వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివిధ రంగాల్లో అన్యాయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Talli
తెలంగాణ జిల్లాలు పలు సమస్యలను ఎదుర్కుంటున్నాయి. నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్య, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు గిరిజన ప్రాంతాల్లో వైరల్ జ్వరాల వంటి వాటితో ఇబ్బందుల పాలవుతున్నారు. మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో వలసలు పెద్ద పెరుగుతున్నాయి.

విద్య
వివరాలు ఆంద్ర (9 జిల్లాలు), రాయలసీమ (4 జిల్లాలు), తెలంగాణ (10 జిల్లాలు)

విస్తీర్ణం 33.75 శాతం 24.57 శాతం 41.47 శాతం
జనాభా 41.46 శాతం 17.77 శాతం 40.54 శాతం
అక్షరాస్యతా రేటు 42 38 30

మొత్తం పాఠశాలు 26,800 13001 17594
విద్యార్థుల సంఖ్య 27,57,269 13,02,673 20,00,452
ఉపాధ్యాయుల సంఖ్య 64,314 28,434 40,798
జూనియర్ కళాశాలలు 270 140 176
డిగ్రీ కళాశాలలు 10042 4663 8732

ప్రైవేట్ కళాశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్

(పోస్టుల సంఖ్య) 96(535) 32 (511) 31(204)
వైద్య కళాశాలలు 4 4 3
ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలకు గ్రాంట్లు 58.87 శాతం 17.06 శాతం 24.07 శాతం

విద్యార్థులకు ప్రభుత్వ గ్రాంట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం
35, 500 37,300 17,400
ఖర్చు చేసిన సొమ్ము (కోట్ల రూ.లలో) 1308.56 382.47 163.39
ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో జనాభా సరిసమానంగా ఉన్నప్పటికీ విద్యా సౌకర్యాల్లో వ్యత్యాసాన్ని, ఉపాధ్యాయుల్లో తేడాను గమనించవచ్చు. మొత్తం 22 విశ్వవిద్యాలయాల్లో ప్రతి ప్రాంతానికి ప్రత్యేకంగా రెండు విశ్వవిద్యాలయాలున్నాయి. తెలంగాణలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలున్నాయి.

తొలుత జెఎన్టీయును వరంగల్లులో, సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని నల్లగొండలో తలపెట్టారు. అయితే రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలని చెప్పి కొద్ది నెలల్లోనే వాటిని హైదరాబాదుకు తరలించారు. అయితే విజయవాడ, కుప్పం వంటి ప్రాంతాల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో తలపెట్టిన ఐఐటిని హైదరాబాద్ శివారులోని మెదక్ జిల్లాలోకి మార్చారు. భూముల ధరలు పెంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఈ పని చేశారు.

తెలంగాణలో నాలుగు విశ్వవిద్యాలయాల స్థాపనకు ప్రభుత్వం మొత్తం 25 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అవి తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాలు. అయితే రాయలసీమలోని కడప జిల్లాలో వైయస్సార్ సొంత ప్రాంతం ఇడుపులపాయలోని నాలెడ్జి విశ్వవిద్యాలయానికి మాత్రం 300 కోట్ల రూపాయలు కేటాయించింది.

కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలును, సిబ్బందిని సమకూర్చింది. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు మాత్రం మొండిచేయి చూపింది.

ఉపాధి

తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 2.5 లక్షల మంది స్థానికేతరులు ఉద్యోగాలు పొందినట్లు తెంలగాణ ఉద్యోగ సంఘాలు అంచనా వేశాయి. 1986 డిసెంబర్ 31వ తేదీ నాటికి స్థానికేతరులను తమ తమ స్వస్థలాలకు పంపించివేయడానికి 1985 డిసెంబర్ 30వ తేదీన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాలు దీన్ని అమలు చేయకపోగా, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తెలంగాణలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ఉద్యోగులను బదిలీచేసే పనికి పూనుకుంది.

సచివాలయంలో 5 వేల ఉద్యోగాలు ఉండగా పది శాతం మంది మాత్రమే తెలంగాణకు చెందినవారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 50 ఏళ్లలో ఒక్కసారి కూడా తెలంగాణకు అడ్వొకేట్ జనరల్ పదవి దక్కలేదు. న్యాయమూర్తుల్లో 84 మంది ఆంద్రప్రాంతానికి చెందినవారు ఉండగా రాయలసీమకు చెందినవారు 15 మంది, తెలంగాణకు చెందిన వారు 39 మంది మాత్రమే ఉన్నారు. వాణిజ్య పున్నుల అధికారుల్లో 418 మంది ఆంద్రకు, 42 మంది రాయలసీమకు, 161 మంది తెలంగాణకు చెందినవారు.

రాష్ట్రంలోని 320 మంది ఐఎఎస్ అధికారుల్లో 27 మంది తెలంగాణవారున్నారు. అలాగే 230 మంది ఐపియస్ అధికారుల్లో తెలంగాణ అధికారులు 15 మందే. 23 మంది జిల్లా కలెక్టర్లలో తెలంగాణవారికి ప్రాధాన్యమే లేదు. విధాన నిర్ణయాల అధికారం తెలంగాణేతరలు చేతుల్లో ఉందనడానికి ఇది ప్రబల నిదర్శనం. దాని వల్ల సహజంగానే తెలంగాణ ప్రజలకు అభివృద్ధిలో భాగం దక్కలేదు.

ఆర్థికపరమైన అన్యాయానికి కూడా తెలంగాణవారు గురవుతున్నారు. గత 25 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణేతరులు 2 లక్షల 50 వేల మంది సగటున నెలకు 7,500 రూపాయలు పొందుతున్నారు. ఆ రకంగా గత 25 ఏళ్లలో అది 300 నెలలు అవుతుంది. తెలంగాణ ఉద్యోగులు ఆ రకంగా ఆదాయ అవకాశాలను వేతనాల్లో 56,250 కోట్ల రూపాయలు కోల్పోయారు.

సచివాలయంలో 5 వేల ఉద్యోగాలు ఉండగా పది శాతం మంది మాత్రమే తెలంగాణకు చెందినవారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 50 ఏళ్లలో ఒక్కసారి కూడా తెలంగాణకు అడ్వొకేట్ జనరల్ పదవి దక్కలేదు. న్యాయమూర్తుల్లో 84 మంది ఆంద్రప్రాంతానికి చెందినవారు ఉండగా రాయలసీమకు చెందినవారు 15 మంది, తెలంగాణకు చెందిన వారు 39 మంది మాత్రమే ఉన్నారు. వాణిజ్య పున్నుల అధికారుల్లో 418 మంది ఆంద్రకు, 42 మంది రాయలసీమకు, 161 మంది తెలంగాణకు చెందినవారు.

రాష్ట్రంలోని 320 మంది ఐఎఎస్ అధికారుల్లో 27 మంది తెలంగాణవారున్నారు. అలాగే 230 మంది ఐపియస్ అధికారుల్లో తెలంగాణ అధికారులు 15 మందే. 23 మంది జిల్లా కలెక్టర్లలో తెలంగాణవారికి ప్రాధాన్యమే లేదు. విధాన నిర్ణయాల అధికారం తెలంగాణేతరలు చేతుల్లో ఉందనడానికి ఇది ప్రబల నిదర్శనం. దాని వల్ల సహజంగానే తెలంగాణ ప్రజలకు అభివృద్ధిలో భాగం దక్కలేదు.

ఆర్థికపరమైన అన్యాయానికి కూడా తెలంగాణవారు గురవుతున్నారు. గత 25 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణేతరులు 2 లక్షల 50 వేల మంది సగటున నెలకు 7,500 రూపాయలు పొందుతున్నారు. ఆ రకంగా గత 25 ఏళ్లలో అది 300 నెలలు అవుతుంది. తెలంగాణ ఉద్యోగులు ఆ రకంగా ఆదాయ అవకాశాలను వేతనాల్లో 56,250 కోట్ల రూపాయలు కోల్పోయారు.

హదరాబాద్ లోని సచివాలయం, నీటి పారుదుల, రోడ్లు భవనాలు, పోలీసు, హైకోర్టు వంటి ప్రభుత్వ శాఖల్లో 90 శాతం మంది తెలంగాణేతరులే ఉన్నారు. దానివల్ల తెలంగామ ప్రాజెక్టులపై వారికి ఆసక్తి లేకపోవడం అనుభవంలోకి వచ్చింది.

నీటిపారుదల

కృష్ణానది క్యాచ్ మెంట్ ఏరియా 69 శాతం, గోదావరి క్యాచ్ మెంట్ ఏరియా 79 శాతం తెలంగాణలో ఉన్నాయి. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నది జలాల్లో అంధ్రప్రదేశ్ కు కేటాయించిన 81 1 టిఎంసిల్లో తెంలగాణకు 480 టిఎంసిల జలాలు దక్కాల్సి ఉంది. అయితే కృష్ణా నది జలాలు తెలంగాణకు 130 టిఎంసిల నీళ్లు మాత్రమే దక్కుతున్నాయి. కృష్ణానది జలాలు 35 లక్షల ఎకరాలకు అందుతుంటే అందులో ఐదు లక్షల ఎకరాలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి.

గోదావరిలోని 1430 టిఎంసిల్లో తెలంగాణకు 760 టిఎంసిల జలాలు దక్కాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణకు 200 టిఎంసిలు మాత్రమే అందుతున్నాయి. గోదావరి జలాల ద్వారా ఆంధ్రలో 12 లక్షల ఎకరాలు సాగవుతుంటే తెలంగాణలో 4 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోంది.

ఆంద్రప్రదేశ్ అవతరణకు ముందు హైదరాబాద్ రాష్ట్రం రాజోలిబండ డైవర్షన్ స్కీం పథకాన్ని చేపట్టింది. దీని ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉంది. అయితే కర్నూలు జిల్లాలోని కొంత మంది భూస్వాములు దాని ద్వారా తెలంగాణకు నీరే రాకుండా చేస్తున్నారు. పాలక పార్టీ నాయకులు రాజోలిబండ డైవర్షన్ స్కీం గేట్లను ధ్వంసం చేసి కర్నూలు జిల్లాకు నీరు మళ్లించుకున్నారు.

ప్రథమ పంచ వర్ష ప్రణాళికలో వ్యవసాయానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో 1956 నుంచి 2002 వరకు వ్యవసాయంపై దాదాపు 12,104 కోట్ల రూపాయలు వెచ్చించారు. దీని వల్ల సేద్యం భూమి 27.47 లక్షల ఎకరాల నుంచి 55 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో ఎక్కవ భాగం ఆంధ్ర ప్రాంతంలోనే ఉంది. తెలంగాణలోని చిన్ని నీటి పారుదలపై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రణాళికా సంఘం నివేదిక ప్రకారమే కాలువల ద్వారా ఆంధ్ర ప్రాంతంలో 79 శాతం సాగవుతుంటే తెలంగాణలో 17 శాతం మాత్రమే సాగవుతోంది.

1960 నాటికి తెలంగాణలో 4 వేల చెరువులు, 20 వేల కుంటలు ఉన్నాయి. వాటి ద్వారా తెలంగాణలో 13 లక్షల ఎకరాల భూములు సాగవుతూ వస్తుండేవి. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఆ సాగు విస్తీర్ణం ఐదు లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. చెరువుల్లో, కుంటల్లో మేటలు వేసిన ఇసుకను తోడివేసే పనులు జరగలేదు. వాటి గండ్లను పూడ్చలేదు. పట్టణీకరణలో భాగంగా కొన్ని చెరువులను ఉద్దేశ్యవూర్వకంగా నాశనం చేశారు. దీంతో తెలంగాణలోని వ్యవసాయోత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడింది. గత యాభై ఏళ్ల తెలంగాణలో సేద్య భూమూలు 27 శాతానికి తగ్గాయి.

ఆంద్ర ప్రాంతంలో ప్రాజెక్టుల కింద కాల్వల ద్వారా రైతులు సాగునీరు పొందుతుంటే, తెలంగాణ రైతులు బావులు తవ్వుకుని విద్యుత్ పంపుసెట్లను పెట్టుకోవాల్సి వస్తున్నది. అదనంగా విద్యుత్తు కోసం నెలక 300 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తున్నది. అటువంటి ఖర్చులేమీ లేకుండా ఆంధ్ర రైతులు నీరు పొందుతున్నారు.

పైగా, ఆంద్ర ప్రాంతం వ్యవసాయ భూములకు నీరు అందించడానికి తెలంగాణ ప్రాంతంలోని భూములకు కాలువల నీటిని తగ్గిస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతున్నది. ఆంధ్ర ప్రాంతం భూములకు సాగునీరందించడానికి వరుస ప్రభుత్వాలు ప్రాజెక్టులపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ వస్తున్నాయి.

ఆంద్ర ప్రాంతంలోని ఒక్క గుంటూరు జిల్లాలోని సేద్యం భూమికి సరిపడా భూములు మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా సాగవుతున్నాయి.
నదీ జలాల్లో న్యాయమైన వాటా దక్కి ఉంటే మరో 30 లక్షల ఎకరాలు తెలంగాణలో గత యాభై ఏళ్లలో సాగులోకి వచ్చి ఉండేది.
దాని వల్ల తెలంగాణ దాదాపు లక్షా యాభే వేల కోట్ల రూపాయల విలువ చేసే వ్యవసాయ దిగుబడుల సామర్థ్యాన్ని నష్టపోయింది.

పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీసి మళ్లించే ప్రయత్నం జరుగుతున్నది. దీనివల్ల నల్లగొండ, ఖమ్మం (తెలంగాణ), కృష్ణా, గుంటూరు, ప్రకాశం (ఆంద్ర) జిల్లాల ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడుతుంది. దానికి 24 టిఎంసిల నికర జలాలు మాత్రమే అందుబాటులో ఉండగా 300 టిఎంసిల నీటిని రాయలసీమకు తరలించే ఏర్పాటు జరిగింది. దీనివల్ల మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాలకు వరద ముప్పు కూడా సంభవించింది. నాగార్జున సాగరులో అదనపు జలాలను నిలువ చేయడం వల్ల, ఆ జలాలను కృష్ణా జిల్లాకు విడుదల చేయకపోవడం వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ పొంగిపొర్లి కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలను ముంచేసింది.

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలంతో పాటు 220 గ్రామాలు ముంపునకు గురవుతాయి. దాదాపు 3 లక్షల మంది నిరాశ్రయులవుతారు. ఈ ప్రాజెక్టును తెలంగాణలో ప్రతిపాదించినప్పటికీ తెలంగాణలోని ఒక్క ఎకరానికి కూడా నీరు అందదు, దాని ద్వారా ఆంధ్ర ప్రాంతంలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలతో 26 ప్రాజెక్టుల ద్వారా 56 లక్షల ఎకరాల భూములు అదనంగా సాగవుతుంది. అయితే ఇందులో ఆంధ్ర ప్రాంతంలో 43 లక్షల ఎకరాలుండగా, తెలంగాణలో 17 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నాయి.

1</a> | <a href=2 | 3 | 4 | 5 | 6 | 7" title="1 | 2 | 3 | 4 | 5 | 6 | 7" />1 | 2 | 3 | 4 | 5 | 6 | 7

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X