గాలి సోదరులకు ఊరట

గాలి సోదరులను పక్కకు తప్పించగలిగితేనే రాష్ట్రంలో రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి వీలవుతుందనేవారు కూడా ఉన్నారు. యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని కూల్చగలిగితే గాలి సోదరులకు కళ్లెం వేయడానికి కుదురుతుందని కాంగ్రెసుతో పాటు జెడిఎస్ నాయకులు కూడా భావిస్తున్నారు. పార్టీలోని ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారనే ఉద్దేశంతో బిజెపిలో ఓ వర్గం కూడా వారిపై కోపంగా ఉంది. యెడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్ష నెగ్గే వరకు గాలి సోదరులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేంద్రంలో తమకు తీవ్ర వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెసు ప్రభుత్వం ఉండడం వల్ల యెడ్యూరప్ప ప్రభుత్వం పడిపోతే గాలి సోదరులకు కనాకష్టంగానే ఉండేది. అక్రమ మైనింగ్ ఆరోపణలు వారిపై బోలెడు ఉన్నాయి. వాటిని ఆసరా తీసుకుని గాలి సోదరులకు అవకాశం చిక్కితే ముప్పు తిప్పలు పెట్టేందుకు కాంగ్రెసు సిద్ధంగా ఉంది.
గాలి సోదరులు తిరుగుబాటు చేసినప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు యెడ్యూరప్ప స్థానంలో తమకు పూర్తిగా అనుకూలంగా ఉండే నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలని వారు భావించారు. వారు ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకోలేదు. ప్రస్తుత తిరుగుబాటు ప్రభుత్వాన్ని కూల్చేయాలనేది. ప్రస్తుత తిరుగుబాటు వల్ల ప్రభుత్వం కూలిపోయి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తే గాలి సోదరులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉండేది. వారు ప్రభుత్వ పతనాన్ని కోరుకోలేదు. అందువల్లనే ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications