హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్‌లో యూత్ గ్యాంగ్స్: దోపీడీలు, హత్యలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో దోపీడీలు, దొంగతనాలు, హత్యలు ఎక్కువయ్యాయి. ఈ దోపీడీలకు పాల్పడుతోంది యువకులే. విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడుతున్న యువత ఈజీమనీ కోసం దొంగతనాలను నేరవృత్తిగా ఎంచుకుంటోంది.

శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా... ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. గతంలో దొంగతనాలు రాత్రుళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు దొంగలు దర్జాగా పట్టపగలు, జనం చూస్తుండగానే దొచుకెళ్తున్నారు.

పగలుపూట ఇంట్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నారు. అడ్డు వచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు మాత్రం అంతా జరిగిపోయిన తర్వాత వచ్చి హంగామా చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పెట్రోలింగ్ కోసం రూ. 340 కోట్లతో కొత్త వాహనాలు ఇచ్చినా నేరాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తే మనకు ఆ విషయం అర్దం అవుతుంది.

Latest Robbery and murder news in Hyderabad

* గత నెల 28న మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిటిజన్ కో- ఆపరేటివ్ సోసైటీ లిమిటెడ్ బ్యాంక్‌లోకి ఓ ఆంగతకుడు పిస్టోల్‌తో సిబ్బందిని బెదిరించి తొమ్మిదిన్నర లక్షలు దొచుకెళ్లాడు. ఈ ఘటన రాత్రి 8.00 గంటల సమయంలో జరిగింది.

* ఈ నెల 2న రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్ పూర్‌లో గుర్తు తెలియని దుండగలు ఒక విల్లాలోకి చొరబడి భార్యభర్తలను కత్తులతో బెదిరించి నగలు, నగదు దోచుకెళ్లారు.

* ఈ నెల 5న పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగడిపేటలో ఒక ఇంట్లో దొంగ చొరబడి గృహిణి మెడలో మంగళసూత్రం తెంపుకెళ్లేందుకు ప్రయత్నించి స్దానికులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మధ్యాన్నం జరిగింది.

* అదే రోజు రాత్రి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి 12 తుళాల బంగారు నగలు, రూ. 50వేల నగదు దోచుకెళ్లారు.

* ఆదివారం రాజ్యలక్ష్మీ అనే మహిళ వనస్దలిపురం పరిధిలో షాపుకు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని దుండగలు తాము పోలీసులమంటూ చెప్పి మహిల దృష్టి మరల్చి మెడలో ఉన్న బంగారం అపహరించుకెళ్లారు.

* శివారం రాత్రి అర్దరాత్రి ఎల్‌బీ నగర్ జోన్, వనస్దలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు వేర్వేరు ఇళ్లలో దుండగలు చొరబడి 61 తులాల బంగారు నగలు, 20 వేల నగదు దోచుకెళ్లారు.

* మోటారు సైకిల్‌పై వెళుతున్న మహిళలను టార్గెట్ చేసుకోని దుండగలు చైన్‌స్నాచింగ్ పాల్పడ్డారు. సరూర్ నగర్ గ్రీన్ పార్క్ కాలనీకి చెందిన పి. జయ (26) బుధవారం తన వాహనంపై గ్రీన్ పార్క్ కాలనీ బస్టాఫ్ ప్రాంతం మీదుగా వెళుతోంది. మరో మోటారు సైకిల్‌పై వెనుక నుండి వచ్చిన దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గోలుసు తెంపుకెళ్లారు.

* శంషాబాద్ మండలం ఉట్టుపల్లికి చెందిన కుమ్మరి పుణ్యవతి (30) భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై సాగర్ రింగ్ రోడ్డులోని సబ్ - రిజిస్టార్ కార్యాలయం మందు నుంచి వెళ్తుండగా, వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఆమె మెడలోని తులాల బంగారు గోలుసును తెంచుకోని పారిపోయారు.

హత్యలు:

* పోలీసు శాఖలో ఎస్సైగా పనిచేస్తూ సస్పెండ్‌కు గురైన భాను ప్రకాశ్ మానసిక విచక్షణ కోల్పోయి భార్యను హతమార్చాడు. శుక్రవారం కూకట్ పల్లిలో భాను ప్రకాశ్ భార్యతో డబ్బుల విషయంలో గొడవపడి హత్య చేశాడు.

* పోలీసు విభాగంలో హోంగార్డుగా పనిచ చేస్తున్న ఓ మహిళ అతి దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోది హత్య చేశారు. ఈ ఘటన మేడ్చల్ మండలంలోని బాసురేగని శివారులోని అటవీ ప్రాంతంలో గురవారం అర్దరాత్రి జరిగింది.

* స్వలింగ సంపర్కానికి అలవాడు పడిన ఆసిఫ్ నగర్, కిషన్ నగర్‌లో నివసించే మహ్మాద్ సలాంసిద్దిఖీ (48) దారుణహత్యకు గురయ్యాడు. శనివారం తెల్లవారక ముందే ఈ హత్య జరగడం పశ్చిమ డివిజన్‌లో అలజడి రేపింది.

* రద్దీగా ఉండే చార్మినారా ప్రాంతంలో ఉదయం పూట హత్య జరగడం ఆందోళన కల్గించింది.

* ఎస్ఆర్ నగర్‌లో నివాసం ఉండే కూలీలు.. శుక్రవారం రాత్రి మద్యం సేవించారు. ఇదే సమయంలో మద్యం సేవించిన ముగ్గురి మధ్య గొడవ మొదలైంది. చెత్త బండ్లను తీసుకెళ్లే ఈ కూలీలు ఓకరినొకరు కొట్టుకోవడంతో వీరిలో ఒకరికి తీవ్రగాయాలయి అక్కడిక్ అక్కడే మృతి చెందాడు.

English summary
In recent days hyderabad city so many Robbery and murders happened. We are giving brief news about these thing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X