వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైలెట్స్: టెస్టుల్లో ధోనీ ప్రస్థానం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టీమిండియా సారథిగా వన్డేలోనూ, టెస్టుల్లోనూ మహేంద్ర సింగ్ ధోనీ అనేక విజయాలను నమోదు చేశాడు. విదేశాల్లో పేలవమైన రికార్డును కలిగివున్నప్పటికీ అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌గా ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. కెప్టెన్‌గా ఉండి రిటైరైన రెండో క్రికెటర్‌గా ధోనీ రికార్డులకెక్కాడు.

ఇప్పటివరకూ మొత్తం 90 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఆడటమే కాకుండా 60 మ్యాచ్‌లలో భారత జట్టుకు సారథ్యం వహించాడు. ఈ 60 మ్యాచులలో 27 విజయాలు కాగా, 18 అపజయాలు నమోదయ్యాయి. 15 మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఆడిన 90 టెస్ట్ మ్యాచుల్లో 4,876 పరుగులు చేసిన ధోనీ, 6 సెంచరీలు, 33 అర్థ సెంచరీలో నమోదు చేశాడు. ధోనీ తొమ్మిదేళ్ల టెస్టు ప్రస్థానంలో కొన్ని కీలక ఘట్టాలు.

2005 డిసెంబర్ 2: అరంగేట్రం

చెన్నైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ధోనీ అరంగేట్రం చేశాడు. తుఫాను కారణంగా ఆ మ్యాచ్ కేవలం 146.2 ఓవర్ల పాటు మాత్రమే సాగింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఆడిన ఒకే ఒక్క ఇన్నింగ్స్‌లో ధోనీ 54 బంతులను ఎదుర్కొని 30 పరుగలు సాధించడంతో పాటు వికెట్ల వెనుక ఒక క్యాచ్ కూడా అందుకున్నాడు.

2006 జనవరి 23:

పాకిస్థాన్ సాధించిన 588 పరుగుల భారీ స్కోరుకు జవాబుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 281 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఫాలోఆన్ దిశగా పయనిస్తున్న సమయంలో ధోనీ 153 బంతుల్లో 148 పరుగులు సాధించి ఆదుకున్నాడు. దీంతో ఆ ఇన్నింగ్స్‌లో భారత జట్టు 603 పరుగులు సాధించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

టీమిండియా సారథిగా వన్డేలోనూ, టెస్టుల్లోనూ మహేంద్ర సింగ్ ధోనీ అనేక విజయాలను నమోదు చేశాడు.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

విదేశాల్లో పేలవమైన రికార్డును కలిగివున్నప్పటికీ అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌గా ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

కెప్టెన్‌గా ఉండి రిటైరైన రెండో క్రికెటర్‌గా ధోనీ రికార్డులకెక్కాడు.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

ఇప్పటివరకూ మొత్తం 90 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఆడటమే కాకుండా 60 మ్యాచ్‌లలో భారత జట్టుకు సారథ్యం వహించాడు.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

ఈ 60 మ్యాచులలో 27 విజయాలు కాగా, 18 అపజయాలు నమోదయ్యాయి. 15 మ్యాచులు డ్రాగా ముగిశాయి.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

ఆడిన 90 టెస్ట్ మ్యాచుల్లో 4,876 పరుగులు చేసిన ధోనీ, 6 సెంచరీలు, 33 అర్థ సెంచరీలో నమోదు చేశాడు.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

ఆస్ట్రేలియాతో మెల్బోర్న్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగియంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 2-0తో కైవసం చేసుకుంది. కాగా, మూడో టెస్టు అనంతరం ధోనీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

2008 ఏప్రిల్ 11:

కాన్పూర్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టెస్టులో అనిల్ కుంబ్లే అందుబాటులో లేకపోవడంతో తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టిన ధోనీ ఆ మ్యాచ్‌లో భారత్‌కు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే విజయాన్ని అందించాడు.

అక్టోబర్ 21:

మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు నుంచి కుంబ్లే గాయం కారణంగా వైదొలగడంతో భారత జట్టుకు ధోనీ రెండోసారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో ధోనీ వరుసగా 92, 68 (నాటౌట్) పరుగులు సాధించడంతో భారత జట్టు 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ధోనీ తొలిసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు.

నవంబర్ 6: పూర్తి స్థాయి కెప్టెన్‌గా..

అనిల్ కుంబ్లే రిటైర్ అవడంతో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ధోనీ నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 172 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. దీంతో ఆ సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో గెలుచుకుంది.

2009 డిసెంబర్ 6:

శ్రీలంకతో జరిగిన సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకున్న భారత జట్టు ఐసిసి ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకుంది. ఆ మ్యాచ్‌లో ధోనీ 154 బంతుల్లో 100 పరుగులు సాధించడంతో భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 726 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

2011 ఆగస్టు 22:

ఇంగ్లాండ్‌లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 0-4 తేడాతో చేజార్చుకున్న భారత జట్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది.

2011, నవంబర్ 15:

ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ అజేయంగా 144 పరుగులు రాబట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 631 పరుగులు సాధించిన భారత జట్టు ఆ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 15 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది.

2012 డిసెంబర్ 17:

ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో చేజార్చుకోవడంతో ధోనీ నేతృత్వంలోని భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. స్వదేశంలో భారత జట్టు టెస్టు సిరీస్‌ను కోల్పోవడం 28 ఏళ్ల తర్వాత అదే తొలిసారి.

2013 ఫిబ్రవరి 24:

చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ తొలిసారి డబుల్ సెంచరీ సాధించడంతో పాటు భారత జట్టును అద్భుతంగా ముందుకు నడిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులు రాబట్టి ప్రపంచంలో మరే ఇతర వికెట్‌కీపర్/కెప్టెన్‌కు సాధ్యం కానంత భారీ వ్యక్తిగత స్కోరు సాధించిన ధోనీ టెస్టు కెరీర్‌లో రెండవసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కైవసం చేసుకున్నాడు.

మార్చి 5:

ధోనీ సారథ్యంలోని భారత జట్టు హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత జట్టుకు అంతకుముందు 21 విజయాలను అందించిన ‘బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీని అధిగమించి ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోనీ అవతరించాడు.

2013 డిసెంబర్ 30:

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో చేజార్చుకున్న ధోనీ సేన విదేశాల్లో వరుసగా మూడో సిరీస్‌లోనూ చేతులెత్తేసింది.

2014, జులై 21:

‘క్రికెట్ మక్కా'గా పేరొందిన లార్డ్స్ మైదానంలో భారత జట్టు 28 ఏళ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌గా ధోనీ కెరీర్‌లో ఇదే అత్యంత ప్రతిష్టాత్మమైన విజయం.

ఆగస్టు 17: ఇంగ్లాండ్‌తో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కేవలం మూడు రోజులకే ‘చాప చుట్టేసి' ఆ సిరీస్‌ను 3-1 తేడాతో కోల్పోయింది. విదేశీ గడ్డపై ధోనీ సేనకు ఇది వరుసగా ఐదో పరాజయం.

డిసెంబర్ 30:

ఆస్ట్రేలియాతో మెల్బోర్న్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగియంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 2-0తో కైవసం చేసుకుంది. విదేశాల్లో జరిగిన టెస్టు సిరీస్‌లలో ధోనీ సేనకు ఇది వరుసగా ఆరో పరాజయం. కాగా, మూడో టెస్టు అనంతరం ధోనీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

English summary
Soon after the conclusion of the Boxing Day Test between Australia and India in Melbourne, Mahendra Singh Dhoni announced his retirement from the five-day format with immediate effect, citing he was strained playing all formats of cricket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X