భారత్ అంటే మసరత్ ఆలంకు అసహ్యం!

కరుడు గట్టిన వేర్పాటువాది మసరత్ ఆలంకు (42) భారతదేశం అన్నా, భారత ప్రజలు అన్నా సహించడు. వారిని చూస్తే అతనికి శరీరం మీద జర్రులు పాకినట్లు ఉంటుంది. భారత్ వ్యతిరేకత అతనికి పుట్టుకతో వచ్చింది. అతని నరనరాన, రక్తంలోనా భారత వ్యతిరేకత ఉంది. 2008, 2009, 20010లో కాశ్మీర్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలు మళ్లీ పునరావృతంకాకుండ ఉండాలంటే ఆలంను అరెస్టు చెయ్యాలని పోలీసు అధికారులు అంటున్నారు.

పోలీసు అధికారులు ఈ విషయం స్పష్టంగా చెప్పడంతో ఆలం కిరాతకాలు, అతని వేర్పాటువాదం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆలం డిగ్రీ వరకు చదివాడు. తర్వాత హురియత్ నేత సయ్యద్ ఆలీషా గిలానికి వారుసుడిగా చేరాడు. 1989లో జరిగిన సాయుధ తిరుగుబాటు సందర్బంగా కాశ్మీర్ లోయలలో విధ్వంసాలు జరిపించాడు. పోలీసులపై దాడులు చేయించాడు. సైన్యం మీద తిరగబడ్డాడు.

ఆలం అరాచకాలు ఎక్కువ కావడంతో అరెస్టు చేసి 1996 వరకు జైలులో పెట్టారు. అప్పటి నుండి పోలీసులు ఆలంను అరెస్టు చెయ్యడం, తర్వాత అతను జామీను మీద బయటకు వచ్చి హింసాత్మక సంఘటనలకు పాల్పడం దినచర్యగా మారిపోయింది. కాశ్మీర్‌ను పాకిస్థాన్‌లో విలీనం కావాలనే ముస్లీం లీగ్ పార్టికి పూర్తి మద్దతు ఇచ్చిన ఆలం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు.

క్విట్ కాశ్మీర్ ఉద్యమం చేపట్టిన ఆలం!

J&k government Frees Hurriyat hardliner who organized 2010 protests

2008లో ఆలం అరసై జైలులో ఉన్నాడు. తర్వాత అతను విడుదల అయ్యే సమయానికి కాశ్మీర్ అల్లర్లతో అట్టుడుకిపోతున్నది. ఆ సందర్బలో ఆలం ఆందోళన కారులను రెచ్చగొట్టడానికి క్విట్ కాశ్మీర్ ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నాడు. భారత్ కో దే రగ్దా అనే భారత వ్యతిరేక నినాదాలు చేశాడు. అదే విధంగా గో ఇండియా గో అనే నినాదాలతో భారత వ్యతిరేక ఉద్యమాలు చేపట్టాడు.

కాశ్మీర్ వారంలో 7 రోజుల పాటు ఏ రోజు ఏ ఉద్యమం చెయ్యాలని అంటూ ప్రత్యేక క్యాలెండర్ తయారు చేయించి ఆందోళనకారులకు పంచి పెట్టాడు. సాయుధ బలగాల మీద రాళ్లతో దాడులు చేయించి, రోడ్ల మీద నిరసన కార్యక్రమాలు చేపట్టి వేర్పాటువాదులలో లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని అరాచకాలు ఎక్కువ కావడంతో పోలీసులు అతని కోసం గాలించారు. ఆలం లోయలలోకి వెళ్లిపోయి పోలీసులకు చిక్కకుండా జాగ్రతలు తీసుకున్నారు.

ఆలం ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షలు బహుమానం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చివరికి పోలీసులు అతి కష్టం మీద 2010 అక్టోబర్‌లో ఆలం తలదాచుకున్న ప్రాంతాన్ని గుర్తించి అరెస్టు చేశారు. ఆలం వయస్సు 42 సంవత్సరాలు. అతని అర్ద జీవితం జైలులోనే గడిచిపోయింది. 2010 భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించిన సమయంలో జరిగిన అల్లర్లలో 112 మంది అమాయకులు బలి అయిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+