Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రావూరి: ఏడో తరగతే చదివి, ఎత్తుకెదిగి(పిక్చర్స్)

ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ ఏడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ ఆయన ఎన్నో డాక్టరేట్లు తన పరం చేసుకున్నారు. జ్ఞానపీఠ్ అవార్డు కూడా వచ్చింది. రావూరి కృష్ణా జిల్లా మొగులూరు గ్రామంలో 1927లో జన్మించారు.

పెద్ద చదువులు చదవని రావూరి మాత్రం సాహితీరంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. అతని రచనలు అతనికి ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి. ఆంధ్రా, నాగార్జున, జెఎన్‌టియు తదితర విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి. పదిహేడవ ఏట నుండే ఆయన రచనలు చేయడం ప్రారంభించారు.

1968, 1983లలో రెండుసార్లు ఆయన రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డును, కేంద్రీయ సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. 1968లో గోపీచంద్ సాహితీ అవార్డును, 1987లో రాజ్యలక్ష్మి అవార్డును అందుకున్నారు. సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, భారతీయ భాషాపరిషత్ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారంతో పాటు మిక్కిలి అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.

రావూరి 1

రావూరి 1

ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరాలు.

రావూరి 2

రావూరి 2

కొంతకాలంగా ఆయన మధుమేహం, హైపర్‌టెన్షన్, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గత సోమవారం ఆయనను హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చేర్చారు.

రావూరి 3

రావూరి 3

అప్పటి నుంచి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గుండె, కిడ్నీ, కాలేయం పనితీరు మందగించాయి. శుక్రవారం రాత్రి 8.35 గంటలకు రావూరి భరద్వాజ తుదిశ్వాస విడిచారు.

రావూరి 4

రావూరి 4

మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. మరణించడానికి వారం రోజుల ముందే ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు.

రావూరి 5

రావూరి 5

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ కవి సి. నారాయణరెడ్డిల కోవలో రాష్ట్రానికి మూడోసారి జ్ఞానపీఠ అందించిన ఖ్యాతిని చిరస్థాయిగా నిలుపుకున్నారు.

రావూరి 6

రావూరి 6

" ఆకలి నా రచనలకు ప్రేరణ'' అని ప్రకటించుకున్న రావూరి భరద్వాజ 1925లో కృష్ణాజిల్లా పరిటాల జగీర్ మోగులూరు గ్రామంలో జన్మించారు. తల్లి మల్లికాంబ, తండ్రి కోటయ్యలపై ఆయన తన తొలి పద్యం చెప్పారు.

రావూరి 7

రావూరి 7

చురుకైన విద్యార్థిగా పేరు పొందినా, ఆర్థిక పరిస్థితుల వల్ల ఏడో తరగతితోనే చదువు ఆగిపోయింది. ఆకలి బాధను మరిచిపోవడానికి అక్షరానికి దగ్గరయ్యారు.

రావూరి 8

రావూరి 8

రావూరి రచించిన విమల అనే కథ 1946లో ప్రచురితమైంది. ఆయన రచనల్లో జీవనసమరం, కాదంబరి పేరెన్నిక గన్నవి. అనంతరం 172 రచనలు చేసిన భరద్వాజ కవితలు, పద్యాలు, కథల్లో తనదైన శైలిని కనబర్చారు.

రావూరి 9

రావూరి 9

చలం ప్రభావంతో తొలి రచనలు చేసిన ఆయన 1950లో 'రాగిణి' వెలువరించారు. 'కొత్త చిగుళ్లు'లోని విభిన్న శైలి తెలుగు సాహిత్యం దృష్టిని ఆకర్షించింది.

రావూరి 10

రావూరి 10

రావూరి భరద్వాజ కృష్ణాజిల్లా మొగులూరు గ్రామంలో 1927లో జన్మించారు. ఆయన ఏడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 17వ ఏటి నుంచే రచనలు చేయడం ప్రారంభించారు.

రావూరి 11

రావూరి 11

ఒకవైపు పండో, నీళ్లో తాగి ఆకలి తీర్చుకుంటూ, మరోవైపు దొరికిన పుస్తకమల్లా చదువుతూ సాహిత్య దాహం తీర్చుకునేవారు. గ్రంథాలయం సంవత్సర చందా మూడు రూపాయలు కాగా, దాన్నీ కట్టలేకపోయేవారు.

రావూరి 12

రావూరి 12

పగలంతా దొరికిన పని చేస్తూ, రాత్రయితే దేవాలయంలోని దీపం వెలుతురులో లైబ్రరీ పుస్తకాలను మధించేవారు. ప్రపంచ సాహిత్యాన్నంతా పఠనం చేస్తూ ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపారు.

రావూరి 13

రావూరి 13

ఆలపాటి రవీంద్రనాథ్ పని కల్పించడంతో 1946లో మకాం తెనాలికి మార్చారు. తెనాలి జీవితం ఆయన సారస్వత వ్యక్తిత్యాన్నే మార్చి వేసింది.

రావూరి 14

రావూరి 14

లం ప్రభావంతో తొలి రచనలు చేసిన ఆయన.. 1950లో 'రాగిణి' వెలువరించారు. 'కొత్త చిగుళ్లు'లోని విభిన్న శైలి తెలుగు సాహిత్యం దృష్టిని ఆకర్షించింది.

రావూరి 15

రావూరి 15

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ కవి సి. నారాయణరెడ్డిల కోవలో రాష్ట్రానికి మూడోసారి జ్ఞానపీఠ అందించిన ఖ్యాతిని చిరస్థాయిగా నిలుపుకున్నారు.

రావూరి 16

రావూరి 16

సాహితీవేత్త రావూరి భరద్వాజ ఏడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ ఆయన ఎన్నో డాక్టరేట్లు తన పరం చేసుకున్నారు.

రావూరి 17

రావూరి 17

1968, 1983లలో రెండుసార్లు ఆయన రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డును, కేంద్రీయ సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.

రావూరి 18

రావూరి 18

ఆంధ్రా, నాగార్జున, జెఎన్‌టియు తదితర విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి. పదిహేడవ ఏట నుండే ఆయన రచనలు చేయడం ప్రారంభించారు.

రావూరి 19

రావూరి 19

భరద్వాజ రెండుసార్లు రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డును, కేంద్రీయ సాహిత్య అకాడెమీ అవార్డును, గోపీచంద్ అ వార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, భారతీయ భాషాపరిషత్ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారంతో పాటు మిక్కిలి అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.

రావూరి 20

రావూరి 20

సాహితీవేత్త రావూరి భరద్వాజకు జెఎన్‌టిలు 1980లో, నాగార్జున విశ్వవిద్యాలయం 1977లో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి.

రావూరి 21

రావూరి 21

రావూరికి 1948లో కాంతం గారితో ఆయన వివాహం జరిగింది. "సంపన్నురాలైనా నా లేమిని, విద్యాహీనతను, నిరుద్యోగాన్ని చాలా దయగా భరించింది. అమాయకుడైన బిడ్డను తెలివైన తల్లి ఎలా చూ స్తుందో ఆ బంగారు తల్లి నన్నలా చూసుకుంది. అందుకే 'కాంతమ్మ' అనేవాణ్ని'' అని రావూరి భావోగ్వేగంతో చెప్పేవారు.

రావూరి 22

రావూరి 22

సాహితీవేత్త రావూరి భరద్వాజకు నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. 2012 సంవత్సరానికి గాను ఆయన జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు.

రావూరి 22

రావూరి 22

రావూరికి 1948లో కాంతం గారితో ఆయన వివాహం జరిగింది. "సంపన్నురాలైనా నా లేమిని, విద్యాహీనతను, నిరుద్యోగాన్ని చాలా దయగా భరించింది. అమాయకుడైన బిడ్డను తెలివైన తల్లి ఎలా చూ స్తుందో ఆ బంగారు తల్లి నన్నలా చూసుకుంది. అందుకే 'కాంతమ్మ' అనేవాణ్ని'' అని రావూరి భావోగ్వేగంతో చెప్పేవారు.

రావూరి 23

రావూరి 23

సాహితీవేత్త రావూరి భరద్వాజకు జెఎన్‌టిలు 1980లో, నాగార్జున విశ్వవిద్యాలయం 1977లో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి.

రావూరి 24

రావూరి 24

మరణించడానికి వారం రోజుల ముందే ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు. వీల్ ఛేర్‌లో ఒక చేతిలో సెలైన్ బాటిల్ పట్టుకొని భరద్వాజ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం పూర్తిగా చెరిగిపోకముందే.. ఆయన సాహితీ లోకాన్ని వదిలిపెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+