బాబుతో కిరణ్ వైరం ఏనాటిదో

చంద్రబాబుకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య వైరం 1970 నాటి నుంచి సాగుతూనే ఉన్నది. అప్పట్లో చంద్రబాబు కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి కూడా కాంగ్రెసులోనే ఉన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు తిరుగుబాటు అభ్యర్థిని పోటీకి దించారు. అది కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి, చంద్రబాబుకు మధ్య వైరానికి పాదులు వేసింది. ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి సతీమణి సరోజమ్మకు వ్యతిరేకంగా చంద్రబాబు తిరుగుబాటు అభ్యర్థిని దించారు. అమర్నాథ్ రెడ్డి మరణంతో సరోజమ్మ పోటీ చేశారు.
అనంతరం చంద్రబాబు తన మామ స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి ప్రవేశించారు. అమర్నాథ్ రెడ్డి కుటుంబం కాంగ్రెసులోనే ఉండిపోయింది. మొదటి నుంచీ అమర్నాథ్ రెడ్డి కాంగ్రెసు అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. విధేయతను కూడా ప్రదర్సిస్తూ వచ్చింది. 2004 - 2009 మధ్య కాలంలో చంద్రబాబును పలుమార్లు ఇరకాటంలో పెట్టారు. అయితే, వారిద్దరు విభేదాలను విమర్శించి పనిచేస్తారని అనుకోవడానికి లేదని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం చంద్రబాబుకు కూడా మింగుడు పదని విషయమేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications