బాబు డ్రామా ఎన్నాళ్లు?

Chandrababu Naidu
రెండు ప్రాంతాలు తనకు రెండు కళ్లు అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. రెండు వైపులా వాదనలను తన పార్టీకి చెందిన నాయకులే చేస్తుంటే ఆయన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదంటూ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరుతూ ప్రభుత్వం శాసనసభలో ప్రతిపాదించాలని తలపెట్టిన తీర్మానానికి అనుకూలంగానూ వ్యతిరేకంగానూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులే బల్లగుద్ది వాదిస్తున్నారు. తీర్మానం ప్రతిపాదించాలని తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులు బుధవారం శాసనసభ కార్యకలాపాలను స్తంభింపజేశారు. నాగం జనార్దన్ రెడ్డి ఈ విషయంలో ముఖ్యమంత్రి రోశయ్య చిత్తశుద్ధిని, ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించారు. తెలంగాణ ఛాంపియన్ తెలుగుదేశం పార్టీయే అన్నట్లుగా వాదించారు.

తీర్మాన ప్రతిపాదనకు ముందు రోశయ్య బుధవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు ప్రాంతాల ప్రతినిధులు వెళ్లారు. ఆ సమావేశంలో పార్టీ నిర్ణయంగా తీర్మానానికి మద్దతిస్తామని చెప్పినట్లు వార్తాకథనాలను బట్టి అర్థమవుతోంది. అలా పార్టీ నిర్ణయం ప్రకటించిన తర్వాత సీమాంధ్ర శాసనసభ్యులు ఎలా వ్యతిరేకిస్తారనేది ప్రశ్న. గురువారం శాసనసభలో తీర్మాన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు చిందులేశారు. సమైక్యాంధ్ర నినాదం చేసుకున్న ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులతో కలిసి వారు తీర్మానాన్ని వ్యతిరేకించారు. తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీర్మానం ఆమోదించిన ఈ రోజును బ్లాక్ డేగా అభివర్ణించారు. ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. రెండు ప్రాంతాలకు రెండు నాల్కలు పెట్టుకుని న్యాయం కోసం చంద్రబాబు ఎలా పోరాడుతారనేది ప్రశ్న.

చంద్రబాబుకు రెండు ప్రాంతాలు రెండు కళ్లుగా పనిచేస్తున్నాయో, లేదో గానీ రెండు ప్రాంతాలు రెండు నాలుకలుగా మాత్రం పనిచేస్తున్నాయనేది గత అనుభవమే కాకుండా తాజా సంఘటన కూడా రుజువు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలోనూ చంద్రబాబు పార్టీ నాయకులు ఇలా రెండుగా విడిపోయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారనేది కాదనలేని నిజం. తీర్మానాన్ని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రోశయ్య తమ కాంగ్రెసు పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులకు నచ్చజెప్పుకున్నారు. తన పార్టీ శాసనసభ్యులకు నచ్చజెప్పుకున్న తర్వాతనే ఆయన శాసనసభలో ఫ్రీజోన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులు కూడా వ్యతిరేకించి ఉంటే తీర్మానం ప్రతిపాదించే వెసులుబాటు కూడా ఉండేది కాదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రోశయ్య వ్యవహరించినట్లు ఒక పెద్ద తరహాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వ్యవహరించకపోవడం వల్లనే సమస్యలు తీవ్రమవుతూ వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+