సిరియా 'ఆకలి'కి సజీవ సాక్ష్యం: ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్న ఫోటో..

Subscribe to Oneindia Telugu

సిరియా: దాదాపు ఏడేళ్లుగా కొనసాగుతున్న సివిల్ వార్ సిరియా ప్రజల జీవితాలను అత్యంత దుర్భరం చేసింది. ఓవైపు తిరుగుబాటుదారుల ఆందోళనలు.. మరోవైపు సైన్యం ఆకృత్యాలు.. వీటి మధ్యలో ఐసిస్.. ఈ ఏడేళ్లలో సిరియా ప్రజలు మనశ్శాంతిగా నిద్రపోయిన రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో!

ఐరాస లెక్కల ప్రకారం.. సిరియాలో ఇప్పటికే దాదాపు 5లక్షల ఆకలి చావులు నమోదయ్యాయి. మరో 30వేల మంది దాకా అంతర్యుద్దం కారణంగా మరణించారు. దాదాపు 34ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు నిర్బంధ జీవితాన్ని అనుభవిస్తున్నారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లు.. ఆందోళనకారులను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయోగిస్తున్న హింస కారణంగా అక్కడ జనజీవనం అల్లకల్లోలంగా మారింది.

సిరియా ఆకలికి సజీవ సాక్ష్యం:

సిరియా ఆకలికి సజీవ సాక్ష్యం:

ఆఖరికి తినడానికి బుక్కెడు తిండి కూడా లేని పరిస్థితుల్లో ఎంతోమంది ప్రజలు అల్లాడుతున్నారు. వారి ఆకలి వేదనకు సజీవ సాక్ష్యంగా ఒక్క ఫోటో ఇప్పుడు ప్రపంచాన్ని కదలిస్తోంది. కనీసం ఏడవడానికి కూడా సహకరించని తన శరీరంతో ఆ చిన్నారి పడుతున్న నరకయాతన ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది.

ఎముకలు తేలిన శరీరం.. గట్టిగా ఏడిస్తేనే ప్రాణం పోతుందన్న రీతిలో ఉన్న ఆ చిన్నారి ధీనస్థితి సిరియా ఒక జీవచ్చవంలా తయారైన దృశ్యాన్ని కళ్లకు కడుతోంది. ఆ చిన్నారి పేరు సమర్ దోఫ్‌దా. 35రోజుల క్రితం ఓ నిరుపేద దంపతులకు జన్మించింది.

కడు పేదరికం:

కడు పేదరికం:

గర్భం దాల్చిన సమయంలోను ఆ తల్లికి సరైన తిండి దొరక్క ఇలాంటి శిశివు జన్మించింది. అసలే పేదరికం.. శిశువు పౌష్టికాహార లోపంతో పుట్టడంతో ఆ తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. బిడ్డ దక్కుతుందో లేదోనన్న భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని తూర్పు ఘౌటాలోని హమౌరియా పట్టణంలో ఉన్న క్లినిక్ కు తీసుకెళ్లారు.

 కన్నబిడ్డకు పాలివ్వలేని స్థితిలో:

కన్నబిడ్డకు పాలివ్వలేని స్థితిలో:

ఆసుపత్రికి పాపను తెచ్చినప్పుడు ఆమె బరువు 1.9 కిలోలు ఉన్నట్లు చెప్పారు. పోషకాహారలోపంతో బాధపడుతున్న పాప తల్లి పాలివ్వలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. ఆసుపత్రిలో చేర్చిన మరుసటి రోజే సమర్‌ ప్రాణాలు విడిచింది. సమర్‌కు సంబంధించి ఆసుపత్రి విడుదల చేసిన ఫొటోలు ప్రపంచాన్ని కంట తడి పెట్టించాయి.

బిగుసుకుపోయినట్టుగా.. ముడుతలు పడి ఉన్న ఆ చర్మం.. వృద్దుల శరీరాన్ని తలపించేదిగా ఉంది. ఏడవాలన్న చర్మం కదల్లేని స్థితిలో ఆ చిన్నారి నరకయాతన అనుభవించింది. ఆఖరికి ఊపిరి తీసుకోవడానికి చిన్నారి చాలా కష్టపడిందని వైద్యులు చెబుతున్నారు.

సిరియా భవిష్యత్తు?:

సిరియా భవిష్యత్తు?:

సిరియా గుండెపై అంతర్యుద్దం చేస్తున్న గాయాలకు ఇదో మచ్చు తునక మాత్రమే. అధ్యక్షుడు అసద్ సైనిక పాలనకు.. ప్రజలకు మధ్య జరుగుతున్న తిరుగుబాట్లు ఇప్పట్లో ఆగిపోయేలా లేవు. ఈ సంక్షోభంపై అంతర్జాతీయ సమాజం కూడా అంతగా దృష్టి పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ పరిణామాలు సిరియా భవిష్యత్తును మరింత హృదయవిదారకంగా మార్చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Distressing pictures of a baby on the brink of death have emerged from a rebel-held area of Syria, a tragic reminder of the horrors faced daily by civilians in the six-year-old war.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి