ఎవరిదీ హైద్రాబాద్?: పల్లెబాటన సిటీ (పిక్చర్స్)

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదు ఎవరికి చెందుతుందనే వివాదం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పర్వదినం ఆ విషయాన్ని తేల్చేసినట్లే ఉంది. ఎవరి పుట్టిన ఊళ్లు వారికి ఉన్నాయి, పండుగలు వచ్చాయంటే హైదరాబాదును వదిలేసి వారు తమ సొంతూళ్లకు బారులు తీరుతారని సంక్రాంతి పర్వదినం తేల్చేసింది. స్థానికులు, సొంత ఊళ్లో ఆస్తులు లేనివాళ్లు, పనులు ఉన్నవాళ్లు, ఇంకా కొంత మంది మాత్రమే ముఖ్యమైన పర్వదినాల్లో హైదరాబాదులో ఉండిపోతారనేది స్పష్టం తేల్చేస్తోంది ప్రస్తుత పరిస్థితి.

సంక్రాతి పండుగకు విద్యా సంస్థలు శుక్రవారం నుంచే సెలవులు ప్రకటించాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు కూడా సిబ్బందికి సంక్రాతి పండుగ సెలవులు ఇస్తుండటంతో నగర వాసులు సెలవులను సొంత గ్రామాల్లో తమ కుంటుంబ సభ్యులు బంధువులు చిన్ననాటిస్నేహితుల మధ్య గడిపేందుకు సంక్రాంతి పండుగనే వేదికగా ఎంచుకుంటుంటారు.

హైదరాబాదులోని మహాత్మాగాంధి సెంట్రల్‌ బస్టేషన్‌, సికింద్రాబాద్‌ జూబ్లి బష్టేసన్‌ ప్రయాణీకులతో కిటికిట లాడుతున్నాయి. శక్రవారం రాత్రి ఈ రెండు బస్టాండ్లలో కనీసం నిలుచునేందుకు కూడా చొటు లేనంతగా ప్రయాణీకులతో నిండిపోయాయి. ఆర్టీసి సాధారణ రోజుల్లో నగరం నుంచి రాష్ట్రంలోని వివిధ జల్లాలకు లాంగ్‌రూట్‌ సర్వీసుల కింద 25వందల బస్సులు నడుపుతుంది. అయితే సంక్రాంతి పండుగకు ఆర్టీసి ఈ సారీ 38వందల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అవి కాకుండా, ప్రైవేటు ఆపరేటర్లు నగరం నుంచి వివిధ ప్రాంతాలకు 1950 బస్సులు నడుపుతోంది.

మొత్తం మీద హైదరాబాద్‌ నగరం పరిధినుంచి గత రెండు రోజులుగా 82వందల బస్‌సర్వీసులు ప్రయాణీకులను వివిధ జిల్లాలకు చేరవేస్తున్నాయి. సొంత వాహానాల్లో గ్రామాలకు తరలిపోతున్న వారి సంఖ్యకూడా వేలల్లోనే ఉంటోంది. ఈ ఏడాది సంక్రాంతి సెలవులకు నగరం నుంచి సోంత గ్రామాలకు తరిలివెల్లేవారి సంఖ్య అరకోటికిపైగానే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిట

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిట

సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు తరలి వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ కిటకిటలాడుతోంది. రిజర్వేషన్లు దొరక్కపోవడంతో జనరల్ బోగీల్లో వెళ్లడానికి ప్రయత్నించారు.

తిరునాళ్ల మాదిరిగా..

తిరునాళ్ల మాదిరిగా..

సాధారణ రోజుల్లోనే రైళ్ళరాకపోకలతో సందడిగా ఉండే నగర రైల్వేస్షేషన్లు సంక్రాంతి పండుగ సందర్బంతో మరింత కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్‌ , కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు శుక్రవారం ప్రయాణీకుల కోలాహలంతో తిరునాళ్ళను తలపించాయి.

పల్లెకు పోదాం, చలో చలో

పల్లెకు పోదాం, చలో చలో

హైదరాబాదు నగరం నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. దొరికిన రైళ్లను పట్టుకోవడానికి వారు ప్రయత్నించారు.

తెలంగాణవాళ్లు కూడా..

తెలంగాణవాళ్లు కూడా..

తెలంగాణ గ్రామాలకు చెందిన వారు కూడా తమ సొంతూళ్లకు వెళ్లడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న జూబ్లీ బస్సు స్టేషన్ ఇలా.

రద్దీ చెప్పనలవి కాకుండా...

రద్దీ చెప్పనలవి కాకుండా...

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే ప్రధానంగా ప్రయాణం మొదలవుతుంది. శుక్రవారంనాడు సికింద్రాబాద్ రైల్వే స్షేషన్‌ ప్రయాణికులతో క్రిక్కిరిసిపోయింది.

ఎలా వెళ్లడమా..

ఎలా వెళ్లడమా..

రైళ్లన్నీ క్రిక్కిరిసిపోతుండడంతో, రిజర్వేషన్లు కష్టం కావడంతో ప్రయాణికులు సికింద్రాబాదు రైల్వే స్టేషన్‌లో ఇలా కనిపించారు.

లక్షల సంఖ్యలో..

లక్షల సంఖ్యలో..

సంక్రాంతి పండుగ సందర్బంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్ళతోపాటు వేల సంఖ్యలో అదనపు బోగిలు ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రయాణీకులకు ఏమాత్రం సరిపోవటంలేదు.

ఏవీ సరిపోవడం లేదు..

ఏవీ సరిపోవడం లేదు..

అటు బస్సులు ఇటు రైళ్ళ ద్వారా శుక్రవారం ఒక్కరోజులోనే పదిలక్షల మంది నగరం నుంచి తరలిపోయినట్టు అంచనావేస్తున్నారు.

పండుగ చేద్దాం

పండుగ చేద్దాం

పండుగకు ముందు శని, ఆదివారాలు రావడం, సోమవారం ఒక్క రోజు సెలవు పెడితే పండుగ వచ్చేస్తుండడం వల్ల శుక్రవారం సాయంత్రం నుంచే ఊళ్లకు తరలివెళ్లేందుకు సిద్ధపడ్డారు.

ప్రత్యేక రైళ్లు వేసినా..

ప్రత్యేక రైళ్లు వేసినా..

హైదరాబాదు నుంచి సొంత ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రయాణికుల కోసం దాదాపు 150 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సమాచారం.

లక్షలాది మంది ఇలా...

లక్షలాది మంది ఇలా...

హైదరాబాద్‌ నగర జనాభా రెండు కోట్లతు పైగా ఉందని అంచనా అందులో రాయలసీమ కోస్తాంధ్రతో పాటుగా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్న వారిసంఖ్య 80లక్షలదాక ఉంటోందని అధికారవర్గాల అంచనా.

పెద్ద పండుగ ఇదే..

పెద్ద పండుగ ఇదే..

జనవరి మాసంలో వచ్చే తొలిపండగ కావటం అందులోను పండగల్లో ఇదే పెద్ద పండగ కావటంతో హైదరాబాద్ పల్లెబాట పట్టినట్లు కనిపిస్తోంది.

వాహనం ఏదైనా సరే..

వాహనం ఏదైనా సరే..

వాహనం ఏదైనా సరే, సొంత ఊళ్లకు వెళ్లాల్సిందేనంటూ ఇలా ట్రక్కులోకి ఎక్కుతున్న ప్రయాణికులు. ఎల్బీ నగర్ వద్ద దృశ్యం ఇది.

బస్సులోకి వెళ్తే చాలు..

బస్సులోకి వెళ్తే చాలు..

బస్సులో అడుగుపెడితే చాలు అన్నట్లుగా ప్రయాణికులు అనుకుంటున్నారు. దిల్‌షుక్ నగర్ బస్టాండ్ వద్ద దృశ్యం ఇది.

పిల్లాజెల్లాతో పాటు..

పిల్లాజెల్లాతో పాటు..

పిల్లాపాపలతో పాటు పండుగ పూట సొంత గ్రామాల్లో ఉండాల్సిందే. ఊరికి వెళ్లడానికి తమ పిల్లలతో ఎల్బీ నగర్ బస్టాండు వద్ద నిరీక్షిస్తున్న ఓ మహిళ.

వెళ్లాల్సిందే అన్నట్లుగా..

వెళ్లాల్సిందే అన్నట్లుగా..

సొంత స్థలాలకు వెళ్లడానికి ఉరకులు వేస్తున్న ప్రయాణికులతో హైరాబాద్‌లో రైల్వేస్టేషన్లు, ఆర్టీసి బస్టాండ్లు కిటకిట లాడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+