• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాక్‌కు భారత ఆర్మీ అద్భుతమైన కౌంటర్ (వీడియో)

|

న్యూఢిల్లీ: యూరీ ఉగ్రదాడిని తీవ్రంగా తీసుకున్న భారత ఆర్మీ.. పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పేలా సరిహద్దులు దాటి ప్రతిదాడులు జరిపేందుకు అనుమతించాలని కోరుతోంది. ఈ దిశగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఓ వర్గం సైనికుల నుంచి ఒత్తిడి వస్తోంది.

పరిమితమైన సీమాంతర దాడికి తమకు అనుమతించాలని కొందరు డిమాండ్ చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా 778 కి,మీ. పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి నిత్యం ఎక్కడో ఒకచోట పాకిస్తాన్ కాల్పులకు దిగుతుంటూనే ఉంటోంది. సీమాంతర దాడికి ప్రభుత్వం అనుమతిస్తే అది పూర్తి స్థాయి యుద్ధంగా మారే ఆవకాశముందని కేంద్రం భావిస్తోంది.

కేంద్రం ఇప్పటికిప్పుడు అనుమతులు ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. పఠాన్ కోట్, యూరీ ఆర్మీ పోస్టులపై ఉగ్రదాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా, భారత ఆర్మీ.. పాక్‌కు కౌంటర్ ఇచ్చిన వీడియో నెట్లో హల్‌చల్ చేస్తోంది. అవకాశమిస్తే పాక్‌ను తరిమి కొడతామన్నారు.

ఇదిలా ఉండగా, భారత్‌ను రెచ్చగొడుతున్న పాక్‌కు గట్టి బుద్ధి చెప్పాలని చాలామంది భావిస్తున్నారు. కానీ కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Indian Army man's awesome reply on Uri attack to Pakistan, Viral Video

సరిహద్దులు దాటి పొరుగుదేశంలోకి వెళ్లి, నిర్దిష్ట లక్ష్యాల పైన దాడులు చేయడానికి గల కారణాలను విశ్లేషిస్తే.. మనకు అలాంటి ప్రత్యేక దళాలు ఉన్నాయి. మన సైన్యానికి ప్రపంచంలోనే అత్యంత ప్రొఫెషనల్‌ సైన్యాల్లో ఒకటిగా పేరుంది. మనదేశం అత్యంత కఠినమైన పొరుగు దేశాలను కలిగి ఉంది.

భారతపై ఎన్ని దాడులు చేసినా సంయమనం పాటిస్తుందే తప్ప సైనిక చర్యకు దిగదు. ఈ భావనను తొలగించి కఠినంగా వ్యవహరిస్తామన్న సందేశం పంపించేందుకు యుద్ధం కన్నా తక్కువ స్థాయి అయిన సరిహద్దులు దాటి దాడి చేయడం ద్వారా గుణపాఠం చెప్పొచ్చని భావిస్తున్నారు.

దాడుల విషయంలో మరో ఆలోచన కూడా చేయాలనే దానికి కూడా కారణాలు ఉన్నాయని అంటున్నారు. భారతకు పాకిస్థాన్‌తోపాటు చైనా నుంచి కూడా భద్రతపరమైన ముప్పు ఉందని, రెండూ అణ్వాయుధ దేశాలేనని, ఇలాంటి సందర్భంలో లక్షిత దాడులు యుద్ధానికి దారి తీసి, ఈ ప్రాంతం మొత్తాన్నీ సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు.

అలాగే భారత్ ఆసియాలోనే అత్యంత బాధ్యతాయుతమైన అభివృద్ధి దేశంగా ఎదగాలనుకుంటోందని, పాక్‌కు అలాంటివేమీ లేవని చెబుతున్నారు. అదే సమయంలో పాక్‌ అక్రమాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చినట్టుగానే దౌత్యపరంగా పాక్‌ను ఎదుర్కోవడం ద్వారా ఆ దేశాన్ని పదేపదే ఇరుకున పెట్టవచ్చునని అంటున్నారు.

English summary
After Uri attack Indian army jawan sends a befitting reply to Pakistan terrorists. This video of him challenging Pakistan and talking about Kashmir issue has now gone viral. Watch it here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more