మహిళా పోలీసులకు మార్షల్స్ ఆర్ట్స్ లో సినీ నటి ఇషా శిక్షణ, సవాళ్ళను అధిగమించేందుకే ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలో పనిచేసే మహిళ పోలీసు అధికారులకు తమ విధి నిర్వహనలో ఎదురయ్యే ఛాలెంజ్ ను ఎదుర్కొనేందుకుగాను కొత్త రకం శిక్షణ ఇస్తున్నారు. సినీ నటి ఇషా నేతృత్వంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున ఈ శిక్షణకు రాచకొండ పోలీసులు ఈ శిక్షణకు శ్రీకారం చుట్టారు.

రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సుమారు 175 మంది మహిళా పోలీసు అధికారులు పనిచేస్తున్నారు.అయితే విధి నిర్వహణలో వారు ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను అధిగమించేందుకుగాను సినీ నటి ఇషా కొప్పికార్ ఆధ్వర్యంలో మార్షల్స్ ఆర్ష్ లో శిక్షణ పొందుతున్నారు.

రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.సినీ నటి ఇషా కొప్పికార్ కొరియన్ మార్షల్స్ ఆర్ట్స్ లో ప్రసిద్ది చెందిన హప్కిడో లో ప్రఖ్యాతి చెందింది.ఈమెకు మహ్మద్ షేక్ శిక్షణ ఇచ్చాడు.

Hyderabad: Women cops undergo training in 'Hapkido'

మహిళ పోలీసులు తమ విధి నిర్వహణలో రోజువారీగా ఎదురయ్యే సమస్యలను మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ద్వారా అధిగమించే అవకాశం ఉందని సినీ నటి ఇషా అభిప్రాయపడ్డారు.

సినీ నటి ఇషా తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాధించింది.అంతేకాదు ఆమె హప్కిడో మార్షల్ ఆర్ట్స్ లో సుమారు అత్యంత ప్రతిభావంతురాలు.

రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని హోమ్ గార్డు స్థాయి నుండి ఐపిఎస్ స్థాయి అధికారి వరకు ఉన్న మహిళా పోలీసు అధికారులకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు.ఈ శిక్షణ మహిళలకు ఉపయోగంగా ఉంటుందని సినీ నటి ఇషా చెప్పారు.ప్రత్యేకిండి డెకాయిటీ ఆపరేషన్లలో మహిళా పోలీసులకు ఈ రకమైన శిక్షణ ఉపయోగపడుతోందని ఆమె చెప్పారు.

పోలీసులకు ఆత్మరక్షణ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురైన సమయంలో సమర్థవంతంగా పనిచేసేందుకుగాను ఈ శిక్షణ ఉపయోగపడుతోందని రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ చెప్పారు. ఆయుధాలు కలిగి ఉన్న అధికారులే కాదు ఆయుధాలు లేని సమయాల్లో కూడ మహిళా పోలీసు అధికారులు ఏ రకంగా తమను తాము రక్షించుకొనే విధంగా ఈ శిక్షణ దోహదపడుతోందని ఆయన చెప్పారు.

హప్కిడో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పోలీసు అధికారులకు శిక్షణ ఉపయోగపడే అవకాశం ఉందని భగవత్ అభిప్రాయపడ్డారు.అయితే ఈవ్ టీజర్లను అరెస్టు చేసేందుకుగాను ప్రత్యేకంగా మహిళా పోలీసులతో ప్రత్యేకమైన టీమ్ లు ఏర్పాటు చేశారు.అయితే ఈ టీమ్ ల్లో పనిచేసే పోలీసు అధికారులకు ఈ శిక్షణ ఇవ్వడం ప్రయోజనంగా ఉంటుందన్నారాయన. ఎనిమిది మాసాల కాలంలో సుమారు వెయ్యి మంది ఈవ్ టీజర్లను రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As many as 175 women police personnel working under Rachakonda Police Commissionerate here were imparted training in Hapkido--a Korean martial art—as part of the International Women's Day.
Please Wait while comments are loading...