హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినీ కెరీరుపైనే జూ ఎన్టీఆర్ దృష్టి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: రాజకీయాల కన్నా సినిమా కెరీర్ పైనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. రాజకీయాల వల్ల సినిమా కెరీర్ కు దెబ్బ తగలకూడదనేది ఆయన ఉద్దేశమని చెబుతున్నారు. మళ్లీ ఎన్నికలు రావడానికి నాలుగున్నరేళ్ల కన్నా ఎక్కువ వ్యవధే ఉంది. అందువల్ల ఈలోగా సినిమాల ద్వారా తన ఇమేజ్ ను మరింత పెంచుకునే ఉద్దేశంతోనే ఆయన ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాదుకు తిరిగి వస్తూ తీవ్రంగా గాయపడి ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం కొత్త సినిమాలు చేస్తున్నారు. అందువల్ల రాజకీయ విధేయతలు సినిమా జీవితానికి అడ్డం రాకూడదనే ఉద్దేశంతోనే ఆయన ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిసి వరద బాధితుల సహాయం కోసం విరాళం ఇచ్చినట్లు చెబుతున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక సినీ రంగంలో తీవ్రమైన తేడాలు వచ్చాయి. కాంగ్రెసు వైపు కూడా చాలా మంది సినీ రంగ ప్రముఖులు మొగ్గు చూపారు. ఈ స్థితిలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు కాంగ్రెసుకు అండదండలు అందిస్తున్న వేళ తాను మడి కట్టుకుని కూర్చోవడం సరి కాదని ఆయన అనుకున్నారని చెబుతున్నారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావుతో కలిసి సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రిని కలవడంతో కొత్త రాజకీయ దుమారం తలెత్తింది. అయితే ఈ విషయాన్ని ముందుగా ఊహించినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మామ నారా చంద్రబాబు నాయుడిపై దాని ప్రభావం ఉంటుందని ఆయన ఊహించలేకపోయారని అంటారు. ఆయన రోశయ్యను కలవడం వల్ల చంద్రబాబు చాలా వరకు ఇరకాటంలో పడ్డారనే చెప్పాలి. దీంతో తాను చంద్రబాబుకు దూరం కాలేదని బయటి ప్రపంచానికి చూపించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. దీంతో మర్నాడు ఆయన చంద్రబాబును కలిసి వరద బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్టుకు మరో 20 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు.

మరో నాలుగున్నర ఏళ్లు అనేది చాలా సమయమేనని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు. అప్పటి వరకు తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వాన్ని సినీ రంగంలో పుణికిపుచ్చుకోవాలనేది ఆయన ఆశయం. దాంతో సినిమాల ఎంపికలో కూడా జాగ్రత్త వహించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. సినీ జీవితం సాఫీగా సాగిపోయి, తన కెరీర్ పెరగడానికి రాజకీయ విధేయతలు, అవిధేయతలు అడ్డు రాకుండా ఆయన చూసుకుంటున్నారని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X