హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అహ్మదాబాద్‌కి ధీటుగా తెలంగాణలో కైట్ ఫెస్ట్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అంతర్జాతీయస్థాయిలో తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తున్న పతంగుల పండుగను ఐదేళ్లలో అహ్మదాబాద్‌కు దీటుగా తీసుకెళ్తామని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం నాడు చెప్పారు.

సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలంగాణ అంతర్జాతీయ పతంగుల పండుగను పదేళ్లలో ప్రపంచంలోని ప్రముఖ పతంగుల పండుగల్లో ఒకటిగా చేస్తామని ఆయన చెప్పారు.

ఈ నెల 14, 15వ తేదీల్లో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని ఆగాఖాన్‌ అకాడమీలో పతంగుల పండుగ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 పతంగుల పండుగ

పతంగుల పండుగ

తద్వారా భాగ్యనగరం మరో అంతర్జాతీయ ఉత్సవాలకు వేదిక కానుందని ఆయన చెప్పారు. నగరంలో జనవరి 14 నుంచి అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. దేశంలోనే అంతర్జాతీయ పతంగుల ఉత్సవం నిర్వహించడం తొలిసారి అన్నారు.

పతంగుల పండుగ

పతంగుల పండుగ

ఆగాసాన్ అకాడమీలో ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. 6 దేశాలకు చెందిన ప్రతినిధులు ఉత్సవంలో పాల్గొంటారని చెప్పారు. మంగళవారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పతంగుల పండుగను ఐదేళ్లలో అహ్మదాబాద్‌కు దీటుగా తీసుకెళ్తామన్నారు.

పతంగుల పండుగ

పతంగుల పండుగ

ఈ పండుగలో ఇండోనేషియా, వియత్నాం, అమెరికా, థాయ్‌లాండ్‌, ఉక్రెయిన్‌ దేశాలకు చెందినవారు పాల్గొంటున్నారని తెలిపారు. రాత్రిపూట కూడా పతంగులను ఎగుర వేయనుండటం ఈసారి ప్రత్యేకత అని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ కళలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా 200 మంది కళాకారులతో ప్రదర్శనలుంటాయన్నారు.

పతంగుల పండుగ

పతంగుల పండుగ

పతంగుల పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందన్నారు. టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌ మాట్లాడుతూ.. పతంగుల పండుగ నేపథ్యంలో బాలికల విద్య, సాధికారత ఆవశ్యతకపై అవగాహన పెంచుతామని తెలిపారు.

English summary
Kite festival in Telangana on January 14 and 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X