజేతలకు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఏస్ షట్లర్ పారుపల్లి కశ్యప్ మాట్లాడుతూ.. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.

గత టోర్నీలో కాంస్యం నెగ్గిన తాను ఈసారి అంతకంటే బాగా రాణిస్తానని ఊహించలేదని తెలిపాడు. అయితే ఖచ్చితంగా పతకం సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్లానని చెప్పాడు. బంగారు పతకం సాధించడం మాత్రం ప్రత్యేక అనుభూతినిచ్చిందని పేర్కొన్నాడు.

కశ్యప్ తోపాటు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన పివి సింధు, గురుసాయిదత్, కోచ్ గోపీచంద్‌తో కలిసి నగరానికి చేరుకున్నారు. వారికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. తన శిశ్యులు సాధించిన విజయాల పట్ల గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు. కశ్యప్ గెలుపు భారతదేశంలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు.

గత కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టపడ్డామని తెలిపిన గోపీచంద్.. కశ్యప్ ఎంతగానో మెరుగయ్యాడని చెప్పారు. స్వర్ణం సాధించలేకపోయినప్పటికీ తమ తొలి కామన్వెల్త్ గేమ్స్‌లోనే కాంస్యం గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని పివి సింధు, గురుసాయి దత్ తెలిపారు. కాగా, కామన్వెల్త్ గేమ్స్‌లో రాష్ట్రం నుంచి పతకాలు సాధించిన క్రీడాకారులకు తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.

ఘనస్వాగతం

ఘనస్వాగతం

గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించి నగరానికి చేరుకున్న విజేతలకు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.

ఘనస్వాగతం

ఘనస్వాగతం

ఈ సందర్భంగా హైదరాబాద్ ఏస్ షట్లర్ పారుపల్లి కశ్యప్ మాట్లాడుతూ.. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.

ఘనస్వాగతం

ఘనస్వాగతం

గత టోర్నీలో కాంస్యం నెగ్గిన తాను ఈసారి అంతకంటే బాగా రాణిస్తానని ఊహించలేదని కశ్యప్ తెలిపాడు.

ఘనస్వాగతం

ఘనస్వాగతం

అయితే ఖచ్చితంగా పతకం సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్లానని కశ్యప్ చెప్పాడు.

ఘనస్వాగతం

ఘనస్వాగతం

బంగారు పతకం సాధించడం మాత్రం ప్రత్యేక అనుభూతినిచ్చిందని పారుపల్లి కశ్యప్ పేర్కొన్నాడు.

ఘనస్వాగతం

ఘనస్వాగతం

కశ్యప్ తోపాటు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన పివి సింధు, గురుసాయిదత్, కోచ్ గోపీచంద్‌తో కలిసి నగరానికి చేరుకున్నారు.

Image source: www.facebook.com/OdelaMallanna

ఘనస్వాగతం

ఘనస్వాగతం

తన శిశ్యులు సాధించిన విజయాల పట్ల గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు. కశ్యప్ గెలుపు భారతదేశంలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు.

ఘనస్వాగతం

ఘనస్వాగతం

స్వర్ణం సాధించలేకపోయినప్పటికీ తమ తొలి కామన్వెల్త్ గేమ్స్‌లోనే కాంస్యం గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని పివి సింధు, గురుసాయి దత్ తెలిపారు.

English summary
bronze-medal winner at the Delhi edition of the Commonwealth Games, shuttler Parupalli Kashyap was a man on a mission to live his boyhood dream of winning gold at the Games. And boy he did that in style in Glasgow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X