హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధిష్టానం చేతిలో చిత్తయిన జగన్ నెక్ట్స స్టెప్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా వ్యూహంపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఒక వర్గమంటూ, కుట్రలు, కుతంత్రాలు తెలియని రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, రోశయ్యపై, అధిష్టానంపై ఎదురుదాడి చేశారు. తన మీడియాలో వైఎస్ ప్రభుత్వ పథకాలేవి సక్రమంగా అమలుగాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నరని, జగన్ ను ముఖ్యమంత్రిగా చేస్తే అన్ని పథకాలు సక్రమంగా అవుతాయని చెప్పించే ప్రయత్నాలు చేశారు. రోశయ్యను ముఖ్యమంత్రి పీఠంపైనుండి దింపేస్తే జగన్ కే అవకాశం దక్కుతుందని జగన్ తో పాటు ఆయన వర్గం వారందరూ ఊహించుకున్నారు. అయితే వారు ఊహలకు అందనివిధంగా రోశయ్యను తప్పించిన అధిష్టానం సామాజికం, వర్గం, ప్రాంతీయం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని జగన్ కు చెక్ పెట్టగల సరియైన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డియేనని భావించి ఆయనను ముఖ్యమంత్రిగా కూర్చుండబెట్టినట్లు సమాచారం. దీంతో జగన్, ఆయన వర్గీయులు పూర్తి నిరాశకు లోనయ్యారు. జగన్ తన మీడియా సాక్షిలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి రోజే ఆయనను టార్గెట్ గా చేసుకున్నారు. అధిష్టానం అనుమతితోనే వైఎస్ పథకాలు ప్రవేశపెట్టాడన్న ఆయన వ్యాఖ్యలను సాక్షిలో మొదటి పుటలో విశ్లేషిస్తూ వ్యతిరేకించింది.

అధిష్టానం తనంత తానే తనను బయటకు పంపాలని ఉద్దేశ్యంతోనే ఆయన సాక్షిలో సోనియాకు వ్యతిరేకంగా కథనాలు రాశారు. లేదా తనను అత్యున్నత పీఠం కూర్చుండ బెట్టాలనుకున్నారు. పార్టీ తనను బయటకు పంపిస్తే ప్రజల్లో సానుభూతి పొందవచ్చని భావిస్తున్నారు. అయితే ఆయన ఉద్దేశ్యాన్ని గమనించిన అధిష్టానం కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టు ఆయన్ను బయటకు పంపించకుండా ఆయనంత ఆయనే బయటకు వెళ్లేలా తన ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కిరణ్ ను తీసుకు వచ్చి కూర్చుండబెట్టింది. దీంతో అధిష్టానం ఎత్తులతో జగన్ చిత్తయ్యాడు.

అయితే ఇప్పుడు జగన్ తన అనుచరులను మంత్రివర్గంలోకి తీసుకుంటే కూల్ గా ఉంటాడా, కిరణ్ కు సహకరిస్తాడా అనేదే అందరి ముందున్న ప్రశ్న. జనవరిలో మిగిలి జిల్లాల్లో ఓదార్పు ప్రారంభిస్తున్నట్టు సమాచారం. సాక్షిలో ఇప్పటికే కిరణ్ ను వ్యతిరేకంగా కథనాలు ప్రసారమయ్యాయి. ఇటీవలి ఓదార్పులో రోశయ్యను లక్ష్యంగా చేసుకన్న జగన్ ఇప్పుడు కిరణ్ ను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రోశయ్య తరువాత తనకు రావచ్చని అనుకున్న జగన్ ఆశలు పూర్తిగా అడియాసలయ్యాయి. దీంతో ఆయన నెక్స్ట స్టెప్ అధిష్టానంపట్ల పరోక్షంగా మరింత ధిక్కార ధోరణి ప్రదర్శించి బయటకు వెళ్లడానికి ప్రయత్నాలే ఆయనకు మిగిలి ఉన్నాయి. ఆయన కూడా అదే చేయవచ్చు.

అయితే అధిష్టానం సైతం జగన్ అనుచరులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి ఆయనకు దూరం చేయడమా, లేదా వారిని దూరం ఉంచడమా అనేది ఆలోచిస్తున్న విషయం. అయితే జగన్ అనుచరులను దూరంగా ఉంచడానికే ముఖ్యమంత్రి మార్పు అనే వాళ్లు కూడా ఉన్నారు. అధిష్టానానికి పూర్తిగా అనుకూలంగా ఉన్నవారినే మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారంటున్నారు. సాక్షిలో సోనియాకు వ్యతిరేకంగా వచ్చిన కథనాన్ని ఖండించిన పలువురికి మంత్రి పదవులు దక్కే అవకాశాన్ని కొట్టిపారేయేము. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందకు దాదాపు బెర్తు ఖరారు అయినట్టే భావిస్తున్నారు. వివేకానంద గతంలోనే సోనియా నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నానని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X