వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోస్ట్ వాంటెడ్ ఎన్‌కౌంటర్: ఎవరీ విక్కీ గౌండర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

చండీగఢ్: పంజాబ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ విక్కీ గౌండర్ ఎట్టకేలకు హతమయ్యాడు. శుక్రవారం రాత్రి రాజస్థాన్ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతను మరణించాడు. విక్కీ ప్రధాన అనుచరుడు, సభా జైలు దాడి సూత్రధారి ప్రేమ లహోరియా కూడా మరణించాడు.

చిన్న తనం నుంచే నేరప్రవృత్తిని కలిగిన విక్కీ గౌండర్ అతని తక్కువ కాలంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. విక్కీ గౌండర్ అలియాస్ జిందర్ అసలు పేరు హర్జిందర్ భుల్లార్. అతని స్వగ్రామం టర్ఫ్‌లంబిలోని సరవాన్ బొద్లా.

 తన చిన తనంలో ఇలా...

తన చిన తనంలో ఇలా...

విక్కీ గౌండర్ బాల్యంలో జేబు దొంగలకు సహాయకుడిగా వ్యవహరించేవాడు. ఆ తర్వాత బ్లేడు దొంగగా మారాడు. క్రమంగా గ్యాంగస్టర్ అవతారం ఎత్తాడు. సుపారీలు తీసుకుని స్థానిక నాయకులను హత్య చేసేవాడు. అక్రమ ఆయుధాలు సరఫరా చేయడం, ఉగ్రవాదులకు సాయం చేయడం వంటి కార్యకలాపాలకు పూనుకున్నాడు.

 అతనిపై మొత్తం 83 కేసులు

అతనిపై మొత్తం 83 కేసులు

విక్కీ గౌండర్ మీద మొత్తం 83 కేసులున్నాయి. అతనికి రాజకీయ నాయకులు అండదండలు ఉంటూ వచ్చాయని అంటారు. పలువురు పోలీసు అధికారులు కూడా అతనికి సహకరిస్తూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

 అతను ఫేస్‌బుక్‌లో యాక్టివ్...

అతను ఫేస్‌బుక్‌లో యాక్టివ్...

గౌండర్ ఫేస్‌బుక్‌లో చాలా చురుగ్గా ఉండేవాడు. పోలీసులు తనపై కేసులు నమోదు చేసిన ప్రతిసారీ వాికి చిక్కకుండా ఫేస్‌బుక్ ద్వారానే వాటిని ఖండిస్తూ ఉండేవాడు. అయితే, జైలుకు వెళ్లన తర్వాత కూడా అతని ఫేస్‌బుక్ అప్‌డేట్ అవుతూ వచ్చింది. దీంతో ఇద్దరు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు.

ఇతన్ని విడిపించేందుకే దాడి..

ఇతన్ని విడిపించేందుకే దాడి..

సభా జైలు నుంచి ఉగ్రవాదులను విడిపించేందుకు దాడి జరిగిందని భావిస్తూ వచ్చారు. కానీ విక్కీ గౌండర్‌ను విడిపించేందుకే ఆ దాడి జరిగినట్లు తెలిసి వచ్చింది. దాడి గురించి ముందుగా తెలుసుకున్న ఉగ్రవాదులు విక్కీతో డీల్ కుదుర్చుకున్నారు. దీంతో వారిని కూడా అతను తప్పించాడు. దాడి ప్రధాన సూత్రధారి పర్విందర్ సింగ్ పిందా ఈ విషయాన్ని విచారణలో వెల్లడించాడు.

 సభా జైలు దాడి ఇదీ...

సభా జైలు దాడి ఇదీ...

పాటియాలాలోని సబా జైలుపై 2016 నవంబర్ చివరి వారంలో దాడి జరిగింది. పది మంది సాయుధులు పోలీసు దుస్తుల్లో వచ్చి వచ్చి దాడి చేసి ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్, ఉగ్రవాది కశ్మీరా సింగ్‌లతో పాటు మరో నలుగరు గ్యాంగస్టర్లను విడిపించుకుని పారిపోయారు.ఆ నలుగురు గ్యాంగస్టర్లు విక్కీ గౌండర్, గుర్‌ప్రీత్ సింగ్, నితన్ డియోల్, విక్రమ్‌జిత్ సింగ్.

మింటూ ఇలా తిరిగి....

మింటూ ఇలా తిరిగి....

పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా థాయ్‌లాండ్‌లో శిక్షణ పొందిన హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూ పంజాబ్‌ల వేర్పాటువాదాన్ని రగిలించేందుకు ప్రయత్నించాు. అతన్ని పోలీసులు 2014 నవంబర్‌లో ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసారు. సభా జైలుపై దాడి ఘటనలో అతను కూడా తప్పించుకున్నాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. పది రోజుల్లో పట్టుకున్నారు. జైలు నుంచి తప్పించుకున్న నలుగురు గ్యాంగస్టర్లలో ఇద్దరిని నిరుడు అదుపులోకి తీసుకున్నారు. విక్కీతో పాటు మరొకతను పరారీలో ఉన్నాడు. ఉగ్రవాది కశ్మీరా సింగ్ ఆచూకీ లభించలేదు. చివరకు విక్కీ గౌండర్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

English summary
Punjab's most wanted gangster Vicky Gounder was on Friday killed in a fierce encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X